అన్వేషించండి

‘చంద్రముఖి 3’ అప్‌డేట్, ప్రభాస్ కొత్త సినిమాలో శ్రీలీల - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా అల్లు అర్జున్ - డిఫరెంట్ లుక్‌తో పుష్పరాజ్ సర్ ప్రైజ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప2‘. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని, దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ప్రకటించిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘పుష్ప’ మూవీ దుమ్మురేపింది. ఈ చిత్రంలో అద్భుత నటన కనబర్చిన అల్లు అర్జున్, ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డుకు ఎంపిక అయ్యారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటి వరకు ఏ హీరోకు దక్కని గౌరవం ఆయనకు దక్కింది.  ప్రస్తుతం ‘పుష్ప 2: ది రూల్’ షూటింగ్‌లో మునిగిపోయారు. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఆయన ‘పుష్ప2’ను తెరకెక్కిస్తున్నారట డైరెక్టర్ సుకుమార్ . 'పుష్ప: ది రైజ్' పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించడంతో,  దాన్ని తలదన్నేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీంతో ‘పుష్ప2’పై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఎన్టీఆర్ బావమరిది 'మ్యాడ్' రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్టైన్మెంట్స్ ఓవైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే మరోవైపు కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తూ ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే ఈ బ్యానర్ నుంచి మరో యూత్ ఫుల్ అండ్ క్రేజీ ఎంటర్టైనర్ మూవీ రాబోతోంది. ఆ సినిమా పేరే 'మ్యాడ్'(MAD). జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ, ప్రియా రెడ్డి, ఆనంతిక సునీల్ కుమార్, గోపిక ఉద్యాన్ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ అధినేత రాధాకృష్ణ కుమార్తె హారిక ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయం అవుతున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘చంద్రముఖి 3’లో రజనీకాంత్, షరతులు పెట్టిన సూపర్ స్టార్?
‘చంద్రముఖి 2’ విడుదలకు ముందే దర్శకుడు పి.వాసు ఈ సిరీస్‌లో మరో చిత్రం రానున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాను 'చంద్రముఖి 3’గా తెరకెక్కించనున్నట్లు తెలిపారు. ‘చంద్రముఖి 2’ ఎండింగ్ లో వడివేలు పాత్రతో కూడిన ట్విస్ట్‌ తో మూడో భాగానికి సంబంధించిన హింట్ ఇవ్వబోతున్నట్లు ఆయన వెల్లడించారు.  ‘చంద్రముఖి 3’ చిత్రంలో హీరోగా రజనీకాంత్ నటించనున్నట్లు సూచన ప్రాయంగా దర్శకుడు వెల్లడించారు. ఈ సినిమాలో తను నటించేందుకు కొన్ని షరతులు విధించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నటించేందుకు ఆయన ఎలాంటి కండీషన్స్ పెట్టారు? అనే విషయాలు త్వరలో బయటకు రానున్నాయి. అసలు మూడో భాగంలో రజనీకాంత్ నటిస్తారా? లేదా? అనేది ‘చంద్రముఖి 2’ సక్సెస్ మీద ఆధారపడి ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.  (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మేఘా ఆకాష్ హీరోయిన్‌గా కొత్త సినిమా - టైటిల్ ఏమిటీ అలా ఉంది?
'లై', 'చల్ మోహన్ రంగా', 'డియర్ మేఘ', 'గుర్తుందా శీతాకాలం' వంటి సినిమాలతో టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మేఘా ఆకాష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇక ఈ ఏడాది అయితే మేఘ ఆకాష్ తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా నటించిన ఆరు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. 'సఃకుటుంబనాం' అనే పేరుతో తెరకెక్కుతున్న మూవీలో మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ కిరణ్ హీరోగా కనిపించనున్నాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ప్రభాస్ సినిమాలోనూ ఆమే, దర్శకుడు ఎవరంటే?
ప్రముఖ హీరోయిన్ శ్రీలీల పాన్ ఇండియా హీరో ప్రభాస్ సరసన నటించే గోల్డెన్ చాన్స్ ని అందుకున్నట్లు తెలుస్తోంది. 'సీతారామం' సినిమాతో కల్ట్ బ్లాక్ బాస్టర్ అందుకున్న హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటించబోయే సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా ఓకే చేసినట్లు లేటెస్ట్ ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తోంది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును నిర్మించబోతున్నారట. లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన హను రాఘవపూడి ప్రభాస్ కోసం ఓ పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ సాగే లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lokesh Deputy CM: నిన్న మహాసేన రాజేష్, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి - లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయయాాలని డిమాండ్ - ప్లానేనా ?
నిన్న మహాసేన రాజేష్, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి - లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయయాాలని డిమాండ్ - ప్లానేనా ?
Manchu Family Issue:  మనోజ్‌కు షాక్ ఇచ్చిన మోహన్ బాబు - తన ఆస్తుల నుంచి గెంటివేత !
మనోజ్‌కు షాక్ ఇచ్చిన మోహన్ బాబు - తన ఆస్తుల నుంచి గెంటివేత !
ICC Champions Trophy: బుమ్రా తిరిగొచ్చాడు.. కరుణ్ నాయర్ కు మొండిచెయ్యి.. మెగాటోర్నీకి భారత జట్టు ప్రకటన
బుమ్రా తిరిగొచ్చాడు.. కరుణ్ నాయర్ కు మొండిచెయ్యి.. మెగాటోర్నీకి భారత జట్టు ప్రకటన
Crime News:  అఫ్జల్‌గంజ్‌ కాల్పుల కేసులో నిందితుడి గుర్తింపు! పాత కేసుల్లో బిహార్‌లో క్యాష్ రివార్డ్!
అఫ్జల్‌గంజ్‌ కాల్పుల కేసులో నిందితుడి గుర్తింపు! పాత కేసుల్లో బిహార్‌లో క్యాష్ రివార్డ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Anil Ravipudi Cringe Movies Director | Sankranthiki Vasthunnam తో వందకోట్లు కొట్టినా వేస్ట్ డైరెక్టరేనా.? | ABP DesamAI Videos Impact | ఏఐ వీడియోలు చేస్తున్న అరాచకాలు గమనించారా | ABP DesamBidar Robbers Hyderabad Gun Fire | లక్షల డబ్బు కొట్టేశారు..మనీ బాక్సుతో పారిపోతూ ఉన్నారు | ABP DesamKonaseema prabhala Teertham | కోలాహలంగా కోనసీమ ప్రభల తీర్థం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lokesh Deputy CM: నిన్న మహాసేన రాజేష్, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి - లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయయాాలని డిమాండ్ - ప్లానేనా ?
నిన్న మహాసేన రాజేష్, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి - లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయయాాలని డిమాండ్ - ప్లానేనా ?
Manchu Family Issue:  మనోజ్‌కు షాక్ ఇచ్చిన మోహన్ బాబు - తన ఆస్తుల నుంచి గెంటివేత !
మనోజ్‌కు షాక్ ఇచ్చిన మోహన్ బాబు - తన ఆస్తుల నుంచి గెంటివేత !
ICC Champions Trophy: బుమ్రా తిరిగొచ్చాడు.. కరుణ్ నాయర్ కు మొండిచెయ్యి.. మెగాటోర్నీకి భారత జట్టు ప్రకటన
బుమ్రా తిరిగొచ్చాడు.. కరుణ్ నాయర్ కు మొండిచెయ్యి.. మెగాటోర్నీకి భారత జట్టు ప్రకటన
Crime News:  అఫ్జల్‌గంజ్‌ కాల్పుల కేసులో నిందితుడి గుర్తింపు! పాత కేసుల్లో బిహార్‌లో క్యాష్ రివార్డ్!
అఫ్జల్‌గంజ్‌ కాల్పుల కేసులో నిందితుడి గుర్తింపు! పాత కేసుల్లో బిహార్‌లో క్యాష్ రివార్డ్!
Ram Charan: ఇదీ రామ్ చరణ్ గోల్డెన్ హార్ట్... అభిమాని భార్యకు 17 రోజుల పాటు హాస్పిటల్‌లో వీఐపీ ట్రీట్మెంట్
ఇదీ రామ్ చరణ్ గోల్డెన్ హార్ట్... అభిమాని భార్యకు 17 రోజుల పాటు హాస్పిటల్‌లో వీఐపీ ట్రీట్మెంట్
Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో పురోగతి - కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ప్రారంభం
పోలవరం ప్రాజెక్టులో పురోగతి - కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ప్రారంభం
K Srinath IAS: పోర్టర్‌గా పని చేసి ఐఏఎస్ సాధించాడు - ఈ శ్రీనాథ్ పట్టుదల ముందు ఏదైనా ఓడిపోవాల్సిందే !
పోర్టర్‌గా పని చేసి ఐఏఎస్ సాధించాడు - ఈ శ్రీనాథ్ పట్టుదల ముందు ఏదైనా ఓడిపోవాల్సిందే !
Delhi Polls : ఢిల్లీలో తీవ్రమైన ఎన్నికల పోరు - 15వందలకు పైగా నామినేషన్స్ దాఖలు చేసిన 981 మంది అభ్యర్థులు
ఢిల్లీలో తీవ్రమైన ఎన్నికల పోరు - 15వందలకు పైగా నామినేషన్స్ దాఖలు చేసిన 981 మంది అభ్యర్థులు
Embed widget