అన్వేషించండి

Rakul Preet Singh: ‘రామాయణం‘లో రకుల్ - క్యారెక్టర్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణం’లో రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆమెతో చర్చలు కొనసాగుతున్నాయట.

Rakul Preet Singh In Ramayana: దర్శకుడు నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న చిత్రం ‘రామాయణం’. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, సౌత్ బ్యూటీ సాయి పల్లవి సీతారాముడిగా నటించబోతున్నఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. వచ్చే ఏడాది(2025) దీపావళికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా మేకర్స్ శరవేగంగా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. ఈ సినిమాలో రావణ్‌గా కన్నడ స్టార్ హీరో యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్‌ కనిపించబోతున్నారు. కైకేయి పాత్రలో లారా దత్తా, విభీషణ పాత్రలో విజయ్ సేతుపతి నటించబోతున్నారు.

‘రామాయణం’లో రకుల్ ప్రీత్ సింగ్

తాజాగా ‘రామయణం’ సినిమాకు సంబంధించి మరో న్యూస్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో అత్యంత కీలకమైన శూర్పణఖ పాత్రకు స్టార్ హీరోయిన్ ను ఓకే చేసినట్లు తెలుస్తోంది. రావణుడి చెల్లి శూర్పణఖ పాత్రకు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సెట్ అవుతుందని నితీష్ తివారీ భావిస్తున్నారట. ఇప్పటికే చిత్రం బృందం రకుల్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. “రామాయణంలో శూర్పణఖ పాత్ర కోసం రకుల్, నితీష్ తివారీ కొంతకాలంగా చర్చలు జరుపుతున్నారు. ఈ పాత్రలో నటించేందుకు రకుల్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. రామాయణంలో రావణుడితో పాటు శూర్పణఖ పాత్ర ఎంతో ముఖ్యమైనది” అని బాలీవుడ్ రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి.  

పెళ్లి తర్వాత రకుల్ నటించే తొలి చిత్రం ఇదే!

‘రామాయణం’ చిత్రంలో శూర్పణఖ పాత్ర కోసం ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ లుక్ టెస్ట్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అనుకున్న క్యారెక్టర్ కు రకుల్ చక్కగా సెట్ అయ్యిందని దర్శకుడు నితీష్ భావిస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు  జరిగితే, జాకీ భగ్నానితో తన పెళ్లి తర్వాత రకుల్ నటించబోయే తొలి చిత్రం ‘రామాయణం’ అవుతుంది. “రకుల్ ‘రామాయణం’ ఇతిహాస ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి ఎంతో ఉత్సాహంగా ఉంది. త్వరలో అగ్రమెంట్ చేసుకోబోతోంది. ‘రామాయణం’ లాంటి సినిమాలో నటించే అవకాశం జీవితంలో ఒకేసారి వస్తుంది అని రకుల్ భావిస్తోంది” అని బాలీవుడ్ నివేదికలు చెప్తున్నాయి.    

మార్చి నుంచి ‘రామాయణం’ షూటింగ్

‘రామాయణం’ షూటింగ్ మార్చి నుంచి ప్రారంభం కానుంది. మేలో సన్నీ డియోల్ పార్ట్ ను పూర్తి చేయాలని భావిస్తున్నారు. అటు జులైలో యష్ ‘రామాయణం’ సెట్స్ లో అడుగు పెట్టే అవకాశం ఉంది. యష్ పార్ట్ వరకు ఈ సినిమా తొలి భాగంగా రూపొందనున్నట్లు తెలుస్తోంది. 2025 దీపావళి కానుకగా ‘రామాయణం’ తొలి భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా దర్శకుడు ప్రయత్నం చేస్తున్నారు.

‘రామాయణం’ నుంచి సాయి పల్లవి తప్పుకుందా?

అటు ‘రామాయణం’ సినిమా నుంచి సాయిప‌ల్ల‌వి బయటకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. సాయి ప‌ల్ల‌వి ప్లేస్ లో ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి జాన్వీ కపూర్ నటిస్తున్నారనే టాక్ వినిపించింది. వాస్తవానికి ఈ సినిమాలో రాముడిగా ర‌ణ్ బీర్ న‌టిస్తుండ‌గా, ఆలియాను సీతగా తీసుకోవాలని దర్శకుడు నితీష్ భావించారట. కానీ, ఆలియా భ‌ట్ వేరే ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉండ‌టం వ‌ల్ల‌ డెట్స్ అడ్జ‌స్ట్ కాలేదట. ఈ నేపథ్యంలో సాయిప‌ల్ల‌విని సీతగా అనుకున్నార‌ట‌. ఇప్పుడు ఆమె ప్లేస్ లో జాన్వీ కపూర్ ని రీప్లేస్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. 

Read Also: విక్రమ్ సినిమాలో విలక్షణ నటుడు, సాలిడ్ అప్ డేట్ ఇచ్చిన మేకర్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Embed widget