Vishal: విజయ్ కోసమే కథ రాసుకున్నా, ఆయన మ్యానేజర్‌కూ ఫోన్ చేశాను కానీ... - 'రత్నం' ప్రెస్‌మీట్‌లో విశాల్ కీలక వ్యాఖ్యలు
Vishal about Vijay: హీరో విశాల్ మొదటిసారి తన సినిమాను తాను డైరెక్ట్ చేసుకుంటున్నారు కానీ విజయ్‌ను కూడా డైరెక్ట్ చేయలని ఉందంటూ ‘రత్నం’ మూవీ ప్రెస్ మీట్‌లో ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.
Vishal Comments In Ratnam Movie Press Meet: చాలామంది హీరోలకు... దర్శకులుగా మారాలని కోరిక ఉంటుంది. కానీ హీరోలుగానే ఆన్ స్క్రీన్ కనిపించడంలో బిజీ అవ్వడంతో ఆఫ్ స్క్రీన్ డైరెక్షన్‌లో ప్రయోగం చేయడానికి వారికి సమయం దొరకదు. అలా హీరో టూ డైరెక్టర్ గా మారాలనుకుంటున్న వారిలో విశాల్ కూడా ఒకరు. తాజాగా తన అప్‌కమింగ్ మూవీ ‘రత్నం’ ప్రెస్ మీట్‌లో కూడా ఇదే విషయంపై మరోసారి మాట్లాడారు. కోవిడ్ తర్వాత ఏకంగా హీరో విజయ్‌కు ఫోన్ చేసి తన దగ్గర కథ ఉందని చెప్పిన విషయాన్ని బయటపెట్టారు.
విజయ్ కోసమే కథ..
‘‘నాకు నచ్చిన నటుడు విజయ్. నేను కథ రాస్తున్నప్పుడు ఆయనను దృష్టిలో పెట్టుకొని రాస్తాను. కోవిడ్ అయిన తర్వాత ఒకరోజు నిజంగానే ఎక్కువగా ఆలోచించకుండా ఆయన మ్యానేజర్‌కు ఫోన్ చేశాను. ఫోన్ ఎత్తగానే విజయ్‌కు కథ చెప్పాలి అన్నాను. ఆయన డైరెక్టర్‌ను పంపించండి అన్నారు. కాదు నేనే సార్ డైరెక్టర్ అని చెప్పాను. అటువైపు మొత్తం సైలెంట్‌గా ఉన్నారు. మళ్లీ నేనే విశాల్ అని చెప్పాను. అవును ఎవరి దగ్గరో కథ ఉందని అన్నారు కదా అన్నాడు. కాదు, నేనే డైరెక్టర్, విజయ్‌కు ఒక కథ చెప్పాలి అని మళ్లీ చెప్పాను. ఆయనకు నేనేం చెప్పానో అర్థం కాలేదు. అయినా విజయ్‌కు చెప్పేసి వస్తాను అన్నాడు. అడిగి గంటన్నర అపాయింట్‌మెంట్ ఇవ్వండి అని చెప్పాను’’ అంటూ విజయ్‌కు కథ చెప్పడం కోసం తనను సంప్రదించిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు విశాల్.
ప్రచారాల్లో పాల్గొనే ఉద్దేశ్యం లేదు..
‘రత్నం’ మూవీ ప్రెస్ మీట్‌లో విశాల్‌కు రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో తనకు నచ్చిన పొలిటీషియన్ ఎవరు అంటే వైఎస్ జగన్ అని పలుమార్లు స్టేట్‌మెంట్ ఇచ్చారు విశాల్. అయితే ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావిడి జరుగుతుండగా అక్కడ ప్రచారాల్లో పాల్గొనే అవకాశం ఏమైనా ఉందా అని అడగగా.. ‘‘నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరు అని అడిగితే చెప్పాను తప్పా ప్రచారాల్లో పాల్గొనాలనే ఉద్దేశ్యం ఏమీ లేదు. వాళ్లేదో నన్ను అప్రోచ్ అవ్వాలని నేను చెప్పలేదు’’ అని క్లారిటీ ఇచ్చారు విశాల్. ఇక ఏ హీరో సినిమా అయినా.. తను స్టార్ అయినా అప్‌కమింగ్ అయినా అందరికీ తెలుగు మీడియా ఒకే విధంగా సపోర్ట్ చేస్తుందని వారికి ధన్యవాదాలు తెలిపారు.
Also Read: చిరంజీవి మద్దతు జనసేన, బీజేపీ, టీడీపీ కూటమికే - ఓపెన్‌గా చెప్పిన మెగాస్టార్!
నేను డాక్టర్ మాట వినలేదు..
హీరోగా తను ఎదుర్కున్న ఇబ్బందుల గురించి కూడా విశాల్ మాట్లాడారు. ‘‘మా డాక్టర్ ఏది చేయొద్దంటే అదే చేస్తుంటాను. వాడు వీడు టైంలో మెల్లకన్ను పెట్టి నటించొద్దని అన్నారు. కానీ నేను వినలేదు. నా శరీరంలో ఇప్పుడు వంద కుట్లున్నాయి. నేను డాక్టర్ మాట వినకుండా ఫీట్స్ చేస్తూనే ఉన్నాను. నన్ను నమ్మి డబ్బులు పెట్టేందుకు వచ్చిన నిర్మాత బాగుండాలని ప్రయత్నిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ఇక విశాల్, ప్రియా భవానీ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘రత్నం’.. ఏప్రిల్ 26న థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది.
Also Read: నేను ఏ రాజకీయ నాయకుడితో కలిసి పనిచేయను, ఏ పార్టీలో కలిసిపోను - విశాల్