Varun Tej- Lavanya Tripathi Marriage: త్వరలో అనౌన్స్ చేస్తాం, వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి పెళ్లిపై స్పందించిన నాగబాబు!
మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి డేటింగ్ లో ఉన్నారనే వార్తలు గత కొంత కాలంగా వస్తున్నాయి. తాజాగా ఈ విషయం గురించి నాగబాబు స్పందించారు. త్వరలోనే పెళ్లి గురించి అనౌన్స్ చేయనున్నట్లు వెల్లడించారు.
టాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారనే వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటవ్వబోతున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. తాజాగా ఈ ప్రేమ జంట గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూన్ 9న ఈ జంటకు నిశ్చితార్థం జరగనుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే, ఈ ఎంగేజ్మెంట్ గురించి ఇప్పటి వరకూ అటు వరుణ్ తేజ్, ఇటు లావణ్య ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఫిల్మ్ వర్గాల్లో మాత్రం ఇది నిజమే అనే ప్రచారం జరుగుతోంది. వీరి ఎంగేజ్మెంట్ కు మెగా ఫ్యామిలీ హారోలతో పాటు బంధువులు, సన్నిహితులు కూడా హాజరవుతున్నారని తెలుస్తోంది.
త్వరలో పెళ్లి గురించి అనౌన్స్ చేస్తాం
అటు వరుణ్ తేజ్ - లావణ్య పెళ్లి వార్తలపై నాగబాబు స్పందించారు. వరుణ్ పెళ్లి త్వరలో జరుగుతుందని చెప్పారు. “వరుణ్ పెళ్లి గురించి త్వరలో అనౌన్స్ చేస్తాం. లావణ్య ఇంటి కోడలు కాబోతోంది అనే విషయం మీద నేనేం కామెంట్ చేయను. త్వరలోనే చెప్తాం. ఈ విషయాన్ని వరుణ్ బాబు ప్రకటిస్తారు. మీడియాను పిలిచి చెప్తారు” అన్నారు. మొత్తంగా లావణ్య- వరుణ్ తేజ్ పెళ్లి త్వరలోనే జరగబోతోందని నాగబాబు హింట్ ఇచ్చారు. అయితే, వరుణ్ తన ఇంట్లో ఉండడని, వేరొక ఇంట్లో ఉంటున్నాడని నాగబాబు తెలిపారు. తమ కుటుంబ సభ్యులమంతా వేర్వేరు ఇళ్లల్లో ఉంటున్నా.. ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉంటామని నాగబాబు అన్నారు. అలాగే, తన వద్ద పిల్లలకు ఇచ్చేంత డబ్బు ఉందని, వారి నుంచి తాను ఏమీ ఆశించడం లేదని అన్నారు. వారి లైఫ్, వారి ఇష్టమని, వారిపై ఎలాంటి ఒత్తిడి చేయబోనని తెలిపారు.
View this post on Instagram
‘మిస్టర్’ సినిమా నుంచే ప్రేమాయణం
మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలసి ‘మిస్టర్’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా అప్పట్లో డిజాస్టర్ అయ్యింది. కానీ వరుణ్, లావణ్యలు మాత్రం లవ్ లో పడ్డారు. ఈ సినిమా తర్వాత ‘అంతరిక్షం’ అనే సినిమాలో కూడా లావణ్య వరుణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య రిలేషన్షిప్ కొనసాగుతుంది. అప్పుడే వీరి డేటింగ్ వ్యవహారం పై వార్తలు వచ్చాయి. అయితే దానిపై మెగా ఫ్యామిలీలో ఎవరూ కూడా స్పందించలేదు. అయితే ఈ ఏడాది జనవరిలో బెంగళూరులో లావణ్య బర్త్ డే పార్టీ గ్రాండ్ గా జరిగింది. ఈ పార్టీకి వరుణ్ హాజరై ఓ కాస్ట్లీ డైమండ్ రింగ్ తో లావణ్యకు ప్రపోజ్ చేశాడని, ఆమె కూడా ఓకే చెప్పిందనే వార్తలు వచ్చాయి. ఇది జరిగిన కొన్ని నెలలకే నాగబాబు ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. వరుణ్ కు ఈ ఏడాదిలోనే పెళ్లి చేస్తాం అని చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు ఈ ఏడాదిలోనే వరుణ్, లావణ్యల పెళ్లి జరుగుతుందని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. ప్రస్తుతం లావణ్య, వరుణ్ తేజ్ ఫారిన్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరిద్దరూ హైదరాబాద్ తిరిగి రానున్నట్లు తెలుస్తోంది. వచ్చిన తర్వాత వీరి ఎంగేజ్మెంట్ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి.
Read Aslo: వామ్మో, అంత భారీ ఫైటా? రామ్‌తో 24 రోజులు షూటింగ్, 1500 మందితో యాక్షన్ స్వీక్వెన్స్