‘కల్కి’ థీమ్ మ్యూజిక్ రివీల్, మహేష్, రాజమౌళి సినిమాలో అంతర్జాతీయ నటి - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
హారర్ కథతో భయపెట్టనున్న మమ్ముట్టి - ‘భ్రమయుగం’ తెలుగు ట్రైలర్ విడుదల
కొందరు సీనియర్ హీరోల స్క్రిప్ట్ సెలక్షన్ చూస్తే.. ప్రేక్షకులు సైతం ఆశ్యర్యపోతారు. అలా 72 ఏళ్ల వయసులో కూడా ఎప్పటికప్పుడు ఛాలెజింగ్ రోల్స్ చేస్తూ హిట్లపై హిట్లు కొడుతున్నారు మమ్ముట్టి. ఇప్పుడు మరోసారి ఓ కొత్త కాన్సెప్ట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. అదే ‘భ్రమయుగం’. ఈ మూవీ ఫస్ట్ లుక్ దగ్గర నుండి ప్రతీ అప్డేట్ మలయాళ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేసింది. ఇక తాజాగా ఈ సినిమా తెలుగు రిలీజ్‌ను కూడా ఖరారు చేసుకుందని కన్ఫర్మ్ అయ్యింది. తాజాగా ‘బ్రహ్మయుగం’ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమా పూర్తిస్థాయి థ్రిల్లర్‌గా తెరకెక్కిందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
‘స్త్రీ 2’లో గెస్ట్ రోల్ చేస్తున్న యంగ్ హీరో - సినిమాటిక్ యూనివర్స్ కోసం!
సినిమాటిక్ యూనివర్స్ అని పేరు పెట్టి అందులోనే వరుసగా సినిమాలు చేయడం ఇప్పుడు ట్రెండ్‌గా మారిపోయింది. ముందుగా హాలీవుడ్‌లో ఇలాంటి సినిమాటిక్ యూనివర్స్ అనేవి మొదలయ్యాయి. ఇప్పుడు ఇండియన్ మూవీస్ కూడా ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేయడానికి వీటిని ప్రారంభించాయి. హాలీవుడ్‌లో హారర్ సినిమా యూనివర్స్ చాలా ఫేమస్. అదే విధంగా బాలీవుడ్‌లో చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు నిర్మాత దినేష్ విజన్. ఇప్పటికే ‘స్త్రీ’ అనే హారర్ కామెడీతో బ్లాక్‌బస్టర్ అందుకున్న ఈ నిర్మాత.. ఇప్పుడు దీనికి సీక్వెల్‌ను తెరకెక్కించడంలో బిజీగా ఉన్నాడు. ‘భేడియా’లో ఒక వింత జీవి ఆకారంలో కనిపించాడు యంగ్ హీరో వరుణ్ ధావన్. ఇప్పుడు ‘స్త్రీ 2’లో కూడా మరోసారి అదే పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయడం కోసం 2 రోజుల కాల్ షీట్స్‌ను నిర్మాత దినేష్‌కు అందించాడట వరుణ్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
‘కల్కి 2898 ఏడీ’ థీమ్ మ్యూజిక్‌ను రివీల్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ - వీడియో వైరల్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న చిత్రమే ‘కల్కి 2898 ఏడీ’. ముందుగా ‘ప్రాజెక్ట్ కె’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రారంభమయిన ఈ పాన్ ఇండియా చిత్రం.. ఇప్పుడు వరల్డ్ వైడ్ సినిమాలను శాసించేలా సిద్ధమవుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ.. మేలో విడుదలకు సిద్ధమవుతోంది. హిందూ మైథాలజీ కథ ఆధారంగా రానున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. తమిళ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ‘కల్కి 2898 ఏడీ’కు మ్యూజిక్‌ను అందిస్తుండగా.. దీనికి సంబంధించిన గ్లింప్స్‌ను ఒక కాన్సర్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ప్లే చేశాడు. దానికి ప్రేక్షకుల దగ్గర నుండి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
స్టైలిష్ లుక్‌లో విక్రమ్ - ఆ మూవీ సీక్వెల్ కోసమేనా?
విక్రమ్.. తన కొడుకు ధృవ్‌తో కలిసి నటించిన చిత్రమే ‘మహాన్’. అందులో తండ్రీకొడుకులు కలిసి పోటాపోటీగా నటించారని ప్రేక్షకులంతా మూవీకి ఫిదా అయ్యారు. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ మూవీ నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయ్యింది. కానీ విక్రమ్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాను ఒక్కసారి అయినా థియేటర్లలో చూడాలని ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే విక్రమ్.. తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తుంటే ‘మహాన్ 2’కు సన్నాహాలు మొదలయ్యాయని నెటిజన్లలో అనుమానాలు మొదలయ్యాయి. ‘మహాన్’లో ఎలా అయితే స్టైలిష్‌గా కనిపించాడో.. అచ్చం అదే లుక్‌తో తాజాగా సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేశాడు విక్రమ్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
మహేశ్, రాజమౌళి మూవీలో ఇండోనేషియన్ నటి - ఇన్‌స్టాగ్రామ్ చూసి కన్ఫర్మ్ చేసేస్తున్న నెటిజన్లు
చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ అనే ఇండోనేషియన్ నటి.. మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుందని సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. అమెరికాలో పుట్టిన చెల్సియా.. ఇండోనేషియన్ భాషలో పలు చిత్రాల్లో నటించింది. ఇప్పుడు మహేశ్, రాజమౌళి మూవీలో తను కూడా ఒక కీలక పాత్రలో కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో రాజమౌళిని చెల్సియా ఫాలో అవ్వడంతో ఇవి రూమర్స్ కాదు.. నిజమే అని నెటిజన్లు ఫిక్స్ అయిపోతున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం అవ్వడంతో త్వరలోనే ఒక ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేసి సినిమా విశేషాలను పంచుకోనున్నాడట రాజమౌళి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)