Bigg Boss OTT: బిగ్ బాస్ ఓటీటీలో టాప్ సింగర్.. ఒప్పుకుంటాడా..?

హేమచంద్రకు ఇంతకుముందే బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశాలు వచ్చాయట. కానీ ప్రతీసారి ఆయన నో చెబుతూనే ఉన్నాడు.

FOLLOW US: 

బుల్లితెరపై బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే తెలుగులో మొత్తం ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది బిగ్ బాస్. ఇప్పుడు కొత్తగా బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ ను మొదలుపెట్టబోతున్నారు. డిస్నీ హాట్ స్టార్ లో ప్రత్యేకంగా ఓటీటీ వెర్షన్ టెలికాస్ట్ అవుతుంది. ఇప్పటికే హిందీలో ఇలా ప్లాన్ చేశారు కానీ ఆశించిన స్థాయిలో వ్యూస్ రాలేదు. కానీ తెలుగులో మాత్రం కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారట. 

ఈ ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ షో కేవలం పది వారాలు మాత్రమే ఉంటుందట. టీవీల్లో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో వంద రోజులకు పైగానే ఉంటుంది. కానీ ఓటీటీ వెర్షన్ మాత్రం పది వారాల వరకే ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్స్ ను ఫైనల్ చేసే పనిలో పడ్డారు. ఇప్పటివరకు పదిహేను మందిని షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. 

వీరిలో టాలీవుడ్ టాప్ సింగర్ ఉన్నట్లు సమాచారం. అతడు మరెవరో కాదు.. హేమచంద్ర. ప్రతిసారి బిగ్ బాస్ షోలో డిఫరెంట్ కేటగిరీలకు చెందిన వారిని తీసుకుంటూ ఉంటారు. వారిలో సింగర్స్ కూడా ఉంటారు. ఈసారి సింగర్ హేమచంద్రను హౌస్ లోకి పంపించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అతడితో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. 

నిజానికి హేమచంద్రకు ఇంతకుముందే బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశాలు వచ్చాయట. కానీ ప్రతీసారి ఆయన నో చెబుతూనే ఉన్నాడు. మరి ఈసారైనా హౌస్ లోకి వెళ్లడానికి ఒప్పుకుంటాడో లేదో చూడాలి. ఇక హేమచంద్ర కెరీర్ విషయానికొస్తే.. సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో తన సత్తా చాటుతున్నాడు. 'ఆర్ఆర్ఆర్' లాంటి క్రేజీ ప్రాజెక్ట్ లో కూడా పాటలు పాడారు. 

Also Read: మెగా హీరో కొత్త సినిమా టైటిల్ ఇదేనా..?

Also Read: సమంతతో విడాకులపై స్పందించిన చైతు.. ఇప్పుడు నేను హ్యాపీ..

Also Read: అక్కడ వినిపించుకునే నాథుడు ఉండాలి కదా..? టికెట్ రేట్ ఇష్యూపై బాలయ్య వ్యాఖ్యలు..

Also Read: ఇలా బెదిరిస్తే వచ్చి కొడతా.. ప్రభాస్ ఫ్యాన్స్ కి 'రాధేశ్యామ్' డైరెక్టర్ వార్నింగ్..

Also Read: 22 ఏళ్ల తరువాత మెగాస్టార్ తో రవితేజ.. ఈసారి ఎలాంటి హిట్ కొడతారో..?

Also Read: ఫూల్స్ డే రోజు మహేష్ రాడట.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
Published at : 12 Jan 2022 08:18 PM (IST) Tags: Hemachandra Bigg Boss Telugu Bigg Boss OTT Bigg Boss Telugu OTT

సంబంధిత కథనాలు

Gruhalakshmi August 8th Update: తులసితో సామ్రాట్ వైజాగ్ టూర్-  నందుతో ఇంకేం ప్రాబ్లం ఉండదని తులసికి హామీ ఇచ్చిన సామ్రాట్

Gruhalakshmi August 8th Update: తులసితో సామ్రాట్ వైజాగ్ టూర్- నందుతో ఇంకేం ప్రాబ్లం ఉండదని తులసికి హామీ ఇచ్చిన సామ్రాట్

Rashmika New Movie : అక్కినేని హీరోతో తొలిసారి - మహేష్ దర్శకుడు తీయబోయే సినిమాలో?

Rashmika New Movie : అక్కినేని హీరోతో తొలిసారి - మహేష్ దర్శకుడు తీయబోయే సినిమాలో?

Devatha August 8th Update: మాధవకి చుక్కలు చూపించిన రాధ- రుక్మిణి గురించి నిజం తెలుసుకుని షాకైన సత్య

Devatha August 8th Update: మాధవకి చుక్కలు చూపించిన రాధ- రుక్మిణి గురించి నిజం తెలుసుకుని షాకైన సత్య

Ennenno Janmalabandham August 8th Update: యష్, వేద కర్టన్ లో రొమాన్స్ - ఖైలాష్ ని విడిపించేందుకు అభిమన్యు తిప్పలు

Ennenno Janmalabandham August 8th Update: యష్, వేద కర్టన్ లో  రొమాన్స్ - ఖైలాష్ ని  విడిపించేందుకు అభిమన్యు తిప్పలు

Tollywood: విజయ్ కోసం ఎగబడుతున్న జనాలు - అలియాభట్ ఇన్స్టాగ్రామ్ సంపాదన!

Tollywood: విజయ్ కోసం ఎగబడుతున్న జనాలు - అలియాభట్ ఇన్స్టాగ్రామ్ సంపాదన!

టాప్ స్టోరీస్

TTD: తిరుమలలో మూడు రోజులపాటు ఆర్జిత సేవలు రద్దు, కీలక ప్రకటన చేసిన టీటీడీ

TTD: తిరుమలలో మూడు రోజులపాటు ఆర్జిత సేవలు రద్దు, కీలక ప్రకటన చేసిన టీటీడీ

Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దుర్మరణం!

Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దుర్మరణం!

ఫైనల్స్‌లో పోరాడి ఓడిన టీమిండియా - రజతంతోనే సరి!

ఫైనల్స్‌లో పోరాడి ఓడిన టీమిండియా - రజతంతోనే సరి!

Employment Office: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఉపాధి కల్పన వయోపరిమితి పెంపు!!

Employment Office: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఉపాధి కల్పన వయోపరిమితి పెంపు!!