‘ప్రేమలు’ ఓటీటీ రిలీజ్, ‘టిల్లు స్క్వేర్’ బ్రేక్ఈవెన్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
‘ఖుషి’ ముందే అలా - రెమ్యునరేషన్‌పై స్పందించిన విజయ్ దేవరకొండ
రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా 'గీత గోవిందం' మూవీ ఫేమ్ పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. పరశురామ్ తో విజయ్ దేవరకొండ రెండోసారి కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాల నెలకొన్నాయి. రీసెంట్ గానే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన 'సీతారామం' బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ దగ్గర పడడంతో విజయ్ దేవరకొండ ప్రమోషన్స్ తో బిజీ అయిపోయాడు. ఈ క్రమంలోనే తాజాగా ఫ్యామిలీ స్టార్ మూవీ టీం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ ప్రెస్ మీట్ లో విజయ్ దేవరకొండ తన రెమ్యూనరేషన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
విజయ్ లాస్ట్ మూవీ ఆ డైరెక్టర్‌తోనే?
తమిళ అగ్ర హీరో తలపతి విజయ్ ప్రస్తుతం ఫుల్ టైం పాలిటిక్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే రాజకీయ ఆరంగేట్రం చేసిన ఈ హీరో కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించి 2026 ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు అనౌన్స్ చేసాడు. ఆ లోపు కమిట్ అయిన మూవీస్ ని పూర్తి చేసి ఆ తర్వాత సినిమాలకు విరామం తీసుకుబోతున్నాడు. ప్రస్తుతం వెంకట్ ప్రభు తో 'గోట్' అనే సినిమా చేస్తున్న విజయ్.. దీని తర్వాత ఒకే ఒక్క సినిమా చేయనున్నాడు. దళపతి విజయ్ చివరి సినిమాని కోలీవుడ్ డైరెక్టర్ హెచ్. వినోద్ తెరకెక్కించబోతున్నట్లు తాజా సమాచారం. ఇతను తమిళంలో అజిత్ తో 'నేర్కొండ పార్ వై', 'వాలిమై' వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ప్రేమలు డిజిటల్ స్ట్రీమింగ్ - హాట్‌స్టార్‌లో కాదు, ఈ ఓటీటీలో మలయాళ బ్లాక్‌బస్టర్ తెలుగు వెర్షన్ రిలీజ్!
మలయాళ 'ప్రేమలు' (Premalu Movie OTT) తెలుగు ప్రేక్షకుల్ని సైతం ఆకట్టుకుంది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ తెలుగులో విడుదల చేయడం, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి అగ్ర హీరోలు చిత్రాన్ని ప్రశంసించడంతో మంచి ప్రచారం లభించింది. భారీ విజయం సాధించింది. అయితే... ఈ సినిమా ఓటీటీ వేదికలో ఎప్పుడు విడుదల అవుతుంది? అని ఎదురు చూసే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. వాళ్లకు గుడ్ న్యూస్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'టిల్లు స్క్వేర్’ టీమ్‌ను ఇంటికి పిలిచి మరీ అభినందించిన చిరంజీవి - ఇది ‘అడల్ట్’ కాదు, అందరూ చూడొచ్చు!
'టిల్లు స్క్వేర్' సినిమాను చూసిన మెగాస్టార్ చిరంజీవి.. చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. సినిమా అద్భుతంగా ఉందని చెప్పడంతో పాటు ఇంటికి పిలిపించి మరీ అభినందించారు. “’టిల్లు స్క్వేర్’ సినిమా చూశాను. నాకు బాగా నచ్చింది. టీమ్ ను అభినందించాలని ఇంటికి పిలిచాను. సిద్ధు అంటే ఇంట్లో వాళ్లు అందరికీ ఇష్టం. ‘డీజే టిల్లు’ తర్వాత చాలా రోజులకు ‘టిల్లు స్క్వేర్’ చేశారు. చూస్తే వావ్ అనిపించింది. ఫస్ట్ సినిమా హిట్ అయిన తర్వాత రాబోయే సినిమా మీద అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాటిని అందుకోవాలంటే చాలా కష్టపడాలి. ఆ రేర్ ఫీట్ ను సక్సెస్ ఫుల్ గా సాధించింది ‘టిల్లు స్క్వేర్’ టీమ్. ఈ సినిమా వెనుక సిద్దు ఒక్కడై ఉండి నడిపించాడు. నటుడిగా, కథకుడిగా మంచి ప్రతిభ కనబర్చాడు. ఇది అడల్ట్ కంటెంట్, యూత్ కు మాత్రమే అనుకుంటున్నారు. యూనివర్సల్ గా అందరికీ నచ్చే కంటెంట్ ఉన్న సినిమా.” అని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
మూడో రోజూ అదే రచ్చ - ‘టిల్లు స్క్వేర్’ కలెక్షన్స్ చూస్తే కళ్లు తిరుగుతాయ్, ఎంత వచ్చిందో తెలుసా?
సీక్వెల్ తెరకెక్కించడంలో ‘టిల్లు స్క్వేర్’ పూర్తిగా సక్సెస్ అయ్యింది. ప్రేక్షకులు మెప్పించ దగ్గ రేంజ్ లో సీక్వెల్ అందించడంలో సిద్దు జొన్నలగడ్డ సక్సెస్ అయ్యారు. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘టిల్లు స్క్వేర్’కు కలెక్షన్ల విషయంలో దూసుకుపోతోంది. పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రోజురోజుకీ కలెక్షన్స్ పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమా ఇదే రేంజ్‌లో రన్ అయితే వెంటనే త్వరలోనే వంద కోట్ల లిస్ట్ లో చేరిపోవడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. ‘టిల్లు స్క్వేర్’ మూడు రోజుల కలెక్షన్లు కూడా భారీగా ఉన్నాయని సితారా ఎంటర్ టైన్మెంట్స్ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)