అన్వేషించండి

‘సైంధవ్’ రివ్యూ, ‘గుంటూరు కారం’, ‘హనుమాన్’ కలెక్షన్లు - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

సైంధవ్ రివ్యూ : సైకోగా వెంకటేష్ ఎలా చేశారు? ఆయన 75వ సినిమా హిట్టా? ఫట్టా?
వెంకటేష్‌కు కుటుంబ ప్రేక్షకులలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే... ఆయనలో మాంచి మాస్ హీరో ఉన్నారు. ధర్మ చక్రం, గణేష్, లక్షీ, తులసి సినిమాల్లో యాక్షన్ సీక్వెన్సుల్లో ఎక్స్ట్రాడినరీగా చేశారు. వెంకీ నుంచి కుటుంబ ప్రేక్షకులు ఆశించే ఎమోషన్స్, సెంటిమెంట్‌తో పాటు మాస్ అంశాలు 'సైంధవ్'లో పుష్కలంగా ఉన్నాయని ట్రైలర్ చూశాక అనిపించింది. మరి, సినిమా ఎలా ఉంది? 'హిట్' సిరీస్ తీసిన దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమా ఎలా తీశారు? అనేది రివ్యూలో చూద్దాం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మెర్రీ క్రిస్మస్ రివ్యూ: విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్‌ల థ్రిల్లర్ ఎలా ఉంది?
విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ నటించిన బాలీవుడ్ సౌత్ ఇండియన్ సినిమా ‘మెర్రీ క్రిస్మస్’. అంటే ఈ సినిమాను హిందీ, తమిళ భాషల్లోనూ తెరకెక్కించారన్న మాట. దాన్ని తెలుగులోకి కూడా అదే పేరుతో డబ్ చేశారు. సంక్రాంతికి నెలకొన్న విపరీతమైన పోటీ, వివాదాల కారణంగా ఈ సినిమా విడుదల అవుతుందన్న సంగతే తెలుగు ప్రేక్షకుల్లో చాలా మందికి తెలియదు. ‘బద్లాపూర్’, ‘అంధాధున్’ లాంటి అవార్డు విన్నింగ్ థ్రిల్లర్ సినిమాలు తీసిన శ్రీరామ్ రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మరి ‘మెర్రీ క్రిస్మస్’ ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

'గుంటూరు కారం' ఫస్ట్‌డే కలెక్షన్స్‌ - దుమ్ములేపిన మహేష్‌
ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి పండగకు థియేటర్లో వచ్చింది 'గుంటూరు కారం'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీకి ముందు నుంచే విపరీతమైన బజ్‌ ఏర్పడింది. త్రివిక్రమ్‌ మ్యాజిక్‌, మహేష్‌ మ్యానరిజం సినిమాను ఏ రేంజ్‌ నిలబెడుతుందో అని ఫ్యాన్స్‌ అంతా ఊహాల్లో తెలిపోయారు. సినిమా కోసం ఈగర్‌గా వెయిట్‌ చేసిన ఆడియన్స్‌, ఫ్యాన్స్‌కు 'గుంటూరు కారం' ఘాటు అంతగా కనిపించలేదు. ఫలితంగా మిక్స్‌డ్‌ టాక్‌కు సొంతమైంది. ఓ వర్గం ఆడియన్స్‌ని నిరాశ పరిచిన ఈ మూవీ కొందరిని మాత్రం బాగా ఆకట్టుకుంది. మహేష్ మాస్ లుక్, క్యారెక్టరైషన్స్ సినిమాకు ప్లస్ అయ్యింది.  మిక్స్‌డ్‌ టాక్‌ సొంతమైన 'గుంటూరు కారం' ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ మాత్రం సర్‌ప్రైజ్‌ చేస్తున్నాయి. సూపర్‌ స్టార్ట్‌ సినిమా అంటే కలెక్షన్స్‌ మోత మోగాల్సిందే అని మరోసారి ప్రూవ్‌ చేసింది. రివ్యస్ కు భిన్నంగా 'గుంటూరు కారం' బాక్సాఫీసు వద్ద సర్‌ప్రైజింగ్‌ కలెక్షన్స్‌ చేసి మహేష్‌కు గ్రాండ్‌ ఒపెనింగ్‌ ఇచ్చింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఓటీటీలోకి వచ్చేస్తోన్న నితిన్-శ్రీలీల మూవీ, స్ట్రీమింగ్ అప్పుడే!
నితిన్ ఇటీవలే 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్'తో ఫ్యాన్స్‌ని పలకరించాడు. యంగ్ సెన్సేషన్ శ్రీలీలాతో జతకట్టాడు. లక్కీ లెగ్‌గా బ్రాండ్ సంపాదించుకున్న శ్రీలీల లక్‌ కూడా నితిన్‌కు యూజ్‌ అవ్వలేకపోయింది. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ కామెడీ చిత్రం డిసెంబర్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైయింది. దర్శక హీరోలు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. తొలి రోజే మిశ్రమ స్పందన తెచ్చుకొని ప్లాప్ గా మిగిలిపోయింది. ఈ మూవీ స్ట్రీమింగ్‌ డేట్‌పై అధికారిక ప్రకటన ఇచ్చింది డిస్నీప్లస్‌ హట్‌స్టార్‌. 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్'ను జనవరి 19 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్టు హాట్‌స్టార్‌ తెలిపింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

హనుమాన్‌ కలెక్షన్స్‌.. తొలి రోజే అన్ని కోట్లా?
'జాంబిరెడ్డి' ఫేం ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్‌ మూవీ హనుమాన్‌. ఈ సంక్రాంతి పండుగ కానుకగా థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ ఊహించని రెస్సాన్స్‌ అందుకుంది. గుంటూరు కారం రూపంలో బలమైన పోటీ ఉన్నప్పటికీ ఈ మూవీ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. విడుదలకు ముందు ప్రీమియర్‌ షో వేసి ధైర్యం చేశాడు ప్రశాంత్‌  వర్మ. మూవీ టీం నమ్మినట్టుగానే మూవీ పాజిటివ్‌ రివ్యూస్‌ తెచ్చుకుని బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టింది. తక్కువ థియేటర్లో విడుదలైనప్పటికీ ఈ మూవీ షాకింగ్ వసూళ్లు రాబట్టింది. 11 భాషల్లో పాన్‌ ఇండియాగా వచ్చిన హనుమాన్‌ అన్ని భాషల్లోనూ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. దానికి తగ్గట్టుగానే ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ కూడా భారీగా చేసినట్టు తెలుస్తోంది. ప్రీమియర్స్ ద్వారానే హనుమాన్‌ దాదాపు 2 కోట్ల 50 లక్షల షేర్ చేసినట్టు సమాచారం. విడుదలైన మొదటి రోజు ఈ మూవీ మరింత దూకుడు చూపించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

HBD Revanth Reddy: రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్‌డే విశెష్‌- సీఎం పుట్టిన రోజు కేక్ కట్‌ చేస్తానంటూ ట్వీట్ 
రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్‌డే విశెష్‌- సీఎం పుట్టిన రోజు కేక్ కట్‌ చేస్తానంటూ ట్వీట్ 
KTR Arrest : అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
Pushpa 2 Music Director: ‘పుష్ప 2’ సినిమానే కాదు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా పాన్ ఇండియానే! - లిస్టేంటి ఇంత ఉంది?
‘పుష్ప 2’ సినిమానే కాదు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా పాన్ ఇండియానే! - లిస్టేంటి ఇంత ఉంది?
Prabhas: ప్రభాస్‌తో మూడు పాన్ ఇండియా ఫిలిమ్స్... 'సలార్ 2' నుంచి మొదలు పెడితే - హోంబలే నుంచి బిగ్ అప్డేట్
ప్రభాస్‌తో మూడు పాన్ ఇండియా ఫిలిమ్స్... 'సలార్ 2' నుంచి మొదలు పెడితే - హోంబలే నుంచి బిగ్ అప్డేట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP DesamUSA White House Special Features | వైట్ హౌస్ గురించి ఈ సంగతులు మీకు తెలుసా..? | ABP DesamUS Election Results 5 Reasons for Kamala Harris Defeat

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HBD Revanth Reddy: రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్‌డే విశెష్‌- సీఎం పుట్టిన రోజు కేక్ కట్‌ చేస్తానంటూ ట్వీట్ 
రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్‌డే విశెష్‌- సీఎం పుట్టిన రోజు కేక్ కట్‌ చేస్తానంటూ ట్వీట్ 
KTR Arrest : అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
Pushpa 2 Music Director: ‘పుష్ప 2’ సినిమానే కాదు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా పాన్ ఇండియానే! - లిస్టేంటి ఇంత ఉంది?
‘పుష్ప 2’ సినిమానే కాదు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా పాన్ ఇండియానే! - లిస్టేంటి ఇంత ఉంది?
Prabhas: ప్రభాస్‌తో మూడు పాన్ ఇండియా ఫిలిమ్స్... 'సలార్ 2' నుంచి మొదలు పెడితే - హోంబలే నుంచి బిగ్ అప్డేట్
ప్రభాస్‌తో మూడు పాన్ ఇండియా ఫిలిమ్స్... 'సలార్ 2' నుంచి మొదలు పెడితే - హోంబలే నుంచి బిగ్ అప్డేట్
Appudo Ippudo Eppudo OTT: ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ఓటీటీ ప్లాట్‌ఫాం ఫిక్స్ - ఎందులో స్ట్రీమ్ కానుందంటే?
‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ఓటీటీ ప్లాట్‌ఫాం ఫిక్స్ - ఎందులో స్ట్రీమ్ కానుందంటే?
US President News: ప్రచార వ్యూహకర్తకు కీలక బాధ్యతలు- సూసీ వైల్స్‌ను వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమించిన ట్రంప్‌
ప్రచార వ్యూహకర్తకు కీలక బాధ్యతలు- సూసీ వైల్స్‌ను వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమించిన ట్రంప్‌
TGTET 2024 Application: 'టెట్-2' - 2024 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
'టెట్-2' - 2024 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
Manchu Lakshmi :  మంచు వారి అమ్మాయి ఫ్యాషన్ లుక్స్ చూశారా? Classy, sassy, and... అంటోన్న మంచు లక్ష్మీ
మంచు వారి అమ్మాయి ఫ్యాషన్ లుక్స్ చూశారా? Classy, sassy, and... అంటోన్న మంచు లక్ష్మీ
Embed widget