Aadujeevitham Collections: 25 రోజుల్లో 150 కోట్లు... 'గోట్ లైఫ్' రికార్డ్, మలయాళంలో 'తగ్గేది లే' అంటోన్న పృథ్వీరాజ్
Aadujeevitham The Goat Life Collections: పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ది గోట్ లైఫ్’ మూవీ తెలుగు రాష్ట్రాల్లో పోటీని తట్టుకొని నిలబడలేకపోయినా... మలయాళంలో మాత్రం కలెక్షన్స్ విషయంలో తగ్గేదే లే అంటోంది.
![Aadujeevitham Collections: 25 రోజుల్లో 150 కోట్లు... 'గోట్ లైఫ్' రికార్డ్, మలయాళంలో 'తగ్గేది లే' అంటోన్న పృథ్వీరాజ్ Aadujeevitham box office collection worldwide Prithviraj Sukumaran The Goat Life collects 125 crores in 25 days Aadujeevitham Collections: 25 రోజుల్లో 150 కోట్లు... 'గోట్ లైఫ్' రికార్డ్, మలయాళంలో 'తగ్గేది లే' అంటోన్న పృథ్వీరాజ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/21/ca9228f83e653bb72be254e23bfeb0541713682492776802_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
The Goat Life Box Office Collections: గత రెండు నెలల్లో మలయాళం సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తూ వస్తున్నాయి. అందులో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన లేటెస్ట్ మూవీ 'ది గోట్ లైఫ్' (తెలుగులో 'ఆడు జీవితం') కూడా ఒకటి. ఈ మూవీ విడుదలయ్యి ఇప్పటికి 25 రోజులు అవుతుంది. అయినా ఇంకా సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవ్వడంతో పాటు దీనిని చూడడానికి ప్రేక్షకులు సైతం ఇంకా థియేటర్లకు రావడం విశేషం. తాజాగా ‘ది గోట్ లైఫ్’ విడుదలయ్యి 25 రోజులు పూర్తవ్వడంతో ఈ 25 రోజుల్లో మూవీ ఎంత కలెక్షన్స్ సాధించింది అనే విషయాన్ని మేకర్స్ బయటపెట్టారు.
ఆడు జీవితానికి 25 రోజుల్లో 150 కోట్లు!
మలయాళం నుండి ఒకేసారి వచ్చిన ‘ప్రేమలు’, ‘మంజుమ్మెల్ బాయ్స్’, ‘ది గోట్ లైఫ్’ పోటాపోటీగా కలెక్షన్స్ సాధించాయి. ‘ప్రేమలు’ వెంటనే ఓటీటీలోకి వచ్చేయడంతో దీని కలెక్షన్స్‌కు ఫుల్ స్టాప్ పడింది. కానీ ‘మంజుమ్మెల్ బాయ్స్’, ‘ది గోట్ లైఫ్’ మధ్య పోటీ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ‘ది గోట్ లైఫ్’ విడుదలయిన 25 రోజుల్లో రూ.150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిందని మేకర్స్ ప్రకటించారు. ఇక ఈజీగా మలయాళంలో ఈ మూవీ రూ.200 కోట్ల మార్క్‌ను టచ్ చేస్తుందని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ కేరళలో మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా స్క్రీన్స్‌లో ‘ది గోట్ లైఫ్’ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.
తెలుగులో వెనకబడింది..
‘ది గోట్ లైఫ్’ తెలుగు వర్షన్ అయిన ‘ఆడు జీవితం’ కూడా ఇంకా థియేటర్లలో రన్ అవుతున్నా కూడా ఇక్కడ తెలుగు రిలీజ్‌లు, రీ రిలీజ్‌లతో పోటీ బాగా పెరిగిపోయింది. దీంతో కలెక్షన్స్ విషయంలో ‘ఆడు జీవితం’ కాస్త వెనకబడింది. కానీ కేరళలో మాత్రం ఇప్పటికీ సగానికి పైగా ఆక్యుపెన్సీతో థియేటర్లలో రన్ అవుతోంది ‘ది గోట్ లైఫ్’. బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ.. దీనిని డైరెక్ట్ చేశారు. మలయాళ చిత్ర పరిశ్రమలోనే ‘ది గోట్ లైఫ్’ను ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా భావించి.. దీనికోసం ఎంతో కష్టపడ్డారు మూవీ టీమ్. ఇక తన లుక్ విషయంలో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
మ్యూజిక్కే ప్రాణం..
‘ది గోట్ లైఫ్’లో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు హాలీవుడ్ నటుడు జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబేలు కీలక పాత్రలు ఫోషించారు. ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం.. సినిమాకు ప్రాణం పోసింది. నటుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ ఎమోషన్స్‌ను మ్యూజిక్ రూపంలో బాగా చూపించారు రెహమాన్. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్.. ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ముందుకు రావడంతో మొదట్లో ఈ మూవీకి హైప్ వచ్చినా.. ఇప్పుడు ఇతర చిత్రాలతో ఆడియన్స్ కూడా బిజీ అయిపోయారు.
Also Read: చిరంజీవి మద్దతు జనసేన, బీజేపీ, టీడీపీ కూటమికే - ఓపెన్‌గా చెప్పిన మెగాస్టార్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)