అన్వేషించండి

‘భోళా శంకర్’ ట్రైలర్ రిలీజ్, డైరెక్టర్‌కు విష్వక్‌సేన్ చురకలు - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

దుమ్ము లేపిన మెగాస్టార్ - చిరంజీవి 'భోళా శంకర్' మాస్ స్టైలిష్ యాక్షన్ ట్రైలర్ వచ్చిందయ్యా
`మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'భోళా శంకర్' (Bholaa Shankar Movie). ఇది మాస్ & స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్. దీనికి  మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకరకు చెందిన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించింది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు సినిమా ట్రైలర్ విడుదల చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

1000 మంది డ్యాన్సర్లతో షారుఖ్ ఆట - ‘జవాన్‌’ పాటకు పెట్టిన ఖర్చుతో 2 చిన్న సినిమాలు తీయొచ్చు!
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఈ ఏడాది 'పఠాన్' సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ జోష్ లో రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్న కింగ్ ఖాన్, ఇప్పుడు 'జవాన్' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అయ్యారు. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సెప్టెంబర్ 7వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా 'జిందా బందా' అనే ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

అన్నను మించిన తమ్ముడు - 11 రోజుల్లో ‘అర్జున్ రెడ్డి’ రికార్డులు బద్దలుకొట్టిన ‘బేబీ’
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్‌ల 'బేబీ' తెలుగు చిత్ర పరిశ్రమ బాక్సాఫీస్‌ను శాసిస్తోంది. ఈ చిత్రం కేవలం 11 రోజుల్లో దాదాపు 70 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దీంతో ‘బేబీ’.. విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' లైఫ్‌టైమ్ కలెక్షన్స్‌ను అధిగమించింది. దీంతో అన్న విజయ్ దేవరకొండను ఆనంద్ మించిపోయాడని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. జూలై 14న థియేటర్లలో విడుదలైన 'బేబీ' బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. దీంతో 'బేబీ' తెలుగు సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ గా పేరు తెచ్చుకుంది. అంతే కాదు ఆనంద్ దేవరకొండ కెరీర్‌లో 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో 'బేబీ' ఒకటి కావడం మరో చెప్పుకోదగిన విషయం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మన సినిమా బాగుందని ఎవరినో కించపరచకూడదు - ఆ దర్శకుడికి మరోసారి చురకలంటించిన విశ్వక్ సేన్!
టాలీవుడ్ లో ఉన్న విలక్షణమైన నటుల్లో యంగ్ హీరో విశ్వక్ సేన్ ఒకరు. సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా ఆయన లైఫ్ స్టైల్ కాస్త డిఫరెంట్ గానే ఉంటుంది. ప్రస్తుతం విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. అయితే కెరీర్ పరంగా తనకు ఎదురయ్యే ఒడిదుడుకులపై తనదైన శైలిలో స్పందిస్తుంటాడు విశ్వక్. ఇటీవల ఆయన ‘పేకమేడలు’ అనే సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ కు అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ సినిమా దర్శకుడు గురించి విశ్వక్ సేన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'స్పై' మూవీ - ఎక్కడ స్ట్రీమ్ అవుతుందంటే?
‘కార్తికేయ-2’ మూవీ పాన్ ఇండియా హిట్ తర్వాత నిఖిల్ సిద్ధార్థ్ నటించిన మరో చిత్రం ‘స్పై’. గ్యారీ BH డైరెక్ట్ చేసిన 'స్పై'  మూవీ మంచి వసూళ్లను సాధించినా.. ప్రేక్షకులను అలరించడంలో మాత్రం విఫలమైంది. అదే సమయంలో విడుదలైన ‘సామజవరగమన’ హిట్ టాక్ తెచ్చుకోవడం కూడా మూవీకి మైనస్ అయ్యింది. ఆ తర్వాతే ఎంత పబ్లిసిటీ చేసినా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ‘స్పై’ టీమ్ ఓటీటీ బాట పట్టారు. చాలా సైలెంటుగా ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ గురువారం నుంచి తెలుగు, తమిళం, హిందీ, కన్నడతో పాటు మలయాళం భాషల్లో ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమింగ్ అవుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget