SPY movie in OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'స్పై' మూవీ - ఎక్కడ స్ట్రీమ్ అవుతుందంటే?
గ్యారీ BH డెైరెక్షన్ లో వచ్చిన 'స్పై'.. ఊహించినంత కలెక్షన్లను వసూలు చేయలేకపోయింది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ సినిమాలో.. నిఖిల్ సిద్ధార్థ హీరోగా కనిపించాడు. తాజాగా ఈ సినిమా ఓటీటీలో ప్రత్యక్షమైంది.
Spy OTT Release : ‘కార్తికేయ-2’ మూవీ పాన్ ఇండియా హిట్ తర్వాత నిఖిల్ సిద్ధార్థ్ నటించిన మరో చిత్రం ‘స్పై’. గ్యారీ BH డైరెక్ట్ చేసిన 'స్పై' మూవీ మంచి వసూళ్లను సాధించినా.. ప్రేక్షకులను అలరించడంలో మాత్రం విఫలమైంది. అదే సమయంలో విడుదలైన ‘సామజవరగమన’ హిట్ టాక్ తెచ్చుకోవడం కూడా మూవీకి మైనస్ అయ్యింది. ఆ తర్వాతే ఎంత పబ్లిసిటీ చేసినా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ‘స్పై’ టీమ్ ఓటీటీ బాట పట్టారు. చాలా సైలెంటుగా ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ గురువారం నుంచి తెలుగు, తమిళం, హిందీ, కన్నడతో పాటు మలయాళం భాషల్లో ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ చిత్రంలో ఐశ్వర్యా మీనన్ కథానాయికగా నటించగా.. సన్యా ఠాకూర్, అభినవ్ గోమతం, ఆర్యన్ రాజేష్, మకరంద్ దేశ్‌పాండే, జిషు సేన్ గుప్తా, నితిన్ మెహతా, రవివర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక స్పై థ్రిల్లర్ చిత్రానికి సంగీతం శ్రీ చరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ స్వరాలు సమకుర్చారు.
స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక మిస్టరీ గురించి మూవీలో చూపించబోతున్నారని చెప్పడంతో ముందు నుంచే SPY మూవీపై అంచనాలు పెరిగాయి. టీజర్, ట్రైలర్ తో ఈ అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. అయితే సినిమాలో మాత్రం ఊహించినంత డెప్త్ లేకపోవడంతో అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. అంతే కాదు స్పై రిజల్ట్ విషయంలో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ అభిమానులను క్షమాపణలు కూడా చెప్పాడు. భవిష్యత్తులో క్వాలిటీ విషయంలో అసలు కాంప్రమైజ్ కానని మాటిచ్చాడు. పాన్ ఇండియన్ లెవెల్‌లో సరైన రీతిలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో విఫలమయ్యామని నిఖిల్ చెప్పాడు. అలాగే ఓవర్‌సీస్‌లో 350కిపైగా తెలుగు ప్రీమియర్ షోస్ కూడా రద్దు కావడం బాధను కలిగించిందని నిఖిల్ చెప్పాడు.
జై అనే గూఢచారిగా నిఖిల్ ఈ సినిమాలో ఓ ఇంటెన్స్ యాక్షన్ రోల్ లో నటించాడు. తన పాత్రకు న్యాయం చేసేందుకు చాలా కష్టపడ్డాడు. కానీ అర్థపర్థం లేని కథ, కథనాల కారణంగా అతడి శ్రమ మొత్తం వృథాగా మారిపోయినట్టయింది. ఆర్యన్ రాజేష్ మూడు సీన్స్, రానా ఒక్క సీన్‌కు పరిమితమయ్యారు. హీరోయిన్ ఐశ్వర్య మీనన్ కంటే సెకండ్ లీడ్‌లో నటించిన సన్యా ఠాకూర్ నటనతో ఆకట్టుకుంది. జిషుసేన్‌గుప్తా, మకరంద్‌దేశ్‌పాండేతో పాటు పలు అనుభవజ్ఞులు ఉన్నా సినిమాను నిలబెట్టలేకపోయారు. అభినవ్ గోమటం కామెడీ కొన్ని చోట్ల రిలీఫ్‌నిచ్చిందని చెప్పవచ్చు. మరి, ఓటీటీలో ఈ మూవీకి ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial