అన్వేషించండి

ఆర్ఆర్ఆర్ సీక్వెల్ అప్‌డేట్, జవాన్ ట్రైలర్ లాంచ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

హాలీవుడ్ రేంజ్‌లో 'RRR' సీక్వెల్, హీరోలు వాళ్లేనట - విజయేంద్ర ప్రసాద్ వెల్లడి
దర్శక దిగ్గజం ఎస్, ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమా ఎంత పెద్ద సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వాతంత్ర సమరయోధులు  అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలను ఆధారంగా చేసుకుని విజువల్ వండర్ గా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సుమారు 450 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఫ్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం గత ఏడాది మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని అందుకోవడం తోపాటు బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ని అందుకుని సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

జవాన్‘ ట్రైలర్: ఏ హీరో నా ముందు నిలబడలేడంటూ గుండుతో షాకిచ్చిన షారుఖ్ ఖాన్
'పఠాన్' మూవీ తర్వాత బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ చేయబోయే చిత్రం 'జవాన్' కోసం కోట్లాది మంది అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించిన పలు ఫుటేజ్ వీడియోలు ఇటీవలే లీకై సోషల్ మీడియాలో ఇప్పటికీ హల్ చల్ చేస్తున్నాయి. ఇక భారీ బడ్జెట్ తో, భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఆరంభం నుంచే ఎనలేని బజ్ క్రియేట్ అయ్యింది. సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా అట్టహాసంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ట్రైలర్ (Telugu Prevue)ను విడుదల చేసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

‘సలార్’ మూవీకి కళ్లు చెదిరే రెమ్యునరేషన్ తీసుకుంటున్న ప్రభాస్, పైగా లాభాల్లో వాటా కూడానట!
దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్ రేంజి ఓ రేంజిలో పెరిగిపోయింది. జక్కన్న చిత్రంతో దేశ వ్యాప్తంగా మార్కెట్ ను పెంచుకున్నారు రెబల్ స్టార్. ఈ సినిమా తర్వాత ఆయన అన్నీ పాన్ ఇండియన్ సినిమాలే చేస్తున్నారు. అయితే, ‘బాహుబలి’ తర్వాత  వచ్చిన పాన్ ఇండియన్ సినిమాలు ఏవీ అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. ‘సాహో, రాధేశ్యామ్’, ‘ఆది పురుష్’ చిత్రాలు ఎంతో ఆర్భాటంగా విడుదలైనా ప్రేక్షకులను అలరించలేకపోయాయి. అయినప్పటికీ ప్రభాస్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ‘కేజీఎఫ్’ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌తో కలిసి ‘సలార్’ సినిమా చేస్తున్నారు. అటు ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్‌తో ‘ప్రాజెక్ట్ K’ లోనూ నటిస్తున్నారు. అటు మారుతి దర్శకత్వంలో ‘రాజా డీలక్స్’ చిత్రంలో యాక్ట్ చేస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

రామ్ పోతినేనితో పూరీ కొత్త సినిమా షురూ- అట్టహాసంగా ‘డబుల్ ఇస్మార్ట్’ లాంచ్
‘లైగర్’ సినిమా డిజాస్టర్ తర్వాత డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. రామ్ పోతినేనితో కొత్త సినిమా షురూ చేశారు. ఇవాళ  ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి గతంలోనే పూరి ఓ ప్రకటన చేయగా,  తాజాగా అధికారికంగా లాంచ్ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సమంత, ఆరు నెలలు చాలా కఠినమంటూ సెల్ఫీతో షాకిచ్చిన సామ్!
టాలీవుడ్ నటి సమంతకు సినిమాలు, వెబ్ సీరిస్‌ల్లో అవకాశాలు వస్తున్నా.. అనారోగ్య సమస్యల వల్ల వెనకడుగు వేస్తోంది. తన సమస్య నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతే డేట్స్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ సందర్భంగా సినిమాలకు కూడా బ్రేక్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ విషయంపై సమంత నేరుగా ప్రకటించకపోయినా.. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా పరోక్ష వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఆమె పోస్ట్ చేసిన ఫొటో చూస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Cyclone Fengal: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
Mulugu Encounter: ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
Chevireddy Bhaskar Reddy: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ - పోలీసులకు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న బాలిక తండ్రి
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ - పోలీసులకు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న బాలిక తండ్రి
Bougainvillea OTT: థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేజ్రీవాల్‌పై రసాయన దాడి, గ్లాసుతో పోసిన దుండగుడుBobbili Guest House History Tour | బొబ్బిలి రాజుల గెస్ట్ హౌస్ ఎందుకంత ఫేమస్ | ABP DesamRishiteswari Case: Guntur Court Final Verdict | 9 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు ఏంటి? | ABP DesamPawan Kalyan Seize the Ship | డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ నౌకను సీజ్ చేయగలరా? | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Fengal: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
Mulugu Encounter: ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
Chevireddy Bhaskar Reddy: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ - పోలీసులకు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న బాలిక తండ్రి
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ - పోలీసులకు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న బాలిక తండ్రి
Bougainvillea OTT: థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
Gautam Adani: ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
Jigra OTT: యాక్షన్ అదరగొట్టిన ఆలియా భట్... బాలీవుడ్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎందులోనో తెలుసా?
యాక్షన్ అదరగొట్టిన ఆలియా భట్... బాలీవుడ్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎందులోనో తెలుసా?
Aravind Kejriwal: కాంగ్రెస్ తో దోస్తీకి స్వస్తి, ఢిల్లీలో ఒంటరిగా పోటీ చేయనున్న ఆప్- స్పష్టం చేసిన కేజ్రీవాల్
కాంగ్రెస్ తో దోస్తీకి స్వస్తి, ఢిల్లీలో ఒంటరిగా పోటీ చేయనున్న ఆప్- స్పష్టం చేసిన కేజ్రీవాల్
Viral Video: చెన్నై ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన ముప్పు, ల్యాండింగ్ సమయంలో భయానక పరిస్థితులు
చెన్నై ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన ముప్పు, ల్యాండింగ్ సమయంలో భయానక పరిస్థితులు
Embed widget