అన్వేషించండి

Bigg Boss OTT 2: ‘బిగ్ బాస్’ హౌస్ లో ‘ముద్దు‘ దుమారం, క్షమాపణలు చెప్పిన సల్మాన్ ఖాన్

బిగ్ బాస్ OTT 2లో ఆకాంక్ష పూరి-జాద్ హదీద్ ముద్దు వ్యవహారంపై ప్రేక్షకులకు సల్మాన్ ఖాన్ క్షమాపణలు చెప్పారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే షో నుంచి తప్పుకుంటానని హెచ్చరించారు.

ఆన్ స్క్రీన్ మీద ముద్దు సన్నివేశాలకు దూరంగా ఉండే బాలీవుడ్ నటులలలో సల్మాన్ ఖాన్ ఒకరు. ఆయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించినా, ముద్దు సీన్లకు దూరంగానే ఉన్నారు. కానీ, తను హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ OTT 2లో కంటెస్టెంట్లు ముద్దులు పెట్టుకోవడంతో ఆయన కోపం హద్దులు దాటింది. ఇటీవల బిగ్ బాస్ హౌస్ లో ఆకాంక్ష పూరి,  జాద్ హదీద్ లిప్ లాక్ చేయడంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు.  వీకెండ్ కా వార్ సందర్భంగా ఈ ఇద్దరు పోటీదారులపై కోప్పడ్డారు. ముఖ్యంగా జాద్  గొడవ సమయంలో బేబికా ధుర్వేకు తన వెనుక భాగాన్ని చూపించడంపై హౌస్‌ మేట్స్ కూడా షాక్ అయ్యారు.

జాద్ హదీద్‌, ఆకాంక్ష పూరి ముద్దు వ్యవహారంపై సల్మాన్ ఆగ్రహం

వీకెండ్ కా వార్ ఎపిసోడ్ ప్రారంభం కాగానే, హౌస్‌లో గత వారంలో ఏం జరిగిందనే దాని గురించి సల్మాన్ మాట్లాడారు. హౌస్ లో కంటెస్టెంట్లు చేసిన అతిపై ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ కఠినమైన సెన్సార్‌షిప్ నియమాలతో, ఈ షో డిజిటల్ ప్లాట్‌ ఫారమ్‌ లో స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ, జాద్ వ్యవహారాన్ని ప్లే చేయట్లేదని చెప్పారు.  షోలో వీటన్నింటికి ప్రత్యక్ష సాక్షిగా ప్రేక్షకులకు క్షమాపణలు కూడా చెప్పారు. ఇలాంటి కంటెంట్‌పై తనకు నమ్మకం లేదన్నారు. ఇక వీకెండ్ వార్ లో జాద్ హదీద్‌ని  ప్రత్యేకంగా ప్రశ్నించారు సల్మాన్.  వ్యక్తిగతంగా తెలిసిన మహిళలతో ఇలా చేసి ఉంటావా? అని ప్రశ్నించారు. జాద్, ఆకాంక్షను తీవ్రంగా మందలించారు. జాద్ మొదట తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించగా, తర్వాత సల్మాన్‌కు క్షమాపణలు చెప్పాడు. నిజంగా తన చర్యలకు పశ్చాత్తాపపడుతున్నానని చెప్పాడు. “ఇలాంటి చర్యలు కొంత మందికి ఓకే కావచ్చు. కానీ. కొందరు మనస్తాపం చెందుతారు. ఈ దేశం సాంప్రదాయికమైనది. కానీ, చాలా క్షమించేది కూడా. అది మనతో పాటు చాలా మందిని క్షమించింది” అని సల్మాన్ కోపంగా చెప్పారు.

బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు సల్మాన్ వార్నింగ్

మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని సల్మాన్ బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు  వార్నింగ్ ఇచ్చారు. కాదని ఇలాగే ప్రవర్తిస్తే కచ్చికతంగా ఈ షో నుంచి తప్పుకుంటానని హెచ్చరించారు. మీరందరూ ఈ వారంలో ఇదే హైలైట్ అని అనుకుంటున్నారు. ఈ ఘటనలు మన పెంపకం, కుటుంబ విలువలు, సంస్కృతి ప్రకారం జరిగాయా? నువ్వు ఏం చేసినా నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. నేను పట్టించుకోను. నేను ఇక్కడి నుండి బయటపడతాను.  నేను ఈ షో నుంచి వెళ్లిపోతాను” అని సల్మాన్ హెచ్చరించారు.  

బేబికా ధుర్వే ప్రవర్తనపై సల్మాన్ ఆగ్రహం

షోలో బేబికా ధుర్వే ప్రవర్తనను కూడా సల్మాన్ ఖాన్ బయటపెట్టారు. సహ హౌజ్‌మేట్‌లకు వ్యతిరేకంగా ఆమె గట్టిగా, అనుచిత మాటలు మాట్లాడాన్ని తప్పుబట్టారు. జ్యోతిష్యుడు జనార్దన్ కుమార్తె  అయిన బేబికా ఇంత అసభ్యంగా ఎలా ప్రవర్తించగలిగింది? అని సల్మాన్ ఆశ్చర్యపోయాడు. ఆమె ఇతర హౌస్‌మేట్స్‌ తో మాట్లాడుతున్నట్లే, ఏదో ఒక రోజు తనతో కూడా అలాగే గొడవపడటంతో పాటు దుర్భాషలాడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఎపిసోడ్ లో ఆకాంక్ష పూరి, జియా శంకర్,  అభిషేక్ మల్హాన్, అకా ఫుక్రా ఇన్సాన్‌ లో ఒకరు బిగ్ బాస్ OTT 2 నుండి ఎలిమినేట్ అవుతారు.

Read Also: తమన్నా, విజయ్‌ల లవ్ స్టోరీ అలా మొదలైందట - అసలు విషయం చెప్పేసిన ‘లస్ట్ స్టోరీస్ 2’ దర్శకుడు

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget