అన్వేషించండి

Veera Dheera Sooran: విక్రమ్ ‘వీర ధీర శూరన్’లో మలయాళ సీనియర్ యాక్టర్ - ఆయన లుక్ చూశారా?

Veera Dheera Sooran: విక్రమ్ హీరోగా నటిస్తున్న ‘వీర ధీర శూరన్’కు సంబంధించిన టైటిల్ టీజర్ తాజాగా విడుదలయ్యింది. ఇక ఇందులో ఎందరో సీనియర్ నటీనటులు భాగం కాగా.. తాజాగా అందులో మరో మలయాళ నటుడు కూడా చేరారు.

Veera Dheera Sooran Cast: ప్రస్తుతం చాలామంది హీరోలలాగానే కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ కూడా భారీ బడ్జెట్, ప్యాన్ ఇండియా సినిమాలపైనే దృష్టి పెట్టారు. ఆయన అప్‌కమింగ్ మూవీస్ అన్నీ దాదాపుగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రాలే. అందులో ఒకటి ‘వీర ధీర శూరన్’. ఇది ఈ హీరో కెరీర్‌లో 62వ సినిమాగా రానుంది. తాజాగా విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్‌ విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీలో ఎందరో సీనియర్ నటీనటులు కూడా భాగం కానున్నట్టు ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది. తాజాగా ఆ లిస్ట్‌లోకి మరో సీనియర్ యాక్టర్ కూడా చేరారు.

కీలక పాత్రలో మలయాళ సీనియర్ యాక్టర్!

చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న ‘వీర ధీర శూరన్’లో ఎస్‌.జె. సూర్య‌, దుస‌రా విజ‌య‌న్ కీలక పాత్రల్లో కనిపించనున్నారని ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది. సీనియర్ నటుడు సిద్ధిక్ కూడా ఇందులో భాగమయినట్టు ఒక స్పెషల్ పోస్టర్ ద్వారా ప్రకటించింది మూవీ టీమ్. ఎక్కువగా మలయాళ సినిమాల్లోనే కనిపించే ఈ నటుడు... అప్పుడప్పుడు తమిళంలో కూడా సినిమాలు చేశారు. ఇప్పుడు ‘వీర ధీర శూరన్’లో నటించబోయే కీలక నటీనటుల లిస్ట్‌లో సిద్ధిక్ కూడా భాగమయ్యారు. ఇంతే కాకుండా మరెందరో సీనియర్ నటీనటులు కూడా ఈ మూవీలో భాగం కానున్నట్టు కోలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by HR Pictures (@hrpictures__)

టైటిల్ టీజర్ విడుదల...

మార్చి 17న విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ‘వీర ధీర శూరన్’ టైటిల్ టీజర్ విడుదలయ్యింది. ఇది కేవలం టైటిల్ టీజరే అయినా దీని నిడివి మాత్రం దాదాపుగా 4 నిమిషాలు ఉంది. దీన్ని బట్టి చూస్తే ఈ మూవీలో విక్రమ్.. కాళి అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారని అర్థమవుతుంది. ఇప్పటికే చాలా సినిమాల్లో విక్రమ్.. గ్యాంగ్‌స్టర్ పాత్రను పోషించాడు. కానీ ఇందులో మాత్రం తను మాస్ అవతార్‌లో కనిపించనున్నాడని టైటిల్ టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తయిన తర్వాత ‘వీర ధీర శూరన్’ షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టనున్నాడు ఈ హీరో.

‘తంగలాన్’తో బిజీ..

‘వీర ధీర శూరన్’కు ఎస్ యు అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా... రియా శిబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హెచ్‌ ఆర్‌ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ ‘వీర ధీర శూరన్’కు సంగీతాన్ని అందించడానికి రంగంలోకి దిగాడు. ఈశ్వర్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ మూవీ గురించి మరిన్ని అప్డేట్స్‌ను త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం విక్రమ్.. ‘తంగలాన్’ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ రిలీజ్ డేట్‌పై ఇంకా క్లారిటీ లేదు.

Also Read: పవన్ కళ్యాణ్ ఎలాంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారంటే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Dasari Narayana Rao: దిక్కులేని దాసరి సమాధి... కుటుంబమే కాదు, ఇండస్ట్రీ కూడా పట్టించుకోలేదు
దిక్కులేని దాసరి సమాధి... కుటుంబమే కాదు, ఇండస్ట్రీ కూడా పట్టించుకోలేదు
Carmeni Selvam OTT : ఓటీటీలోకి కార్మేని సెల్వం - సముద్ర ఖని ఫ్యామిలీ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కార్మేని సెల్వం - సముద్ర ఖని ఫ్యామిలీ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Ajith Kumar : అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం - తల్లి మోహిని కన్నుమూత
అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం - తల్లి మోహిని కన్నుమూత
Upcoming OTT Releases: జూన్‌లో ఓటీటీ లవర్స్‌కు పండగ... ధురంధర్ 2 to కేడీ, పేట్రియాట్... స్ట్రీమింగ్ అయ్యే టైటిల్స్‌ లిస్ట్
జూన్‌లో ఓటీటీ లవర్స్‌కు పండగ... ధురంధర్ 2 to కేడీ, పేట్రియాట్... స్ట్రీమింగ్ అయ్యే టైటిల్స్‌ లిస్ట్

వీడియోలు

Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్
RR vs GT IPL 2026 Preview | RR vs GT ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూ
Archer Comments on Vaibhav Suryavanshi | వైభవ్ సూర్యవంశీ పై జోఫ్రా ఆర్చర్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DK Shivakumar Swearing In Ceremony:యంగ్ టీంతో సిద్ధమవుతున్న కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్! జట్టులో నలుగురు డిప్యూటీ సీఎంలు!
యంగ్ టీంతో సిద్ధమవుతున్న కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్! జట్టులో నలుగురు డిప్యూటీ సీఎంలు!
DK Shivakumar Karnataka CM Challenges:కర్ణాటక సీఎంగా ప్రమాణం చేయనున్న డీకే శివకుమార్‌కు సవాళ్ల స్వాగతం! ట్రబుల్ షూటర్ వాటిని ఎలా పరిష్కరిస్తారు?
కర్ణాటక సీఎంగా ప్రమాణం చేయనున్న డీకే శివకుమార్‌కు సవాళ్ల స్వాగతం! ట్రబుల్ షూటర్ వాటిని ఎలా పరిష్కరిస్తారు?
IMD Weather Alert Telugu States 2026:తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
Dasari Narayana Rao: దిక్కులేని దాసరి సమాధి... కుటుంబమే కాదు, ఇండస్ట్రీ కూడా పట్టించుకోలేదు
దిక్కులేని దాసరి సమాధి... కుటుంబమే కాదు, ఇండస్ట్రీ కూడా పట్టించుకోలేదు
DK Shivakumar Swearing In: కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణస్వీకారం! రానున్న ఢిల్లీ పెద్దలు!
కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణస్వీకారం! రానున్న ఢిల్లీ పెద్దలు!
Tata Tiago Facelift Review: టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ రివ్యూ: కొత్త కారులో నచ్చే 5 అద్భుతమైన ఫీచర్లు.. నిరాశ పరిచే 3 మైనస్ పాయింట్లు
టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ రివ్యూ: కొత్త కారులో నచ్చే 5 అద్భుతమైన ఫీచర్లు.. నిరాశ పరిచే 3 మైనస్ పాయింట్లు
Ajith Kumar : అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం - తల్లి మోహిని కన్నుమూత
అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం - తల్లి మోహిని కన్నుమూత
June 1 Rule Changes 2026:బిగ్ అలర్ట్! జూన్ 1 నుంచి మారే కీలక నియమాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం చూపే మార్పులు ఇవే!
బిగ్ అలర్ట్! జూన్ 1 నుంచి మారే కీలక నియమాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం చూపే మార్పులు ఇవే!
Embed widget