Jawan Telugu Prevue: ‘జవాన్‘ ట్రైలర్: ఏ హీరో నా ముందు నిలబడలేడంటూ గుండుతో షాకిచ్చిన షారుఖ్ ఖాన్
అట్లీ దర్శకత్వంలో షారుఖ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘జవాన్’. సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ట్రైలర్ ను విడుదల చేసింది.
'పఠాన్' మూవీ తర్వాత బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ చేయబోయే చిత్రం 'జవాన్' కోసం కోట్లాది మంది అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించిన పలు ఫుటేజ్ వీడియోలు ఇటీవలే లీకై సోషల్ మీడియాలో ఇప్పటికీ హల్ చల్ చేస్తున్నాయి. ఇక భారీ బడ్జెట్ తో, భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఆరంభం నుంచే ఎనలేని బజ్ క్రియేట్ అయ్యింది. సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా అట్టహాసంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ట్రైలర్ (Telugu Prevue)ను విడుదల చేసింది.
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీన్లతో దుమ్మురేపిన ‘జవాన్‘ ట్రైలర్
‘పఠాన్’ జోష్ తో ఉన్న షారుఖ్ ఖాన్ ‘జవాన్’తో ఆ దూకుడు కొనసాగించేలా ఉంది. షారుఖ్ ఖాన్ ‘జవాన్’ మూవీ ట్రైలర్ చూసిన వారందరికీ బంప్స్ వస్తున్నాయి. ఈ మాసియెస్ట్ ట్రైలర్ సినీ అభిమానులను ఎంతో ఆకట్టుకుంటోంది. 2 నిమిషాల 12 సెకన్లలో కింగ్ ఖాన్ షారూఖ్ సత్తా చూపించాడు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో అదుర్స్ అనిపిస్తోంది. ‘‘ఎవరు నేను? ఎవరిని కాను. ఎవరిని కాను. తెలియదు. తల్లికి ఇచ్చిన మాట కావచ్చు, నెరవేరని లక్ష్యం కావచ్చు. నేను మంచి వాడినా? చెడ్డవాడినా? పుణ్యాత్ముడినా? పాపాత్ముడినా? నీకు నువ్వే తెలుసుకో. ఎందుకంటే నేనే నువ్వు’’ అంటూ షారుఖ్ వాయిస్ తో మెట్రో స్టేషన్ లో ట్రైలర్ మొదలవుతుంది. “నేను విలన్ అయితే, ఏ హీరో నా ముందు నిలబడలేడు” అంటూ కింగ్ ఖాన్ గర్జన అదరగొడుతుంది. అంతేకాదు.. చివర్లో గుండుతో షారుఖ్ ఖాన్ తన అభిమానులకు షాకిచ్చాడు. ఓ ఓల్డ్ సాంగ్‌కు ఫన్నీగా డ్యాన్స్ చేస్తూ విలనిజం చూపించాడు. దీపికా పదుకొనే, నయనతార, ప్రియమణి యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టారు. ఇక ఈ మూవీ విడుదలయ్యాక ఇండియా బాక్సాఫీస్ రీకార్డ్స్ అన్నింటిని అధిగమిస్తుందని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఎవరు నేను? ఎవర్ని కాను , అని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అంటూ సోషల్ మీడియాలో షారుఖ్ ‘జవాన్‘ ట్రైలర్ ను షేర్ చేశారు.
సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా ‘జవాన్‘ విడుదల
ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ కు జోడీగా నయనతార నటిస్తుంది. విజయ్ సేతుపతి విలన్ గా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రియమణి, సాన్య మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగిబాబు, రిధి డోగ్రా కీలకపాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ‘జవాన్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 7న విడుదల కానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. SRK నటించిన ఈ చిత్రం 2023లో విడుదలైన అతిపెద్ద చిత్రాలలో ఒకటిగా పేరు తెచ్చుకోనుందని ఆయన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
షారుఖ్ ఖాన్ ఈ ఏడాది జనవరిలో 'పఠాన్'తో ప్రపంచవ్యాప్తంగా రూ. 1050 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. భారతదేశంలో రూ. 525 కోట్ల నెట్‌తో షారుఖ్.. భారీ బ్లాక్‌బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రం దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచింది.
Read Also: మీరు గే కదా, నిజమేనా? నెటిజన్ ప్రశ్నకు కరణ్ జోహార్ ఊహించని సమాధానం
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial