సలార్ అప్‌డేట్, ‘దయ’ వెబ్ సిరీస్ ట్రైలర్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
ఆలీకి పవన్ కళ్యాణ్ ఝలక్ - స్నేహానికి పూర్తిగా తెగతెంపులు?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ హాస్య నటుడు ఆలీ మంచి స్నేహితులు. ఆలీ తన గుండెకాయ అని, ఆలీ లేకుండా తాను సినిమా చేయనని పవన్ చెప్పిన రోజులు ఉన్నాయి. ఇండస్ట్రీ ప్రముఖులు అందరికీ వాళ్ళ స్నేహం గురించి తెలుసు. ఆ స్నేహం ఇప్పుడు లేదని అర్థం అవుతోంది. జనసేన పార్టీ స్థాపనకు ముందు పవన్ కళ్యాణ్ నటించిన ఒకట్రెండు సినిమాలు మినహా మిగతా అన్నిటిలోనూ ఆలీ ఉన్నారు. సినిమాలకు అతీతంగా వాళ్ళ స్నేహ బంధం బలపడింది. ఆ బంధానికి రాజకీయాలు తూట్లు పొడిచాయని చెప్పుకోవాలి. పరిస్థితులు చూస్తుంటే... ఇప్పుడు శాశ్వతంగా తెగతెంపులు అయినట్లే అనుకోవాలి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
‘సలార్’ లీక్ - ఆసక్తికర విషయాన్ని చెప్పిన జగపతిబాబు
ప్రశాంత్ నీల్ దర్శకత్వం 'సలార్: పార్ట్ 1(Salaar)' రిలీజ్‌కు సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అది టీజర్‌లా లేదని గ్లింప్స్ తరహాలో ఉందని స్వయంగా ప్రభాస్ అభిమానులే కామెంట్స్ చేశారు. తాజా ఈ సినిమా గురించిన మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను బయటపెట్టారు జగపతిబాబు. ‘సలార్’ ఫస్ట్ పార్ట్‌లో తాను ఉండబోనని స్పష్టం చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని వెల్లడించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
సూర్యుడు అస్తమిస్తే యుద్ధం ముగిసినట్టు కాదు - ఉత్కంఠభరితంగా జేడీ, విష్ణుప్రియల ‘దయా’ వెబ్ సిరీస్ ట్రైలర్
ప్రస్తుత ఓటీటీల కాలంలో వెబ్ సిరీస్ లకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే మేకర్స్ కూడా వెబ్ సిరీస్ లపై ఫోకస్ చేస్తున్నారు. ఇక వెబ్ సిరీస్ లలో ఎక్కువశాతం ప్రేక్షకులను ఆకర్షించేవి క్రైమ్, థ్రిల్లర్ వెబ్ సిరీస్లే. ఈ మధ్య కాలంలో అలాంటి వెబ్ సిరీస్లు చాలా వచ్చాయి. అవి ఓటీటీలను లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అదే కోవలో తెలుగులో మరో వెబ్ సిరీస్ రాబోతోంది. అదే ‘దయా’. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి ఈ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో కనిపించారు. ఇటీవలే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ విడుదల అయింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
తమన్ ఆ పాటను కాపీ కొట్టారా? 'జాణవులే'పై ఫ్యాన్స్ ట్రోల్స్
ట్రోల్స్, విమర్శలు సంగీత దర్శకుడు తమన్ (Music Director Thaman)కు కొత్త కాదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆయన బోలెడు విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఇటీవల 'బ్రో' సినిమా విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రోల్స్ గురించి ఆయన స్పందించారు. 'ట్రోల్స్ ముందు నుంచి ఎవరు అయితే చేస్తున్నారో, ఇప్పుడూ వాళ్ళే చేస్తున్నారు. ఈ రోజు కొత్తగా ఎవరూ రాలేదు' అని తమన్ వ్యాఖ్యానించారు. 'బ్రో' సినిమాలో తొలి పాట 'మై డియర్ మార్కండేయ'పై కొందరు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్లగా... 'అది తేజ్ సాంగ్! అందులో పవన్ కళ్యాణ్ వస్తారు. ఆ సందర్భానికి అంతకు మించి కొట్టలేం' అని తమన్ పేర్కొన్నారు. 'బ్రో' సినిమాలో పాటలకు ఎక్కువ స్కోప్ లేదన్నట్టు చెప్పుకొచ్చారు. ఇప్పుడు రెండో పాట 'జాణవులే...' వచ్చింది. దీనిపై కూడా విమర్శల జడివాన మొదలైంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ముక్కు అవినాష్ తల్లికి గుండెపోటు, ఆమె పరిస్థితిపై డాక్టర్లు ఏం చెప్పారంటే?
‘జబర్దస్త్’ షో కమెడియన్ ముక్కు అవినాష్ తల్లి మల్లమ్మ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లడంలో డాక్టర్లు షాకింగ్ న్యూస్ చెప్పారు. ఆమెకు పలుమార్లు గుండెపోటు వచ్చినట్లు వెల్లడించారు. గుండెలో రెండు రంధ్రాలు ఉన్నట్లు వైద్యుల పరీక్షల్లో తేలింది. వెంటనే ఆమెకు డాక్టర్లు స్టంట్లు వేశారు. ఈ విషయాన్ని స్వయంగా ముక్కు అవినాష్ ఓ వీడియో ద్వారా వెల్లడించింది. తల్లి ఆరోగ్య సమస్యలకు కారణాలు, అందించిన వైద్యం గురించి పలు వివరాలు వెల్లడించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)