By: ABP Desam | Updated at : 04 Sep 2023 04:07 PM (IST)
Image Credit: Star Maa, Disney Hotstar
‘బిగ్ బాస్’ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురుచూసిన ఫ్యాన్స్‌కు లాంచ్ ఎపిసోడ్ మంచి ఫీస్ట్‌నే అందించింది. కంటెస్టెంట్స్‌గా 14 మంది హౌజ్‌లోకి వెళ్లారు. ముందుగా సీజన్స్‌తో పోలిస్తే ఈ సీజన్‌లో రూల్స్ అన్నీ చాలా మారాయి. ఉల్టా పుల్టా సీజన్ అంటూ ప్రేక్షకులు మరింత ఆసక్తికరంగా ఎదురుచూసేలా చేస్తున్నారు నాగ్. ఎన్ని మారినా.. నామినేషన్స్, ఎలిమినేషన్ మాత్రం మారవు కదా.. అందుకే ‘బిగ్ బాస్’ సీజన్ 7లో మొదటి నామినేషన్స్ పూర్తయ్యాయి. ఈసారి నామినేషన్స్‌లో 8 మంది ఉన్నట్టు సమాచారం. ‘బిగ్ బాస్’ హౌజ్‌లోకి వెళ్లి ఒకరోజే అయినా.. అసలు ఒకరి గురించి ఒకరికి సరిగా తెలియకపోయినా.. ఫస్ట్ డే నామినేషన్స్ మాత్రం తప్పవు అంటున్నారు ‘బిగ్ బాస్’.
‘బిగ్ బాస్’ హౌజ్‌లోకి నవీన్ పోలిశెట్టి..
‘బిగ్ బాస్’ లాంచ్ ఎపిసోడ్‌లో 14 మంది కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి వెళ్లారు. కానీ ‘బిగ్ బాస్’ సీజన్ 7లో ఇంత తక్కువమంది కంటెస్టెంట్స్ ఉన్నారేంటి అని అందరిలో అనుమానం మొదలయ్యింది. అయితే ప్రస్తుతం ఉన్న 14 మంది కంటెస్టెంట్స్ కూడా పర్మనెంట్ కాదని నాగార్జున క్లారిటీ ఇవ్వడంతో.. మెల్లగా మరికొందరిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్‌లోకి పంపించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక లాంచ్ ఎపిసోడ్ పూర్తయ్యే సమయానికి తన సినిమా ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ ప్రమోషన్ కోసం ‘బిగ్ బాస్’ స్టేజ్‌పైకి వచ్చాడు హీరో నవీన్ పోలిశెట్టి. అయితే తనను హౌజ్‌లోకి పంపించి, తనే 15వ కంటెస్టెంట్ అని నాగ్ ప్రకటించారు. కానీ అదంతా ప్రమోషన్ అని ప్రేక్షకులకు కూడా తెలుసు.
ఒకరి గురించి ఒకరికి తెలియక ముందే..
‘బిగ్ బాస్’ సీజన్ 7లో 15వ కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి ఎంటర్ అయిన నవీన్ పోలిశెట్టి.. ఇతర కంటెస్టెంట్స్‌తో కాసేపు సరదాగా కబుర్లు చెప్పాడు. వారితో టాస్కులు ఆడించి బయటకు వచ్చేస్తాడు. అదంతా నేడు ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో కంటిన్యూ చేస్తారు. అయితే నవీన్ పోలిశెట్టి వెళ్లిపోయిన తర్వాత నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ‘బిగ్ బాస్’ హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌లో చాలామంది ఒకరికి ఒకరు ముందు నుండి పరిచయం లేదు. ఎవరి మనస్థత్వాలు ఏంటి అని ఇంకా తెలుసుకోలేదు. అయినా కూడా లాంచ్ ఎపిసోడ్ అయిన తర్వాతి రోజే నామినేషన్స్ తప్పనిసరి.
నామినేషన్స్‌లో ఉన్నది వీరే..
‘బిగ్ బాస్’ సీజన్7లో జరిగిన మొదటి నామినేషన్స్‌లో 8 మంది ఎలిమినేషన్ రేసులో ఉన్నట్టు సమాచారం. గౌతమ్ కృష్ణ, రతిక, షకీలా, పల్లవి ప్రశాంత్, శోభా శెట్టి, కిరణ్ రాథోడ్, ప్రిన్స్ యావర్, దామిని భట్ల.. ఈ 8 మంది నామినేషన్స్‌లో ఉన్నారు. అసలు ఈ 8 మంది ఎలా నామినేట్ అయ్యారు, నామినేషన్స్ ప్రక్రియలో వచ్చిన మార్పులు ఏంటి, ఆ సమయంలో జరిగిన వాగ్వాదాలు ఏంటి తెలుసుకోవాలంటే ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేంత వరకు ఆగాల్సిందే. కానీ ‘బిగ్ బాస్’ ప్రేక్షకులు తమ ఫేవరెట్ కంటెస్టెంట్‌ను నామినేషన్ నుండి తప్పించి, ‘బిగ్ బాస్’లో కొనసాగేలా చేయాలంటే వారి చేతిలో కేవలం ఒక ఓటు మాత్రమే ఉంటుంది. ఇంతకు ముందులాగా హాట్‌స్టార్‌లో 10 ఓట్లు, ఫోన్ నుండి 10 మిస్డ్ కాల్స్ లాంటి ఆప్షన్‌ను ‘బిగ్ బాస్’ తొలగించారు. ప్రస్తుతం ఆడియన్స్ చేతిలో ఒక హాట్‌స్టార్ ఓటు, ఒక మిస్డ్ కాల్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది.
Also Read: బ్రేక్ ఈవెన్‌కు దగ్గరగా ‘ఖుషి’ కలెక్షన్స్, త్వరలోనే రూ.100 కోట్లు పక్కా!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Bigg Boss Season 7 Day 21 Updates: బిగ్ బాస్‌లో నామినేషన్స్ గోల - యావర్‌కు ఫైనల్‌గా సూపర్ ట్విస్ట్!
Bigg Boss Season 7 Latest Promo: బిగ్ బాస్ నాలుగో వారం నామినేషన్స్ - ఆ ముగ్గురు జడ్జిల చేతిలో నిర్ణయం
Bigg Boss Tamil 7: పృథ్విరాజ్ to అబ్బాస్ - ‘బిగ్ బాస్’ సీజన్ 7లో ఎంట్రీ ఇస్తున్న కంటెస్టెంట్స్ వీళ్లేనట!
Bigg Boss Telugu 7: ఆ వీడియోలు చూపిస్తే పరిస్థితి ఏమిటీ? నీ కాళ్లు పట్టుకోనా రతిక: శివాజీ - వీరి మధ్య ఏమైంది?
Bigg Boss Telugu 7: ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి దామిని ఔట్ - ఇప్పుడు ఎన్ని చెప్పినా వర్కవుట్ కాదు, ఇంటికెళ్లమన్న శివాజీ
బీజేపీపార్టీ ప్రతినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం
AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్
Salaar Release : డిసెంబర్‌లో 'సలార్' - షారుఖ్ ఖాన్ 'డంకీ'తో పోటీకి ప్రభాస్ రెడీ!?
God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!
/body>