అన్వేషించండి

Prabhas Salary: ‘సలార్’ మూవీకి కళ్లు చెదిరే రెమ్యునరేషన్ తీసుకుంటున్న ప్రభాస్, పైగా లాభాల్లో వాటా కూడానట!

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ‘సలార్’ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా కోసం ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్ రేంజి ఓ రేంజిలో పెరిగిపోయింది. జక్కన్న చిత్రంతో దేశ వ్యాప్తంగా మార్కెట్ ను పెంచుకున్నారు రెబల్ స్టార్. ఈ సినిమా తర్వాత ఆయన అన్నీ పాన్ ఇండియన్ సినిమాలే చేస్తున్నారు. అయితే, ‘బాహుబలి’ తర్వాత  వచ్చిన పాన్ ఇండియన్ సినిమాలు ఏవీ అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. ‘సాహో, రాధేశ్యామ్’, ‘ఆది పురుష్’ చిత్రాలు ఎంతో ఆర్భాటంగా విడుదలైనా ప్రేక్షకులను అలరించలేకపోయాయి. అయినప్పటికీ ప్రభాస్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ‘కేజీఎఫ్’ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌తో కలిసి ‘సలార్’ సినిమా చేస్తున్నారు. అటు ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్‌తో ‘ప్రాజెక్ట్ K’ లోనూ నటిస్తున్నారు. అటు మారుతి దర్శకత్వంలో ‘రాజా డీలక్స్’ చిత్రంలో యాక్ట్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన ‘సలార్’ టీజర్

ఇక రీసెంట్ గా విడుదలైన ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలోని ‘సలార్’ మూవీ టీజర్ దేశ వ్యాప్తంగా సంచనలం సృష్టించింది. ఈ టీజర్ చూసి అభిమానులు ఉప్పొంగిపోయారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ పీరియాడికల్ డ్రామా టీజర్ చూసిన వారికి గూస్ బంప్స్ తెప్పించారు ప్రశాంత్ నీల్. జులై 6, గురువారం విడుదలైన సలార్ టీజర్ ఏకంగా 100 మిలియన్ వ్యూస్ రాబట్టి సరికొత్త ప్రభంజనం సృష్టించింది. హైయెస్ట్ వ్యూస్ సాధించిన ఇండియన్ టీజర్ గా రికార్డు క్రియేట్ చేసింది. ఇక టీజర్ తో సినిమాపై ఉన్న అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి. 

‘సలార్’ ప్రభాస్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారంటే?

గత కొద్ది కాలం ఒక్కో సినిమాకు రూ. 100 కోట్లకు పైనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు ప్రభాస్. ఈ సినిమాకు కూడా ఆయన రూ. 100 కోట్లు పారితోషికం అందుకుంటున్నారట. దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా తన స్థానాన్ని మళ్లీ సుస్థిరం చేసుకున్నారట ప్రభాస్. అంతేకాదు, ఈ సినిమా బాక్సాఫీస్ లాభాల్లో 10% అదనంగా ప్రభాస్ అందుకోబోతున్నారట. తన ఇటీవలి చిత్రం ‘ఆదిపురుష్’ కోసం,  శ్రీరాముడి పాత్రను పోషించినందుకు రెబల్ స్టార్ రూ.100 కోట్లకు పైగా పారితోషికం తీసుకున్నారు.

'సలార్' పార్ట్ -1  సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల

దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాని మాఫియా, గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ సరసన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాలో శృతిహాసన్ 'ఆధ్య' అనే జర్నలిస్టు పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగంధూర్ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నిర్మిస్తున్నారు. రవి బాస్రూర్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతిబాబు, మలయాళ అగ్ర హీరో పృథ్వీరాజ్ కుమార్ విలన్ పాత్రలు పోషిస్తున్నారు. ఇక రెండు భాగాలుగా 'సలార్' మూవీ రాబోతుందని తాజాగా విడుదల చేసిన టీజర్ లో స్పష్టం చేశారు మేకర్స్. 'సలార్' పార్ట్ -1  ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 28న విడుదల కానుంది.

Read Also: ‘జవాన్‘ ట్రైలర్: ఏ హీరో నా ముందు నిలబడలేడంటూ గుండుతో షాకిచ్చిన షారుఖ్ ఖాన్

ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Vishwanath And Sons First Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
NTR Discharge : ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్
ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
Embed widget