అన్వేషించండి

అన్నను మించిన తమ్ముడు - 11 రోజుల్లో ‘అర్జున్ రెడ్డి’ రికార్డులు బద్దలుకొట్టిన ‘బేబీ’

సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన 'బేబీ' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన 11రోజుల్లోనే దాదాపు రూ.70 కోట్లు వసూలు చేసింది. 'అర్జున్ రెడ్డి' జీవితకాల కలెక్షన్‌ను అధిగమించింది..

Baby Box Office Collections: యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్‌ల 'బేబీ' తెలుగు చిత్ర పరిశ్రమ బాక్సాఫీస్‌ను శాసిస్తోంది. ఈ చిత్రం కేవలం 11 రోజుల్లో దాదాపు 70 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దీంతో ‘బేబీ’.. విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' లైఫ్‌టైమ్ కలెక్షన్స్‌ను అధిగమించింది. దీంతో అన్న విజయ్ దేవరకొండను ఆనంద్ మించిపోయాడని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

జూలై 14న థియేటర్లలో విడుదలైన 'బేబీ' బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. దీంతో 'బేబీ' తెలుగు సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ గా పేరు తెచ్చుకుంది. అంతే కాదు ఆనంద్ దేవరకొండ కెరీర్‌లో 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో 'బేబీ' ఒకటి కావడం మరో చెప్పుకోదగిన విషయం. ఈ సక్సెస్ పై మాట్లాడిన నిర్మాత ఎస్‌కెఎన్ (శ్రీనివాస కుమార్ నాయుడు)..‘‘మా కల్ట్ బ్లాక్‌బస్టర్ ‘బేబీ’కి అపారమైన ప్రేమ, ఆదరణకు కృతజ్ఞతలు. వర్షంలో కూడా హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించడం అరుదైన విషయం. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది" అని చెప్పారు. "నేను గతంలో విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' చిత్రాన్ని నిర్మించాను. అది సూపర్ హిట్ అయింది. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌లో అన్నదమ్ములిద్దరికీ బ్లాక్‌బస్టర్స్ అందించడం ఆనందంగా ఉంది" అని ఆయన ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు.

'బేబీ' గురించి..

సాయి రాజేష్ నీలం రచన, దర్శకత్వలో తెరకెక్కిన 'బేబీ'లో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ తో పాటు నాగేంద్రబాబు, లిరీషా కునపరెడ్డి, హర్ష చెముడు, సాత్విక్ ఆనంద్, కుసుమ డేగలమారి కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తోన్న 'బేబీ'.. ఓటీటీపైనా మేకర్స్ ఇటీవల క్లారిటీ ఇచ్చారు. ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూస్తోన్న అభిమానులను నిరాశ పర్చే న్యూస్ చెప్పారు. బేబీని ఆగస్టు చివరివారంలో లేదా.. సెప్టెంబర్ మెుదటి వారంలో విడుదల చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా ఆగస్టులోనే విడుదల కానుందని సమాచారం. ఆగస్టు 18 నుంచి ఆహా ఓటీటీలో 'బేబీ' సినిమా స్ట్రీమింగ్ అవనుందని కన్ఫామ్ అయింది. కాగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

సుమారు రూ.10 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం.. ఇప్పటికే లాభాల్లోకి వచ్చేసింది. రూ.60 కోట్లపైనే గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. తక్కువ బడ్జెట్ తో తీసినా... కథ బాగుంటే.. సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించింది ఈ చిత్రం. కానీ ఈ స్థాయిలో వసూళ్లు రాబడుతుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. 

Read Also : Ileana Full Baby Bump : ఇలియానా నిండు గర్భం - దగ్గరలో డెలివరీ డేట్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Google Pay Transaction Delete: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
Skoda Kylaq: 10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
Support From YSRCP: అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
Embed widget