అన్వేషించండి

Bholaa Shankar Trailer : దుమ్ము లేపిన మెగాస్టార్ - చిరంజీవి 'భోళా శంకర్' మాస్ స్టైలిష్ యాక్షన్ ట్రైలర్ వచ్చిందయ్యా

Ram Charan unveils Bholaa Shankar trailer : మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన 'భోళా శంకర్' ట్రైలర్ ను రామ్ చరణ్ విడుదల చేశారు.

`మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'భోళా శంకర్' (Bholaa Shankar Movie). ఇది మాస్ & స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్. దీనికి  మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకరకు చెందిన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించింది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు సినిమా ట్రైలర్ విడుదల చేశారు. 

'భోళా శంకర్' ట్రైలర్ ఎలా ఉందో ఇక్కడ చూడండి : 

ట్రైలర్ చూస్తే... కలకత్తాలో చాలా మంది అమ్మాయిలు మిస్ అవుతారు. ఆ అమ్మాయిల మిస్సింగ్ వెనుక ఎవరు ఉన్నారు? తమ సమస్యల పరిష్కారానికి పోలీసులు దగ్గర ప్రజలు వెళ్లడం ఆనవాయితీ. ఆ పోలీసులు తమకు సమస్య వస్తే... భోళా భాయ్ దగ్గరకు వెళతారు. ఆ భోళా శంకర్ ఏం చేశాడు? ఏమైంది? అనేది స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాలి. 'రంగస్థలం'లో రామ్ చరణ్ కు బాబులా యాక్ట్ చేస్తున్నాడు' అని తమన్నా చెప్పే డైలాగ్ హైలైట్. 

'భోళా శంకర్' సినిమాలో చిరంజీవికి జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా  (Tamannaah Bhatia) నటించారు. ఆల్రెడీ వాళ్ళిద్దరి మీద తెరకెక్కించిన 'మిల్కీ బ్యూటీ...' పాటను ఇటీవల విడుదల చేశారు. ఇక, చిరు సోదరిగా మహానటి కీర్తీ సురేష్ కనిపించనున్నారు. కీర్తీ సురేష్ ప్రియుడిగా ఏయన్నార్ మనవడు, నాగార్జున మేనల్లుడు, యువ హీరో సుశాంత్ కనిపించనున్నారు.

Also Read : రూ. 150 కోట్ల షేర్ గ్యారెంటీ 'బ్రో'... పవన్ కళ్యాణ్ లాస్ట్ 5 సినిమాల కలెక్షన్స్ ఎంతంటే?

మొత్తం 33 మందిని చంపిన ఒక్కడు!
'భోళా శంకర్' టీజర్ కొన్ని రోజుల విడుదల చేశారు. 'షికారుకు వచ్చిన షేర్ ని బే' అంటూ మెగాస్టార్ స్టైలిష్ ఎంట్రీ ఇచ్చారు. ఆయనది క్యాబ్ డ్రైవర్ రోల్ అని క్లారిటీ ఇచ్చారు. మరి, ఆ క్యాబ్ డ్రైవర్ మొత్తం 33 మందిని ఎలా చంపాడు? ఎందుకు చంపాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 'భోళా శంకర్'లో తెలంగాణ యాస మాట్లాడుతూ చిరు సందడి చేయనున్నారు. 'ఎట్లా ఇచ్చినా?' అని చిరు అడిగితే... 'అన్నా! మస్త్ ఇచ్చినావ్ అన్నా' అని 'గెటప్' శ్రీను అంటుంటే, అభిమానులు కొందరికి 'శంకర్ దాదా ఎంబిబిఎస్' గుర్తుకు వచ్చింది. 

Also Read అనుష్క సినిమా వాయిదా - ప్రభాస్ కజిన్‌కు తిట్లు తప్పవా?

'భోళా శంకర్'లో మెగా అభిమానులు ఎదురు చూసే సీన్స్ కొన్నున్నాయి. 'ఖుషి' సినిమాలో 'ఏ మే రాజహా... ఏ మేరీ దునియా' పాటకు చిరు స్టెప్స్ వేశారు. పవర్ స్టార్ భుజం మీద చేయి వేసుకుని చేసే మేనరిజం ఇమిటేట్ చేశారు. ఆ తర్వాత రష్మీతో 'తమ్ముడి పాట మస్త్ ఉందిలే' అనడం హైలైట్. శ్రీముఖితో కలిసి 'ఖుషి'లో నడుము సీన్ స్పూఫ్ కూడా చేశారట. అది ఎలా ఉంటుందో స్క్రీన్ మీద చూడాలి.   

రఘు బాబు, మురళీ శర్మ, రవి శంకర్, 'వెన్నెల' కిశోర్, తులసి, సురేఖా వాణి, శ్రీ ముఖి, 'హైపర్' ఆది, 'వైవా' హర్ష, రష్మీ గౌతమ్, ప్రదీప్, బిత్తిరి సత్తి, సత్య, 'గెటప్' శ్రీను, వేణు టిల్లు (బలగం దర్శకుడు వేణు ఎల్దండి), 'తాగుబోతు' రమేష్, ఉత్తేజ్, తరుణ్ అరోరా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కూర్పు : మార్తాండ్ కె వెంకటేష్, కథా పర్యవేక్షణ : సత్యానంద్, మాటలు : తిరుపతి మామిడాల, ఫైట్ మాస్టర్స్ : రామ్ - లక్ష్మణ్ & దిలీప్ సుబ్బరాయన్ & కాచే కంపాక్డీ, పాటలు : రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీమణి, సిరాశ్రీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత :  కిషోర్ గరికిపాటి, ఛాయాగ్రహణం : డడ్లీ.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారుఎడతెరపి లేకుండా వర్షం, డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్అలిగిన అశ్విన్, అందుకే వెళ్లిపోయాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
DHOP Song Promo: ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
Allu Arvind: శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
Embed widget