మంచువారి రూ.100 కోట్ల సినిమా, మెగా ఇంట పెళ్లి భాజాలు - ఇంకా మరెన్నో సినీ విశేషాలు
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
తిరువీర్ 'పరేషాన్' - నయా తెలంగాణ సినిమా ఏ ఓటీటీలో వస్తుందంటే?
యువ నటుడు తిరువీర్ (Thiruveer) నటించిన సినిమాలు తక్కువే. కానీ, ఆయనకు అంటూ అభిమానులు ఉన్నారు. తన నటనతో ప్రేక్షకులతో పాటు తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రముఖుల దృష్టిని ఆయన ఆకర్షించారు. 'మసూద'తో ప్రేక్షకులను భయపెట్టడమే కాదు, భారీ విజయాన్ని అందుకున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'పరేషాన్' (Pareshan Movie). జూన్ 2న థియేటర్లలో విడుదల అయ్యింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
నేను స్టూడెంట్ సర్ రివ్యూ: ఈ స్టూడెంట్‌ను థియేటర్లలో చూడవచ్చా? ఆకట్టుకున్నాడా?
మొదటి సినిమా ‘స్వాతిముత్యం’తో మంచి పేరు తెచ్చుకున్న హీరో బెల్లంకొండ గణేష్. అన్నయ్య బెల్లంకొండ శ్రీనివాస్ తరహాలో మాస్ బాట పట్టకుండా విభిన్న తరహా కథాంశాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. టీజర్, ట్రైలర్లతోనే ‘నేను స్టూడెంట్ సర్’ మంచి థ్రిల్లర్ కథాంశంగా ఆకట్టుకుంది. ఒక సెల్ ఫోన్, దాని చుట్టూ తిరిగే క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?
మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు కుటుంబం నుంచి కొత్త కథానాయకుడు తెలుగు చిత్రసీమకు వచ్చారు. నిర్మాత సురేష్ బాబు రెండో తనయుడు, రానా తమ్ముడు అభిరామ్ (Abhiram Daggubati)ని హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు తేజ తెరకెక్కించిన సినిమా 'అహింస'. ఈ సినిమా (Ahimsa Movie Review) ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
త్వరలో అనౌన్స్ చేస్తాం, వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి పెళ్లిపై స్పందించిన నాగబాబు!
టాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారనే వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటవ్వబోతున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. తాజాగా ఈ ప్రేమ జంట గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూన్ 9న ఈ జంటకు నిశ్చితార్థం జరగనుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే, ఈ ఎంగేజ్మెంట్ గురించి ఇప్పటి వరకూ అటు వరుణ్ తేజ్, ఇటు లావణ్య ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఫిల్మ్ వర్గాల్లో మాత్రం ఇది నిజమే అనే ప్రచారం జరుగుతోంది. వీరి ఎంగేజ్మెంట్ కు మెగా ఫ్యామిలీ హారోలతో పాటు బంధువులు, సన్నిహితులు కూడా హాజరవుతున్నారని తెలుస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
రూ.100 కోట్లతో సినిమా తీస్తున్నాం - మోహన్ బాబు కీలక ప్రకటన
తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు మోహన్ బాబు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, నటుడిగా, నిర్మాతగా వందల చిత్రాలు చేశారు. 80, 90వ దశకంలో ఆయన సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే స్టార్ హీరోలు సైతం తమ సినిమా విడుదలను వాయిదా వేసుకునే వారు. కలెక్షన్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, అద్భుత చిత్రాలతో బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపారు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అద్భుత నటుడిగా గుర్తింపు పొందారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)