‘యానిమల్ 2’ అప్డేట్ ఇచ్చిన సందీప్, ‘గోట్ లైఫ్’ కలెక్షన్లు - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
'యానిమల్'కు రోలెక్స్ బెస్ట్ - 'యానిమల్ 2' అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా
రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన 'యానిమల్' (Animal Movie), ఆ సినిమా సాధించిన సక్సెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్సాఫీస్ నంబర్స్, కలెక్షన్స్ సినిమా విజయం గురించి చెబుతాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంతో పాటు రణబీర్ కపూర్ నటనపై ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపించారు. కోలీవుడ్ హీరోల్లో ఎవరైతే 'యానిమల్' పాత్రకు బావుంటుంది? అని అడిగితే సందీప్ రెడ్డి వంగా ఏం చెప్పారో తెలుసా? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
విజయ్ కోసమే కథ రాసుకున్నా, ఆయన మ్యానేజర్‌కూ ఫోన్ చేశాను కానీ... - 'రత్నం' ప్రెస్‌మీట్‌లో విశాల్ కీలక వ్యాఖ్యలు
చాలామంది హీరోలకు... దర్శకులుగా మారాలని కోరిక ఉంటుంది. కానీ హీరోలుగానే ఆన్ స్క్రీన్ కనిపించడంలో బిజీ అవ్వడంతో ఆఫ్ స్క్రీన్ డైరెక్షన్‌లో ప్రయోగం చేయడానికి వారికి సమయం దొరకదు. అలా హీరో టూ డైరెక్టర్ గా మారాలనుకుంటున్న వారిలో విశాల్ కూడా ఒకరు. తాజాగా తన అప్‌కమింగ్ మూవీ ‘రత్నం’ ప్రెస్ మీట్‌లో కూడా ఇదే విషయంపై మరోసారి మాట్లాడారు. కోవిడ్ తర్వాత ఏకంగా హీరో విజయ్‌కు ఫోన్ చేసి తన దగ్గర కథ ఉందని చెప్పిన విషయాన్ని బయటపెట్టారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
25 రోజుల్లో 150 కోట్లు... 'గోట్ లైఫ్' రికార్డ్, మలయాళంలో 'తగ్గేది లే' అంటోన్న పృథ్వీరాజ్
గత రెండు నెలల్లో మలయాళం సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తూ వస్తున్నాయి. అందులో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన లేటెస్ట్ మూవీ 'ది గోట్ లైఫ్' (తెలుగులో 'ఆడు జీవితం') కూడా ఒకటి. ఈ మూవీ విడుదలయ్యి ఇప్పటికి 25 రోజులు అవుతుంది. అయినా ఇంకా సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవ్వడంతో పాటు దీనిని చూడడానికి ప్రేక్షకులు సైతం ఇంకా థియేటర్లకు రావడం విశేషం. తాజాగా ‘ది గోట్ లైఫ్’ విడుదలయ్యి 25 రోజులు పూర్తవ్వడంతో ఈ 25 రోజుల్లో మూవీ ఎంత కలెక్షన్స్ సాధించింది అనే విషయాన్ని మేకర్స్ బయటపెట్టారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
చాందిని చౌదరి అంటే నాకు మహా కోపం, షూట్‌లో వెయిట్ చేయించింది కానీ, అజయ్ ఘోష్ సెన్సేషనల్ కామెంట్స్
సీనియర్ నటుడు అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి‘. క్యూట్ బ్యూటీ చాందిని చౌదరి కీలక పాత్ర పోషిస్తుంది. శివ పాలడుగు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 50 ఏళ్ల వయసులో డీజే కావాలనుకునే వ్యక్తి, అతని మధ్య తరగతి కుటుంబలోని కష్టాలు, కన్నీళ్లను బేస్ చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. చక్కటి కంటెంట్ తో రూపొందిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో చిత్రబృందం పాల్గొని సందడి చేసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
విక్రమ్ ‘వీర ధీర శూరన్’లో మలయాళ సీనియర్ యాక్టర్ - ఆయన లుక్ చూశారా?
ప్రస్తుతం చాలామంది హీరోలలాగానే కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ కూడా భారీ బడ్జెట్, ప్యాన్ ఇండియా సినిమాలపైనే దృష్టి పెట్టారు. ఆయన అప్‌కమింగ్ మూవీస్ అన్నీ దాదాపుగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రాలే. అందులో ఒకటి ‘వీర ధీర శూరన్’. ఇది ఈ హీరో కెరీర్‌లో 62వ సినిమాగా రానుంది. తాజాగా విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీలో ఎందరో సీనియర్ నటీనటులు కూడా భాగం కానున్నట్టు ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది. తాజాగా ఆ లిస్ట్‌లోకి మరో సీనియర్ యాక్టర్ కూడా చేరారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)