అన్వేషించండి

‘RC16’ క్రేజీ అప్‌డేట్, ‘భీమా’ టీజర్ రిలీజ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

రామ్ చరణ్ - బుచ్చిబాబు సినిమాలో కన్నడ స్టార్ హీరో?
'RRR' సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గ్లోబల్ స్థాయికి చేరిన విషయం తెలిసిందే. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉండేలా చూసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ ప్రాజెక్టు తర్వాత రామ్ చరణ్ ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబుతో తన 16వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది. ఇది విషయాన్ని స్వయంగా శివ రాజ్ కుమార్ రివీల్ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘భీమా’ టీజర్: బ్రహ్మ రాక్షసుడు వచ్చేశాడు, దున్నపోతుపై గోపిచంద్ ఎంట్రీ అదుర్స్
టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం 'భీమా'. పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాకి కన్నడ దర్శకుడు ఏ. హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియా భవాని శంకర్, మాళవికా శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. లాంగ్ గ్యాప్ తర్వాత గోపీచంద్ మళ్లీ ఖాకీ డ్రెస్ లో కనిపించబోతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ ఈరోజు టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

Kaathal The Core OTT Streaming: ఓటీటీలోకి మమ్ముటి గే పాత్రలో నటించిన మూవీ - స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో కొనసాగుతున్నారు. 'కన్నూర్ స్క్వాడ్' సక్సెస్ తర్వాత ఆయన నటించిన తాజా చిత్రం ‘కాథల్ ది కోర్’. జో బేబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమ్ముట్టి సరసన జ్యోతిక నటించింది. స్వలింగ సంపర్కుల పట్ల సమాజం ఎలా వ్యవహరిస్తుంది అనే కథాంశంతో ఈ సినిమాను తెర‌కెక్కించింది. పల్లెటూరి వాతావరణం నేపథ్యంలో భార్యాభర్తల మధ్య జరిగే కథతో ఈ మూవీ కొనసాగుతోంది. న‌వంబ‌ర్ 23న విడుద‌లైన ఈ చిత్రం తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.150 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ సినిమా చూసిన పలువురు సెలబ్రిటీలు సైతం అద్భుతం అంటూ ప్రశంసలు కురిపించారు. తమిళ స్టార్ హీరో సూర్య, మరో నటుడు సిద్ధార్థ్ ఈ సినిమా చాలా గొప్పగా ఉందన్నారు. జ్యోతిక సైతం ఈ చిత్రంలో మమ్ముట్టి నటనకు ఫిదా అయినట్లు చెప్పింది. ఆయన హీరోలకే హీరో అంటూ పొగడ్తల్లో ముంచెత్తింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

'యానిమల్' క్లైమాక్స్ ఫైట్ కూడా కాపీయేనా? - వైరల్ అవుతున్న ఓల్డ్ వీడియో, ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
అర్జున్ రెడ్డి మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటించిన 'యానిమల్' మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ ని అందుకుందో తెలిసిందే. డిసెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్స్ లో స్టడీ కలెక్షన్స్ లో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.860 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని రణ్ బీర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతోపాటు ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ సక్సెస్ అందుకున్నప్పటికీ యానిమల్ పై విమర్శలు ఏమాత్రం తగ్గలేదు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మంచు ఫ్యామిలీ నుంచి మరో వారసుడు - కొడుకును వెండితెరకు పరిచయం చేస్తున్న విష్ణు
టాలీవుడ్‌లో ఇప్పటికే వారసులుగా ఎంతోమంది నటీనటులు అడుగుపెట్టారు. ఇక వారందరిలో మంచు ఫ్యామిలీ సెపరేట్ క్రేజ్ ఉంది. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ కూడా మంచు నటులు ఎప్పుడూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటారు. ఇక ఈ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే రెండు తరాల నటీనటులు ఇండస్ట్రీకి పరిచయం కాగా.. ఇప్పుడు మూడో తరం నటుడు కూడా వెండితెరపై ఎంట్రీ ఇవ్వనున్నాడు. తను మరెవరో కాదు.. విష్ణు కుమారుడు అవ్రామ్ మంచు. తన వారసుడిని తన డ్రీమ్ ప్రాజెక్ట్‌తోనే ప్రేక్షకులకు పరిచయం చేయాలని డిసైడ్ అయ్యాడు విష్ణు. ఈ విషయాన్ని తన టీమ్ అధికారికంగా ప్రకటించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Mahakumbha Mela 2025 : మహా కుంభమేళాకు ఉగ్రవాద ముప్పు..! ఆస్పత్రుల్లో స్పెషల్ వార్డులు.. ఎన్ఐఏ అలెర్ట్
మహా కుంభమేళాకు ఉగ్రవాద ముప్పు..! ఆస్పత్రుల్లో స్పెషల్ వార్డులు.. ఎన్ఐఏ అలెర్ట్
Embed widget