Chandramukhi 3: ‘చంద్రముఖి 3’లో రజనీకాంత్, షరతులు పెట్టిన సూపర్ స్టార్?
‘చంద్రముఖి 2’ రిలీజ్‌కు ముందే దర్శకుడు వాసు ఆసక్తికర విషయం చెప్పారు. ‘చంద్రముఖి 3’ కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు. ఇందులో రజనీకాంత్ నటించనున్నట్లు తెలుస్తోంది.
హారర్ కామెడీ చిత్రాల జోనర్‌లో ‘చంద్రముఖి’ ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది. రజనీకాంత్ హీరోగా నటించిన ‘చంద్రముఖి' చిత్రం అప్పట్లో సంచనల విజయాన్ని అందుకుంది. తమిళంతో పాటు తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన 18 ఏళ్లకు ఆ మూవీ సీక్వెల్ రాబోతోంది. ‘చంద్రముఖి 2’గా వస్తున్న ఈ చిత్రానికి పి.వాసు దర్శకత్వం వహిస్తున్నారు. లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ చంద్రముఖిగా కనిపించనుంది. తమిళ స్టార్ కమెడియన్ వడివేలు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఈ నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘చంద్రముఖి 3’లో రజనీకాంత్!
‘చంద్రముఖి 2’ విడుదలకు ముందే దర్శకుడు పి.వాసు ఈ సిరీస్‌లో మరో చిత్రం రానున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాను 'చంద్రముఖి 3’గా తెరకెక్కించనున్నట్లు తెలిపారు. ‘చంద్రముఖి 2’ ఎండింగ్ లో వడివేలు పాత్రతో కూడిన ట్విస్ట్ తో మూడో భాగానికి సంబంధించిన హింట్ ఇవ్వబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ‘చంద్రముఖి 3’ చిత్రంలో హీరోగా రజనీకాంత్ నటించనున్నట్లు సూచన ప్రాయంగా దర్శకుడు వెల్లడించారు. ఈ సినిమాలో తను నటించేందుకు కొన్ని షరతులు విధించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నటించేందుకు ఆయన ఎలాంటి కండీషన్స్ పెట్టారు? అనే విషయాలు త్వరలో బయటకు రానున్నాయి. అసలు మూడో భాగంలో రజనీకాంత్ నటిస్తారా? లేదా? అనేది ‘చంద్రముఖి 2’ సక్సెస్ మీద ఆధారపడి ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. రెండో భాగం హిట్ అయితే, మూడోభాగం కథ తన ఇమేజ్ కి సరిపోయేలా ఉంటే, రజనీ సినిమా కచ్చితంగా చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక ‘చంద్రముఖి 2’ చిత్రం తొలి సినిమాతో చిన్న కనెక్షన్ ను కలిగి ఉంటుందని దర్శకుడు వెల్లడించారు. క్యారెక్టర్ ఫ్రెష్ నెస్ కోసం చాలా కష్టపడినట్లు చెప్పారు. రజనీ మేనరిజాన్ని అనుకరించేందుకు లారెన్స్ చాలా కష్టపడ్డారని తెలిపారు.
‘చంద్రముఖి 2’ గురించి..
‘చంద్రముఖి 2’ పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కింది. రజనీకాంత్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘చంద్రముఖి’ చిత్రానికి సీక్వెల్ గా వస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, సాంగ్స్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ట్రైలర్ ఆశించిన స్థాయిలో లేనప్పటికీ, రజినీకాంత్ నటించిన హారర్ కామెడీ చిత్రానికి సీక్వెల్ కావడంతో 'చంద్రముఖి 2' పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ ఉప్పుటూరి, వెంకట రత్నం రిలీజ్ చేయనున్నారు.
Read Also: ఆర్టిస్టులు అందుబాటులో లేకకాదు, ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ వాయిదా వెనుక అసలు కథ ఇదే!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial