అన్వేషించండి

Bramayugam: హారర్ కథతో భయపెట్టనున్న మమ్ముట్టి - ‘భ్రమయుగం’ తెలుగు ట్రైలర్ విడుదల

Bramayugam Trailer: మలయాళ సీనియర్ హీరో మమ్ముట్టి మరోసారి డిఫరెంట్ కథతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నారు. ఈసారి ‘భ్రమయుగం’ అనే హారర్ కథతో అందరినీ భయపెట్టబోతున్నారు.

Bramayugam Telugu Trailer: కొందరు సీనియర్ హీరోల స్క్రిప్ట్ సెలక్షన్ చూస్తే.. ప్రేక్షకులు సైతం ఆశ్యర్యపోతారు. అలా 72 ఏళ్ల వయసులో కూడా ఎప్పటికప్పుడు ఛాలెజింగ్ రోల్స్ చేస్తూ హిట్లపై హిట్లు కొడుతున్నారు మమ్ముట్టి. ఇప్పుడు మరోసారి ఓ కొత్త కాన్సెప్ట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. అదే ‘భ్రమయుగం’. ఈ మూవీ ఫస్ట్ లుక్ దగ్గర నుండి ప్రతీ అప్డేట్ మలయాళ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేసింది. ఇక తాజాగా ఈ సినిమా తెలుగు రిలీజ్‌ను కూడా ఖరారు చేసుకుందని కన్ఫర్మ్ అయ్యింది. తాజాగా ‘బ్రహ్మయుగం’ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమా పూర్తిస్థాయి థ్రిల్లర్‌గా తెరకెక్కిందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

కథను రివీల్ చేయలేదు..

తాజాగా విడుదలయిన ‘భ్రమయుగం’ ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో ఉండబోతుందని అర్థమవుతోంది. పైగా ఈ సినిమాల్లో ఎక్కువగా పాత్రలు కూడా లేనట్టుగా అనిపిస్తోంది. పాచికలు ఆడుతూ చుట్టూ ఉన్న పరిస్థితులను శాసించే పాత్రలో మమ్ముట్టి కనిపించారు. ఆ ఆటలో అర్జున్ అశోకన్, సిద్ధార్థ్.. పాచికలు అవుతారని ట్రైలర్‌లో చూపించారు. వీరితో పాటు ట్రైలర్‌లో అమాల్డా లిజ్ కూడా ఒక సీన్‌లో కనిపించింది. ఇక సినిమా కథను ఏ మాత్రం రివీల్ చేయకుండా ట్రైలర్‌ను థ్రిల్లింగ్‌గా చూపించి ‘భ్రమయుగం’పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచేశాడు దర్శకుడు రాహుల్ సదాశివన్. ఫిబ్రవరీ 15న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమయ్యింది.

రెండు సినిమాలు మాత్రమే..

రాహుల్ సదాశివన్‌కు దర్శకుడిగా రెండు సినిమాల అనుభవమే ఉంది. అయినా మూడో సినిమాకే తన కథతో మమ్ముట్టిలాంటి సీనియర్ యాక్టర్‌ను ఇంప్రెస్ చేశాడు. ఇక వైవిధ్యభరితమైన కథలు తన దగ్గరికి ఎప్పుడు వచ్చినా నో చెప్పని మమ్ముట్టి.. ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొదట్లో ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలే లేవు. కానీ ‘భ్రమయుగం’ ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వగానే ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. మలయాళ స్టార్ మమ్ముట్టిని ఇలాంటి గెటప్‌లో ముందెన్నడూ ప్రేక్షకులు చూడలేదు. ఇక ట్రైలర్‌ను బట్టి చూస్తే ఆయన క్యారెక్టర్‌లో నెగిటివ్ షేడ్స్ కూడా ఉన్నాయని అర్థమవుతోంది. ఇప్పటికే ‘భూతకాలం’తో డిఫరెంట్ హారర్‌ను తెరకెక్కించే ప్రయత్నం చేసి పాజిటివ్ రివ్యూలు అందుకున్నాడు రాహుల్ సదాశివన్. అదే విధంగా ‘భ్రమయుగం’ కూడా ఉండబోతుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.

అన్నీ హిట్లే..

2023లో మమ్ముట్టి డిఫరెంట్ కథలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టారు. ముందుగా గతేడాది ‘కన్నూర్ స్క్వాడ్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సీనియర్ హీరో. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ అందరినీ ఆకట్టుకొని సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ఏడాది చివర్లో ఆయన నటించిన ‘కాథల్’ అయితే ఏకంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఎన్నో ఏళ్లుగా మాలీవుడ్‌లో ఉండి సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న తర్వాత ‘కాథల్’లాంటి సినిమాను అంగీకరించడం సాహసం అని అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ‘భ్రమయుగం’లో డిఫరెంట్ లుక్‌తో పాటు ఏకంగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో ఆశ్చర్యపరుస్తున్నారు మమ్ముట్టి.

Also Read: ప్రియమణి ‘భామాకలాపం 2’ ట్రైలర్ వచ్చేసింది..

టాప్ హెడ్ లైన్స్

Niharika Konidela : అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్
అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Korean Kanakaraju : కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Embed widget