Bhamakalapam 2 Trailer: ప్రియమణి ‘భామాకలాపం 2’ ట్రైలర్ వచ్చేసింది..
Bhamakalapam 2 : లాక్‌డౌన్‌లో ఓటీటీలో రిలీజైన భామకలాపం వెబ్ మూవీ మూవీ లవర్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఈ ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా భామాకలాపం 2ను వస్తుంది. తాజాగా ఈ సీక్వెల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
Priyamani Bhamakalapam 2 Trailer: లాక్‌డౌన్‌లో టైంలో ఓటీటీలకు మంచి డిమాండ్ పెరిగింది. దీంతో ఓటీటీ సంస్థలు సినీ ప్రియులను ఆకట్టుకునేందుకు సరికొత్త కంటెంట్‌తో వచ్చాయి. అలా పాండిమిక్ టైంలో చాలా సినిమాలు, వెబ్ సిరీస్‌లో నేరుగా ఓటీటీలోకి వచ్చాయి. అలా 2022లో వచ్చింది వెబ్ ఫిలిం 'భామాకలాపం'. నేరుగా ఆహాలో రిలీజైన ఈ వెబ్ మూవీ డిజిటల్ ప్రియులను బాగా ఆకట్టుకుంది. విలక్షణ నటి ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ ఫిలిం ఆహాలో సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మేకర్స్ దీనికి కొనసాగింపుగా ‘భామాకలాపం 2’ను తీసుకువస్తున్నారు.
దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత సీక్వెల్ రాబోతుంది. ఈ క్రమంలో తాజాగా ‘భామాకలాపం 2’ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మొదటి భాగాన్ని మించిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ వెబ్ మూవీ ట్రైలర్‌ను ఆహా విడుదల చేసింది. ఆహా ఒరిజినల్‌గా రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 16 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ సీక్వెల్‌పై అంచనాలు పెంచుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన హౌస్ వైఫ్ తన ఉనికి చాటుకునేందుకు సొంతంగా ఓ హోటల్ పెట్టాలనుకుంటుంది. అలాంటి ఆమెకు ఓ మాఫీయ వల్ల ఊహించని పరిణామాలు ఎదురవడం, వాటిని ఆమె ఎలా ఎదుర్కొని నిలబడిందనేది ఈ సీక్వెల్ ఉండబోతుందని ఈ తాజా ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. ఇంతకి ఈ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.
ట్రైలర్ ఎలా ఉందంటే
ఈ సీక్వెల్ మొత్తం బంగారు కోడిపుంజు చూట్టు సాగుతుందని అర్థమవుతుంది. అనుపమ (ప్రియమణి) తాను యూట్యూబ్ ద్వారా సంపాదించిన డబ్బుతో అనుపమ ఘుమఘుమ అనే హోటల్ పెట్టాలని అనుకుంటున్నానని తన భర్తకు చెబుతున్న సీన్‌తోనే ట్రైలర్ మొదలైంది. అదే సమయంలో ఆమె ఓ కుకింగ్ ఐడల్ షోలో పాల్గొంటుంది. దానికి సెలక్ట్ అవ్వడం.. సంతోషంతో ఈ విషయాన్ని తన భర్తకు చెప్పుకుంటుంది. అయితే ఈ పోటీలో గెలిచిన వారికి బంగారు కోడిపుంజు బహుమతిగా ఉంటుంది. అయితే, దాన్ని దొంగలించేందుకు ఓ మాఫియా గ్యాంగ్ ప్లాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆ మాఫీయ గ్యాంగ్ వల్ల అనుపమకు ఎదురైన పరిణామాలను చూపిస్తూ ట్రైలర్ సాగింది.
ఈ క్రమంలో అనుపమ ఓ మర్డర్ ఇరికించే ప్రయత్నం చేసింది ఆ మాఫీయా గ్యాంగ్ ఆమె తెలియకుండ తన హోటల్‍లో ఓ శవం ఉంచి కేసులో ఇరికిస్తారు. ఈ కేసు నుంచి బయటపడాలంటే తమ కోసం బంగారు కోడిపుంజు దొంగతనం చేయాలని రౌడీలు.. అనుపమను బెదిరిస్తారు. “అన్ని దారులు మూసుకుపోయాయి అక్క. మర్డర్ కన్నా దొంగతనం చిన్నతప్పేమో?” అని అనుపమను శిల్ప (శరణ్య ప్రదీప్) కన్వీన్స్ చేస్తుంది. ఆ తర్వాత సీరత్ కపూర్ ఎంట్రీ ఉంది. అనంతరం కుకింగ్ కాంపిటిషన్ మొదవుతుంది.
“70mmలో మహాభారతం చూపించావు. క్యారెక్టర్ కాస్త కన్ ఫ్యూజింగ్‍గా ఉంది. సత్యవతివా.. కుంతివా.. లేక శిఖండివా..” అని విలన్ అనగా.. ఓ మామూలు హౌస్‍వైఫ్‌ని అని అనుపమ చెబుతుంది. టీవీలో మొత్తం నీ గురించే చూపిస్తున్నారని భర్త అంటే.. “అక్కడ జరిగింది ఒకటి వీళ్లు చూపించేది ఒకటి” అని కవర్ చేసుకుంటారు అనుపమ. నేషనల్ అవార్డు విన్నింగ్ నటి అని శిల్ప చెప్పే డైలాగ్‍తో భామాకలాపం 2 ట్రైలర్ ముగిసింది. ఇలా ఆద్యాంతంగా ఆసక్తిగా సాగిన ట్రైలర్ మూవీ హైప్ క్రియేట్ చేస్తుంది. ఫిబ్రవరి 16న స్ట్రీమింగ్ రెడీ అయిన భామా కలాపం 2’ పార్ట్ వన్‌లా మెప్పిస్తుందో లేదో చూడాలి.