Eagle Day 1 Collections: పరవాలేదనిపించిన ‘ఈగల్’ ఓపెనింగ్స్ - మొదటి రోజు కలెక్షన్స్ ఎంతంటే?
Eagle Movie Collections: రవితేజ, కార్తిక్ ఘట్టమనేని కాంబినేషన్‌లో వచ్చిన ‘ఈగల్’ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. పాజిటివ్ టాక్‌తో ఓపెన్ అయిన ఈ మూవీకి మొదటిరోజు మంచి కలెక్షన్స్ లభించాయి.
Eagle Day 1 Box Office Collections: మాస్ మహారాజా రవితేజ.. గత కొంతకాలంగా హిట్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. కమర్షియల్ సినిమాలతోనే మాస్ మహారాజాగా ఎదిగిన ఈ హీరో.. ఇప్పటికీ ఎక్కువగా కమర్షియల్ కథలనే ఎంచుకోవడానికి ఇష్టపడతాడు. అదే తరహాలో ‘ఈగల్’తో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రిలీజ్ డేట్ కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్న తర్వాత ఫైనల్‌గా ‘ఈగల్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థ్రిల్లర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఫైట్స్, క్లైమాక్స్ చాలా బాగున్నాయని ప్రేక్షకులు రివ్యూ ఇచ్చారు. ఇక ఓపెనింగ్ డే కలెక్షన్స్ విషయంలో కూడా ‘ఈగల్’ పరవాలేదనిపించింది.
మొదటిరోజు ఎంతంటే.?
ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నాడు కార్తిక్ ఘట్టమనేని. ఇప్పటికే నిఖిల్ హీరోగా తెరకెక్కిన ‘సూర్య వర్సెస్ సూర్య’తో డైరెక్టర్‌గా కూడా మారాడు. కానీ ఆ మూవీ తనకు అంత సక్సెస్ అందించకపోవడంతో మళ్లీ సినిమాటోగ్రాఫీ పైనే ఫోకస్ పెట్టాడు. మళ్లీ ఇన్నాళ్లకు ‘ఈగల్’తో మరోసారి డైరెక్టర్‌గా మారాడు. కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్‌కు రవితేజ యాక్షన్ కూడా యాడ్ అయ్యింది కాబట్టి ‘ఈగల్’కు మంచి ఓపెనింగ్సే వచ్చాయి. మొదటిరోజే రూ.6 కోట్ల కలెక్షన్స్ సాధించిందట ఈ సినిమా. ఇప్పటికే ఈ మూవీకి పాజిటివ్ రివ్యూలు రావడంతో మెల్లగా మౌత్ టాక్ వల్ల ‘ఈగల్’ కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు.
ఫ్యాన్స్ నుండి పాజిటివ్ టాక్..
ముందుగా జనవరి 15న ‘ఈగల్’.. ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ అప్పటికే పలువురు సీనియర్ హీరోల సినిమాలు రేసులో ఉండడంతో ఈ సినిమా పక్కకు తప్పుకుంది. రవితేజ.. స్వయంగా సంక్రాంతి రేసు నుండి తప్పుకోవడానికి సిద్ధం అవ్వడంతో ఫిబ్రవరీ 9న ‘ఈగల్’ సోలో రిలీజ్ చేయిస్తామని నిర్మాతలు మాటిచ్చారు. కానీ పలు చిన్న సినిమాలు కూడా ‘ఈగల్’తో పోటీ పడడానికి ఫిబ్రవరీ 8, 10న రిలీజ్ అయ్యాయి. అయినా కూడా రవితేజ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాపై అంచనాలు పెంచేసుకొని.. మొదటి రోజే థియేటర్లకు వెళ్లి చూసి.. మూవీ బాగానే ఉందంటూ పాజిటివ్ రివ్యూలు అందించారు. ‘ఈగల్’కు సీక్వెల్ కూడా ఉండడంపై ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.
అప్పుడే సీక్వెల్ సిద్ధం..
టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా ‘ఈగల్’ను నిర్మించారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. నవదీప్.. మరో కీలక పాత్రలో కనిపించాడు. ఈ సినిమా ద్వారా కార్తిక్ ఘట్టమనేనికి దర్శకుడిగా మంచి గుర్తింపు లభించింది. దీంతో తాను సినిమాటోగ్రాఫర్‌గా మాత్రమే కాకుండా అప్పుడప్పుడు డైరెక్టర్‌గా కూడా ప్రయోగాలు చేయవచ్చని ఫ్యాన్స్ సలహా ఇస్తున్నారు. ‘ఈగల్’ విడుదల అవ్వకముందే స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న సమయంలోనే దీనికి సీక్వెల్ ఉండాలని ప్లాన్ చేసుకున్నారట మేకర్స్. ‘ఈగల్ యుద్ధ కాండ’ అనే టైటిల్‌తో ఈ సీక్వెల్ తెరకెక్కనుంది. దీనికి మించి వివరాలు ఏమీ బయటపెట్టలేదు మూవీ టీమ్.
Also Read: ట్రూ లవర్ రివ్యూ: 'గుడ్ నైట్' హీరో కొత్త సినిమా - హిట్టా? ఫట్టా?