అన్వేషించండి

Thalapathy Vijay : విజయ్ లాస్ట్ మూవీ ఆ డైరెక్టర్‌తోనే?

Thalapathy Vijay : దళపతి విజయ్ లాస్ట్ మూవీని కోలీవుడ్ డైరెక్టర్ హెచ్. వినోద్ తెరకెక్కించబోతున్నట్లు తాజా సమాచారం.

Thalapathy Vijay's Final Film Director Finalised : తమిళ అగ్ర హీరో తలపతి విజయ్ ప్రస్తుతం ఫుల్ టైం పాలిటిక్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే రాజకీయ ఆరంగేట్రం చేసిన ఈ హీరో కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించి 2026 ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు అనౌన్స్ చేసాడు. ఆ లోపు కమిట్ అయిన మూవీస్ ని పూర్తి చేసి ఆ తర్వాత సినిమాలకు విరామం తీసుకుబోతున్నాడు. ప్రస్తుతం వెంకట్ ప్రభు తో 'గోట్' అనే సినిమా చేస్తున్న విజయ్.. దీని తర్వాత ఒకే ఒక్క సినిమా చేయనున్నాడు. గత కొద్ది రోజులుగా ఆయన చివరి సినిమాకి సంబంధించి రకరకాల వార్తలు బయటికి వచ్చాయి. ముఖ్యంగా విజయ్ లాస్ట్ మూవీ కోసం కార్తీక్ సుబ్బరాజ్, త్రివిక్రమ్, గోపీచంద్ మలినేని, వెట్రిమారన్ వంటి దర్శకులు పరిశీలనలో ఉన్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించాయి. కానీ వీళ్ళేవరికీ కాకుండా ఆ అవకాశం మరో దర్శకుడికి వచ్చింది. విజయ్ లాస్ట్ మూవీ డైరెక్టర్ దాదాపు కన్ఫర్మ్ అయినట్లు కోలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

అజిత్ డైరెక్టర్ తో విజయ్ లాస్ట్ మూవీ

దళపతి విజయ్ చివరి సినిమాని కోలీవుడ్ డైరెక్టర్ హెచ్. వినోద్ తెరకెక్కించబోతున్నట్లు తాజా సమాచారం. ఇతను తమిళంలో అజిత్ తో 'నేర్కొండ పార్ వై', 'వాలిమై' వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా ప్రస్తుతం హెచ్. వినోద్ కమల్ హాసన్ తో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేశాడు. ఈ మేరకు స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది. కానీ కమల్ డేట్స్ ఖాళీ లేకపోవడంతో అదే స్క్రిప్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసి తలపతి విజయ్ తో సినిమా చేయాలని భావిస్తున్నాడని టాక్. విజయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కంప్లీట్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ ప్రాజెక్టు ఉండబోతుందని అంటున్నారు. 'గోట్' షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్టు ప్రారంభం కానుందట. ఈ సినిమాని పూర్తి చేసి 2026లో జరగనున్న తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై విజయ్ దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. 

జూన్ లో 'గోట్' రిలీజ్ 

టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న'గోట్' సినిమాలో తలపతి విజయ్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మలయాళ సీనియర్ నటుడు జయరాం, స్నేహ, లైలా, యోగి బాబు, VTV గణేష్, అజ్మల్ అమీర్, మిక్ మోహన్, ప్రభుదేవా, వైభవ్, అరవింద్ ఆకాష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చెన్నై బ్యూటీ త్రిష కూడా ఓ స్పెషల్ క్యామియో రోల్ చేస్తుందని తెలిసింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాని జూన్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో చెన్నై బ్యూటీ త్రిష కూడా నటిస్తున్నట్లు తెలిసింది.

Also Read : NBA గేమ్స్ లో 'గుంటూరు కారం' క్రేజ్ - కుర్చీ మడతపెట్టి పాటకు అమెరికన్స్ డ్యాన్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget