అన్వేషించండి

Merry Christmas Review: మెర్రీ క్రిస్మస్ రివ్యూ: విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్‌ల థ్రిల్లర్ ఎలా ఉంది?

Merry Christmas Movie Review: విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్‌ల రొమాంటిక్ థ్రిల్లర్ ఎలా ఉంది?

Merry Christmas Review
సినిమా రివ్యూ: మెర్రీ క్రిస్మస్ (హిందీ డబ్)
రేటింగ్: 3/5
నటీనటులు: విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్, టినూ ఆనంద్, సంజయ్ కపూర్, రాధికా ఆప్టే (అతిథి పాత్రలో) తదితరులు 
ఛాయాగ్రహణం: మధు నీలకండన్
రచన: ప్రదీప్ కుమార్ ఎస్, అబ్దుల్ జబ్బర్, ప్రసన్న బాల నటరాజన్, లతా కార్తికేయన్
సంగీతం: ప్రీతం
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ : డేనియల్ బి.జార్జ్
దర్శకత్వం: శ్రీరాం రాఘవన్
విడుదల తేదీ: జనవరి 12, 2024

విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ నటించిన బాలీవుడ్ సౌత్ ఇండియన్ సినిమా ‘మెర్రీ క్రిస్మస్’. అంటే ఈ సినిమాను హిందీ, తమిళ భాషల్లోనూ తెరకెక్కించారన్న మాట. దాన్ని తెలుగులోకి కూడా అదే పేరుతో డబ్ చేశారు. సంక్రాంతికి నెలకొన్న విపరీతమైన పోటీ, వివాదాల కారణంగా ఈ సినిమా విడుదల అవుతుందన్న సంగతే తెలుగు ప్రేక్షకుల్లో చాలా మందికి తెలియదు. ‘బద్లాపూర్’, ‘అంధాధున్’ లాంటి అవార్డు విన్నింగ్ థ్రిల్లర్ సినిమాలు తీసిన శ్రీరామ్ రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మరి ‘మెర్రీ క్రిస్మస్’ ఎలా ఉంది?

కథ: ఆల్బర్ట్ (విజయ్ సేతుపతి) క్రిస్మస్ ముందు రోజు రాత్రి ఏడు సంవత్సరాల తర్వాత బాంబేకు తిరిగి వస్తాడు. తన తల్లి చనిపోయిన సంగతి ఇంటి పక్కన ఉండే వ్యక్తి (టినూ ఆనంద్) చెప్తాడు. అదే రోజు ఒక రెస్టారెంట్‌లో భోజనం చేయడానికి వెళ్తాడు. అక్కడికి మరియా (కత్రినా కైఫ్) తన కూతురితో కలిసి వస్తుంది. ఆమె ఎవరిని అయితే డేట్‌కు తీసుకెళ్లడం కోసం వస్తుందో అతను మరియా బిడ్డను చూసి డేట్ మధ్యలో వదిలేసి వెళ్లిపోతాడు. ఆల్బర్ట్ అక్కడి నుంచి సినిమాకు వెళ్లిపోతాడు. మరియా కూడా అనుకోకుండా అదే సినిమాకు వెళ్తుంది. అక్కడ ఇద్దరికీ పరిచయం ఏర్పడుతుంది. ఆల్బర్ట్‌కు ఎవరూ లేరని తెలిసి క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కు మరియా తన ఇంటికి ఆహ్వానిస్తుంది. ఆల్బర్ట్, మరియా మధ్యలో ఒకసారి బయటకు వెళ్లి వచ్చే సరికి మరియా భర్త హాల్లో చనిపోయి ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మరియా భర్తను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? ఆల్బర్ట్ గతం ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: ప్రేక్షకుల ఊహలకు, అంచనాలకు ఏమాత్రం అందకుండా కథను నడపటం శ్రీరామ్ రాఘవన్ స్పెషాలిటీ. ఇప్పటివరకు శ్రీరామ్ రాఘవన్ తీసిన సినిమాల్లో స్టోరీ లైన్ చిన్నదే అయినా ట్రీట్‌మెంట్‌తో దాన్ని సమ్‌థింగ్ స్పెషల్ మారుస్తారు ఆయన. ‘మెర్రీ క్రిస్మస్’ కూడా ఆ కోవలోకే వెళ్తుంది. స్టోరీ పరంగా ‘మెర్రీ క్రిస్మస్’ లైన్ చాలా చిన్నది. కానీ మేకింగ్‌లోనే శ్రీరాం రాఘవన్ మ్యాజిక్ కనిపిస్తుంది. సినిమా ప్రారంభం అయిన దగ్గర నుంచి కథ నడిచే తీరు, పాత్రల ప్రవర్తన ప్రేక్షకుడి ఆలోచనని ఒకవైపు తీసుకెళ్తుంది. కానీ నిజానికి స్క్రీన్‌పై జరిగే కథ వేరుగా ఉంటుంది.

ప్రథమార్థంలో చాలా వరకు విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్‌ల కెమిస్ట్రీ మీదనే సాగుతుంది. ఇంటర్వల్ నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. ఫస్టాఫ్ కాస్త స్లోగా సాగినప్పటికీ ఎక్కడా బోర్ కొట్టదు. సెకండాఫ్ మాత్రం చాలా గ్రిప్పింగ్‌గా ఉంది. ఈ సినిమా గురించి ఏం చెప్పాలన్నా అది కచ్చితంగా స్పాయిలరే అవుతుంది. ఎక్కువ రివీల్ చేయకుండా స్క్రీన్‌ప్లే గురించి చెప్పాలంటే మాత్రం విజయ్ సేతుపతి... కత్రినా కైఫ్ ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు ‘అసలేం జరిగింది? ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది?’ అనే ఆసక్తి కలుగుతుంది. కత్రినా ఇంటికి విజయ్ రెండో సారి వచ్చినప్పుడు ‘ఇదేందయ్యా ఇది? ఇది నేనెప్పుడూ చూడలా’ అనిపిస్తుంది. అలా స్క్రీన్ మీద లీడ్ యాక్టర్స్ ఏ ఎమోషన్ అయితే ఫీల్ అవుతారో... ఆడియన్స్ కూడా అదే ఎమోషన్, థ్రిల్ ఫీలవుతారు.

‘మెర్రీ క్రిస్మస్’ స్క్రీన్‌ప్లే, క్యారెక్టర్ డిజైన్‌లో ఉన్న మరో ప్లస్ పాయింట్ ఏంటంటే విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ సరదాగా కూర్చుని మాట్లాడుకుంటున్నా చూసేవాళ్లందరికీ ‘ఏదో తేడాగా ఉందే’ ... వెనక ఏదో ఉంది అనిపిస్తుంది. సాధారణంగా థ్రిల్లర్లలో అలా అనిపిస్తే రైటింగ్‌లో లోపాలున్నట్లు అనుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం అది రైటింగ్‌లో ఉన్న లోపం కాదు బ్రిలియన్స్. విజయ్, కత్రినాలు మాట్లాడుకునే ప్రతి మాటలో ఒక నిగూడార్థం ఉంటుంది. కొన్ని సీన్లలో నోటి నుంచి వచ్చే మాటకి, కళ్లలో పలికే ఎక్స్‌ప్రెషన్‌కు సంబంధం ఉండదు. ఒక సీన్‌లో విజయ్ సేతుపతి ‘ఈ మూడు గంటలూ హాయిగా ఒక సినిమా చూసినట్లు ఉంది. ఒక కలలా ఉంది. అలారం నన్ను లేపకముందే నేను వెళ్లిపోవాలి.’ అని వెళ్లిపోతాడు. కానీ అక్కడ విజయ్ సేతుపతి వెళ్లడని ముందు కూర్చుని చూసే ఆడియన్స్‌కు కూడా అర్థం అవుతుంది. కానీ అది ప్రిడిక్టబుల్ సీన్ అనిపించదు. అదే మ్యాజిక్కు.

సినిమా క్లైమ్యాక్స్ విషయంలో మాత్రం కాస్త మిశ్రమ స్పందన వచ్చే అవకాశం ఉంది. ‘అంధాధున్’ తరహా ఓపెన్ ఎండింగ్ క్లైమ్యాక్స్ నచ్చేవారికి ఈ సినిమాతో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ ప్రాపర్ ఎండింగ్ దర్శకుడే ఇవ్వాలని కోరుకునే ప్రేక్షకులకు మాత్రం మధ్యలో వదిలేసినట్లు అనిపిస్తుంది.

టెక్నికల్‌గా కూడా ‘మెర్రీ క్రిస్మస్’ను ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కించారు. మొదటిగా సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే ఇదొక రెట్రో సినిమా అని తెలుస్తుంది కానీ ఏ కాలంలో జరిగే కథ అనేది ప్రేక్షకుడి ఊహకు కూడా అందకుండా జాగ్రత్తగా పడ్డారు. ఒకే థియేటర్లో 1940లో, 1978లో విడుదల అయిన హాలీవుడ్ సినిమాలు ఆడుతూ ఉంటాయి. సినిమాలో ఎక్కడా ఒక క్యాలెండర్ కూడా కనిపించదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా కొత్తగా ఉంది. 1940, 1950ల కాలం నాటి హాలీవుడ్ థ్రిల్లర్స్‌లో వచ్చే తరహా మ్యూజిక్‌ను ఇందులో వినవచ్చు. ముఖ్యంగా క్లైమ్యాక్స్‌లో ఒకే పిచ్‌లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంతే సూపర్బ్. సెట్ వర్క్ కూడా అద్భుతంగా ఉంది. కత్రినా కైఫ్ ఇంటి సెట్‌ ఒక రెట్రో హౌస్‌ను తలపిస్తుంది. షాట్ డివిజన్ కూడా చాలా బాగా చేశారు. లెంతీ షాట్లు కూడా చాలా ఎఫెక్టివ్‌గా తీశారు.

ఇక నటీనటుల విషయానికి వస్తే... విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్‌ల మధ్య కెమిస్ట్రీనే సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. తమ పెర్ఫార్మెన్స్‌లతో సినిమాను వేరే లెవల్‌కు తీసుకువెళ్లారు. విజయ్ సేతుపతిని ఇటీవలి కాలంలో ఇలాంటి పాత్రలో ఎప్పుడూ చూడలేదు. ఎంతో డెప్త్ ఉన్న ఆల్బర్ట్ పాత్రకు తానే పర్‌ఫెక్ట్ ఛాయిస్ అనే రేంజ్‌లో పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. విజయ్ సేతుపతి టైమింగ్, పంచ్‌లు హైలెట్. ఇటీవలి కాలంలో అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమాల్లో కూడా ఇంత ఆర్గానిక్ కామెడీ చూడలేదు. సినిమాలో కత్రినా కైఫ్ సర్‌ప్రైజ్ ప్యాకేజ్. కత్రినాకు నటన సరిగ్గా రాదు అనే అపవాదు ఉండేది. కానీ ‘మెర్రీ క్రిస్మస్’లో పూర్తిగా కొత్త కత్రినాను చూడవచ్చు. తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇదే అని చెప్పవచ్చు. మిగతా పాత్రధారులందరూ తమ పాత్రల పరిధి మేర నటించారు.

ఓవరాల్‌గా చెప్పాలంటే... థ్రిల్లర్ లవర్స్ కచ్చితంగా చూడాల్సిన సినిమా ‘మెర్రీ క్రిస్మస్’. శ్రీరాం రాఘవన్ తన మార్కు ఎక్కడా మిస్ కాకుండా టాప్ క్లాస్ రొమాంటిక్ థ్రిల్లర్.

Also Read: మహేశ్‌తో మల్టీ స్టారర్, తరువాతి సినిమా ఆ దర్శకుడితోనే - నాగార్జున

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Daaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desamఆర్టీసీ బస్సులో పంచారామాలు, ఒక్క రోజులో వెయ్యి కిలో మీటర్లుPamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desam

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Thaman On Pushpa 2: 'పుష్ప 2' బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో తమన్ క్లారిటీ... బన్నీ మూవీకి ఆయన ఇచ్చిన రివ్యూ ఏమిటంటే?
'పుష్ప 2' బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో తమన్ క్లారిటీ... బన్నీ మూవీకి ఆయన ఇచ్చిన రివ్యూ ఏమిటంటే?
Sai Durga Tej : 'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
SBI Loan: లోన్‌ తీసుకున్నవాళ్లకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ - ఈ రోజు నుంచి EMIలు పెంపు
లోన్‌ తీసుకున్నవాళ్లకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ - ఈ రోజు నుంచి EMIలు పెంపు
NBK 109 Title Teaser: 'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
Embed widget