అన్వేషించండి

Sreeleela Prabhas: శ్రీలీలా ఫోబియా - ప్రభాస్ సినిమాలోనూ ఆమే, దర్శకుడు ఎవరంటే?

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో నటించే అవకాశం దక్కించుకుందట. హను1 రాఘవపూడి ప్రభాస్ తో తీయబోయే సినిమాలో శ్రీలీల హీరోయిన్గా ఫిక్స్ అయినట్లు సమాచారం.

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీ లీల ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీయస్ట్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. వాటిల్లో చాలావరకు అగ్ర హీరోల సినిమాలు ఉండడం విశేషం. 'పెళ్లి సందD' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీల, ఆ తర్వాత రవితేజ సరసన 'ధమాకా'లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ఈఅమ్మడికి టాలీవుడ్ లో అవకాశాలు వెల్లువలా వచ్చాయి. శ్రీలీల నటించిన సినిమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. వాటిలో రామ్ సరసన నటించిన 'స్కంద' సెప్టెంబర్ 28 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో డేట్స్ ఇష్యూ వల్ల కొన్ని ప్రాజెక్టులు కూడా రిజెక్ట్ చేస్తోందట ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే తాజాగా శ్రీలీల పాన్ ఇండియా హీరో ప్రభాస్ సరసన నటించే గోల్డెన్ చాన్స్ ని అందుకున్నట్లు తెలుస్తోంది. 'సీతారామం' సినిమాతో కల్ట్ బ్లాక్ బాస్టర్ అందుకున్న హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటించబోయే సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా ఓకే చేసినట్లు లేటెస్ట్ ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తోంది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును నిర్మించబోతున్నారట. లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన హను రాఘవపూడి ప్రభాస్ కోసం ఓ పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ సాగే లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినా, ఇప్పటికే కథా చర్చలు ముగిశాయని, హను వినిపించిన కథ ప్రభాస్ కి బాగా నచ్చడంతో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వరల్డ్ వార్ పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. అలాంటి ఈ క్రేజియెస్ట్ ప్రాజెక్టులో ప్రభాస్ కి జోడిగా శ్రీ లీల హీరోయిన్‌గా నటించే ఛాన్స్ అందుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిలిం సర్కిల్స్లో తెగ హల్చల్ చేస్తోంది. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్క్రిప్ట్ వరకు జరుగుతోందని, వచ్చే సంవత్సరం మొదట్లో షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హను రాఘవపూడి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారట.

భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం శ్రీ లీల 'స్కంద' ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉంది. యంగ్ హీరోలు, సీనియర్ హీరోలతో కలిపి ఈ ముద్దుగుమ్మ ఏకంగా 9 చిత్రాల్ల్లో నటిస్తోంది. రామ్ 'స్కంద' తో పాటు బాలకృష్ణ హీరోగా వస్తున్న 'భగవంత్ కేసరి'లో కీలక పాత్ర, పంజా వైష్ణవ్ తేజ్ సరసన 'ఆది కేశవ్', నితిన్ కి జోడిగా 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్', మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 'గుంటూరు కారం', విజయ్ దేవరకొండ సరసన ఓ సినిమా, పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఈ సినిమాల్లో 'స్కంద', 'భగవంత్ కేసరి', 'ఆది కేశవ్' ఈ ఏడాది విడుదలవుతుండగా.. మిగతా సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Also Read  : ఆర్టిస్టులు అందుబాటులో లేకకాదు, ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ వాయిదా వెనుక అసలు కథ ఇదే!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Mary Rivera: 'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి
'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా
Mrunal Thakur: లీగల్ యాక్షన్ తీసుకుంటా... డీప్ ఫేక్ వీడియోలపై మృణాల్ స్ట్రాంగ్ రియాక్షన్
లీగల్ యాక్షన్ తీసుకుంటా... డీప్ ఫేక్ వీడియోలపై మృణాల్ స్ట్రాంగ్ రియాక్షన్
Priyanka Chopra: సర్వ మంగళ మాంగళ్యే... అమ్మాయితో ప్రియాంక పూజలు... మంగళ శ్లోక పఠనంలో Varanasi హీరోయిన్
సర్వ మంగళ మాంగళ్యే... అమ్మాయితో ప్రియాంక పూజలు... మంగళ శ్లోక పఠనంలో Varanasi హీరోయిన్

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
New Fielding Coach: టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
Embed widget