అన్వేషించండి

‘రామాయణం’లో రకుల్, ‘ఈగల్’ ఫస్ట్ డే కలెక్షన్లు - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

‘రామాయణం‘లో రకుల్ - క్యారెక్టర్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
దర్శకుడు నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న చిత్రం ‘రామాయణం’. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, సౌత్ బ్యూటీ సాయి పల్లవి సీతారాముడిగా నటించబోతున్నఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. వచ్చే ఏడాది(2025) దీపావళికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా మేకర్స్ శరవేగంగా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. ఈ సినిమాలో రావణ్‌గా కన్నడ స్టార్ హీరో యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్‌ కనిపించబోతున్నారు. కైకేయి పాత్రలో లారా దత్తా, విభీషణ పాత్రలో విజయ్ సేతుపతి నటించబోతున్నారు. ఈ చిత్రంలో అత్యంత కీలకమైన శూర్పణఖ పాత్రకు స్టార్ హీరోయిన్ ను ఓకే చేసినట్లు తెలుస్తోంది. రావణుడి చెల్లి శూర్పణఖ పాత్రకు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సెట్ అవుతుందని నితీష్ తివారీ భావిస్తున్నారట. ఇప్పటికే చిత్రం బృందం రకుల్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

వివాదంలో 'బేబీ' సినిమా.. క‌థ నాదంటూ ద‌ర్శ‌క, నిర్మాత‌ల‌పై కేసు
'బేబీ'.. యూత్ కి క‌నెక్ట్ అయిన సినిమా. 2023 రిలీజైన ఈ సినిమా సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకుంది. క‌లెక్ష‌న్లు కూడా బాగానే వ‌చ్చాయి. అయితే, ఈ చిత్ర‌బృందం ఇప్పుడు చిక్కుల్లో ప‌డింది. బేబి సినిమా క‌థ త‌న‌దంటూ షార్ట్ ఫిలిమ్స్ డైరెక్ట‌ర్ శిరిన్ శ్రీ‌రామ్ కేసు న‌మోదు చేశారు. ఈ మేర‌కు రాయ‌దుర్గం పోలీసులు ద‌ర్శ‌క, నిర్మాత‌ల‌పై కేసు పెట్టారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మొయిద్దీన్ భాయ్ కి షాక్! రజనీ మూవీకి మరీ ఇంత తక్కువ ఓపెనింగ్సా?
‘జైలర్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం ‘లాల్ సలామ్’. హిందూ, ముస్లిం ఐక్యత, క్రికెట్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు, రజనీ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్వకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్నినిర్మించారు. భారీ అంచనాల ఫిబ్రవరి 9న నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రజనీ సినిమా అంటే సినిమా అభిమానుల నుంచి ఓ రేంజిలో ఆదరణ ఉంటుంది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురుస్తుంది. కానీ, ‘లాల్ సలామ్’ విషయంలో చిత్రబృందానికి షాక్ తగిలింది. గత ఆరేళ్లలో సింగిల్ డిజిట్‌ కలెక్షన్ సాధించిన చిత్రంగా నిలిచింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

పరవాలేదనిపించిన ‘ఈగల్’ ఓపెనింగ్స్ - మొదటి రోజు కలెక్షన్స్ ఎంతంటే?
మాస్ మహారాజా రవితేజ.. గత కొంతకాలంగా హిట్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. కమర్షియల్ సినిమాలతోనే మాస్ మహారాజాగా ఎదిగిన ఈ హీరో.. ఇప్పటికీ ఎక్కువగా కమర్షియల్ కథలనే ఎంచుకోవడానికి ఇష్టపడతాడు. అదే తరహాలో ‘ఈగల్’తో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రిలీజ్ డేట్‌ కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్న తర్వాత ఫైనల్‌గా ‘ఈగల్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థ్రిల్లర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఫైట్స్, క్లైమాక్స్ చాలా బాగున్నాయని ప్రేక్షకులు రివ్యూ ఇచ్చారు. ఇక ఓపెనింగ్ డే కలెక్షన్స్ విషయంలో కూడా ‘ఈగల్’ పరవాలేదనిపించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఓటీటీలోకి 'నా సామిరంగ'- స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పటి నుంచంటే..
టాలీవుడ్ స్టార్ హీరో  అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో రూపొందిన రీసెంట్ మూవీ ‘నా సామిరంగ’. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా విడుదల అయ్యింది. ఈ చిత్రంతో పాటు 'హనుమాన్‌', 'గుంటూరు కారం', 'సైంధవ' సినిమాలు సైతం రిలీజ్ అయ్యాయి. అయినప్పటికీ ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. వసూళ్ల పరంగానూ సత్తా చాటింది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ  యాక్షన్ ఎంటర్‌టైనర్‌ కు విజయ్ బిన్నీ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ మూవీ హక్కులను ఫ్యాన్సీ అమౌంట్ కు  డిస్నీ+ హాట్‍ స్టార్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమాకు డిజిటల్ రిలీపై కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 17 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని వెల్లడించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Boxing Day Test Live Updates: పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నచ్చని పని చేసిన మన్మోహన్, అయినా మోదీ పొగడ్తలుమేం చీమూ, నెత్తురు ఉన్న నాకొడుకులమే! బూతులతో రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డిManmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Boxing Day Test Live Updates: పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
Tirumala : తిరుమలలో వైకుంఠ ఏకాదశి - వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ
తిరుమలలో వైకుంఠ ఏకాదశి - వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ
Gas Cylinder Price Cut: కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
Samantha: సింపుల్ లైఫ్... వింటర్‌లో సమంతలా దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఎంత బావుంటుందో కదూ
సింపుల్ లైఫ్... వింటర్‌లో సమంతలా దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఎంత బావుంటుందో కదూ
Year Ender 2024: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
Embed widget