‘800’ ట్రైలర్ లాంచ్‌కు సచిన్ టెండూల్కర్, ‘డెవిల్’ కోసం భారీ సెట్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
శ్రీలంక స్పిన్ మాంత్రికుడి సినిమా ట్రైలర్ విడుదలకు క్రికెట్ గాడ్
లెజెండరీ క్రికెటర్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా '800' రూపొందుతున్న విషయం ప్రేక్షకులకు తెలుసు. ఈ చిత్రానికి ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహిస్తున్నారు. బుకర్ ప్రైజ్ (2022) విన్నర్ షెహన్ కరుణతిలకతో కలిసి ఆయన స్క్రిప్ట్ రాశారు. ఈ చిత్రంలో మురళీధరన్ పాత్రలో 'స్లమ్‌డాగ్ మిలియనీర్' ఫేమ్ మధుర్ మిట్టల్, మురళీధరన్ భార్య మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... రేపు సినిమా ట్రైలర్ విడుదల కానుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'డెవిల్' - కళ్యాణ్ రామ్ సినిమా కోసం దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా భారీ సెట్స్!
నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'డెవిల్'. బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్... అనేది ఉప శీర్షిక. దేశానికి స్వాతంత్య్రం రాక ముందు... 1940ల కాలంలో చిత్ర కథ సాగుతుంది. చారిత్రక నేపథ్యంలోని కథతో తెరకెక్కుతున్న సినిమా అన్నమాట. పీరియాడిక్ ఫిల్మ్ అంటే ఆ కాలాన్ని ప్రతిబింబించేలా సెట్స్ వేయాలి కదా! 'డెవిల్' కోసం ప్రొడక్షన్ డిజైనర్ గాంధీ నడికుడికర్ ఆ పని చేశారు. ఆయన వేసిన ఒక్కో సెట్ చూస్తుంటే... ప్రేక్షకుల మైండ్ బ్లాక్ కావడం ఖాయమని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఒకటి, రెండు, మూడు... పది, పదిహేను, ఇరవై కాదు... 'డెవిల్' కోసం ఏకంగా 80 సెట్స్ వేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ఓవర్సీస్ మార్కెట్ పై ఫోకస్ పెట్టిన జాతిరత్నం.. ‘Miss. శెట్టి Mr. పోలిశెట్టి’ ప్రమోషన్స్ కోసం అమెరికా పయనమైన నవీన్ పోలిశెట్టి!
భారతీయ సినిమాలకు ఓవర్ సీస్ మార్కెట్ కీలకమనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా మన తెలుగు చిత్రాలకు ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉంటుంది. దేశీయ మార్కెట్ లో పెద్దగా ప్రభావం చూపని సినిమాలు సైతం అమెరికాలో సత్తా చాటిన సందర్భాలు చాలా ఉన్నాయి. కరోనా వైరస్ విజృంభనతో రెండేళ్ల క్రితం మార్కెట్ దెబ్బతిన్నప్పటికీ, ఇటీవల కాలంలో ట్రేడ్ మళ్ళీ పుంజుకుంది. తెలుగు చిత్రాలు ఎప్పటిలాగే యూఎస్ బాక్సాఫీస్ వద్ద మిలియన్ డాలర్ల వసూళ్లను రాబడుతున్నాయి. అందుకే మన ఫిలిం మేకర్స్, హీరో హీరోయిన్లు ఒకప్పటి మాదిరిగానే అమెరికాకు వెళ్లి సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ‘Miss. శెట్టి Mr. పోలిశెట్టి’ ప్రమోషన్స్ కోసం యువ హీరో నవీన్ పోలిశెట్టి యూఎస్ కు పయనమయ్యారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
‘బిగ్ బాస్’ సీజన్ 7లో నామినేషన్స్ మొదలు - లిస్ట్‌లో 8 మంది, ఎవరంటే?
‘బిగ్ బాస్’ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురుచూసిన ఫ్యాన్స్‌కు లాంచ్ ఎపిసోడ్ మంచి ఫీస్ట్‌నే అందించింది. కంటెస్టెంట్స్‌గా 14 మంది హౌజ్‌లోకి వెళ్లారు. ముందుగా సీజన్స్‌తో పోలిస్తే ఈ సీజన్‌లో రూల్స్ అన్నీ చాలా మారాయి. ఉల్టా పుల్టా సీజన్ అంటూ ప్రేక్షకులు మరింత ఆసక్తికరంగా ఎదురుచూసేలా చేస్తున్నారు నాగ్. ఎన్ని మారినా.. నామినేషన్స్, ఎలిమినేషన్ మాత్రం మారవు కదా.. అందుకే ‘బిగ్ బాస్’ సీజన్ 7లో మొదటి నామినేషన్స్ పూర్తయ్యాయి. ఈసారి నామినేషన్స్‌లో 8 మంది ఉన్నట్టు సమాచారం. ‘బిగ్ బాస్’ హౌజ్‌లోకి వెళ్లి ఒకరోజే అయినా.. అసలు ఒకరి గురించి ఒకరికి సరిగా తెలియకపోయినా.. ఫస్ట్ డే నామినేషన్స్ మాత్రం తప్పవు అంటున్నారు ‘బిగ్ బాస్’. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
బిగ్ స్క్రీన్‌పై మళ్లీ ‘సిల్క్’ మ్యాజిక్ - సీజీతో సాధ్యం చేసిన ‘మార్క్ ఆంటోని’ టీమ్!
విశాల్, ఎస్‌జే సూర్య నటిస్తున్న తమిళ సినిమా ‘మార్క్ ఆంటోని’. వీరిద్దరికీ తెలుగులో మంచి మార్కెట్ ఉంది కాబట్టి డబ్ అవుతుంది. ఈ సినిమా సెప్టెంబర్ 15వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ‘మార్క్ ఆంటోని’ ట్రైలర్ కూడా ఆదివారం విడుదల అయింది. ఒకప్పటి అందాల నటి సిల్క్ స్మితను కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా ఈ సినిమాలో రీక్రియేట్ చేశారు. అది ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. ఈ ట్రైలర్‌లో ఒక సీన్‌లో సిల్క్ స్మిత కనిపిస్తారు. సిల్క్ స్మితను ఎస్ జే సూర్య చూస్తుండగా... విశాల్ ‘మా వాడు లేడీస్ మేటర్‌లో డిసిప్లిన్డ్ గ్యాంగ్‌స్టర్.’ అనగానే ఎస్‌జే సూర్య ముందుకు వచ్చి సిల్క్ స్మిత చేతి మీద ముద్దు పెడతాడు. ఇంతే కాకుండా సిల్క్ స్మితతో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉన్నట్లు కనిపించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)