News
News
X

Tollywood Updates: ధనుష్ 'సార్' ఫస్ట్ సింగిల్ కి డేట్ ఫిక్స్ - రేపే కళ్యాణ్ రామ్ కొత్త సినిమా టైటిల్ అనౌన్స్మెంట్!

ఈరోజు టాలీవుడ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం..

FOLLOW US: 

ధనుష్ 'సార్' ఫస్ట్ సింగిల్ కి డేట్ ఫిక్స్:  

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) తెలుగులో స్ట్రెయిట్ సినిమాలో నటిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ధనుష్. దీనికి 'సార్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొన్నాళ్ల క్రితమే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, టీజర్ ని విడుదల చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 2న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ వచ్చింది. ఈ నెల 10వ తేదీన ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని చెబుతూ ఓ పోస్టర్ ను వదిలారు. ఈ సినిమాలో ధనుష్ 'బాల గంగాధర్ తిలక్' అనే జూనియర్ లెక్చరర్ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో అతడి లుక్ కూడా చాలా నేచురల్ గా ఉంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంయుక్తా మీనన్(Samyuktha Menon) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. 

రేపే కళ్యాణ్ రామ్ కొత్త సినిమా టైటిల్ అనౌన్స్మెంట్:

ఈ ఏడాది 'బింబిసార' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న కళ్యాణ్ రామ్ పలు సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన రాజేంద్ర రెడ్డి అనే దర్శకుడు రూపొందిస్తోన్న సినిమాలో నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 19వ సినిమా ఇది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మిస్తోన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను రేపు రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ పోస్టర్ వదిలారు నిర్మాతలు. రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకి గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. 

నాగశౌర్య కొత్త సినిమా షురూ:

యంగ్ హీరో నాగశౌర్యకి ఈ మధ్యకాలంలో సరైన హిట్టు పడడం లేదు. అయినప్పటికీ హీరోగా తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈరోజు కొత్త సినిమాను మొదలుపెట్టారు నాగశౌర్య. ఎస్.ఎస్.అరుణాచలం అలానే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. శౌర్య కెరీర్ లో 24వ సినిమా ఇది. భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మించనున్నారు. శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, అశోక్ కుమార్ చింతలపూడి సంయుక్తంగా వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి హారీస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు.   

'బుట్టబొమ్మ' టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..?

అనికా సురేంద్రన్.. తమిళ టాప్ హీరో అజిత్ కుమార్ నటించిన సినిమాల్లో బాల నటిగా మెప్పించిన ఆ అమ్మాయి.. ఇప్పుడు పెద్దమ్మాయి అయిపోయింది. తెలుగు, తమిళ సినిమా పరిశ్రమల్లో వరుసగా సినిమాలు చేస్తోంది. హీరోయిన్ గా తన సత్తా చాటబోతోంది. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ తెలుగులో ‘బుట్టబొమ్మ’ అనే సినిమాలో నటిస్తోంది. రేపు ఉదయం 11:08 నిమిషాలకు ఈ సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నారు. సినిమాను  సితార ఎంటర్ టైన్మెంట్స్,  ఫొర్టీన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ తో కలిసి నిర్మిస్తున్నది. శౌరి చంద్రశేఖర్ తో పాటు టి రమేష్  కలిసి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read : పక్కా ప్లానింగ్‌తో పవన్ అడుగులు - రాజకీయాలు, సినిమాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా!

Published at : 06 Nov 2022 08:17 PM (IST) Tags: tollywood updates Buttabomma Naga Shaurya Kalyan Ram Dhanush SIR

సంబంధిత కథనాలు

Prabhas: ప్రభాస్ తో తమిళ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ చర్చలు, భారీ బడ్జెట్ మూవీకి శ్రీకారం!

Prabhas: ప్రభాస్ తో తమిళ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ చర్చలు, భారీ బడ్జెట్ మూవీకి శ్రీకారం!

ఫైమా సంచాలక్‌గా నువ్వలా చేయొచ్చా? - ప్రశ్నించిన నాగార్జున, తలదించుకున్న ఫైమా

ఫైమా సంచాలక్‌గా నువ్వలా చేయొచ్చా? - ప్రశ్నించిన నాగార్జున, తలదించుకున్న ఫైమా

Vikram Gokhale: సీనియర్ నటుడు విక్రమ్ గోఖలే కన్నుమూత, విషాదంలో బాలీవుడ్ !

Vikram Gokhale: సీనియర్ నటుడు విక్రమ్ గోఖలే కన్నుమూత, విషాదంలో బాలీవుడ్ !

Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు

Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు

బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ రాజ్ అవుట్?

బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ రాజ్ అవుట్?

టాప్ స్టోరీస్

Paritala Sunitha: పోటుగాడివా? చంద్రబాబుని చంపుతానంటావా? నోట్లో ఉమ్మేస్తారు - పరిటాల సునీత ఫైర్

Paritala Sunitha: పోటుగాడివా? చంద్రబాబుని చంపుతానంటావా? నోట్లో ఉమ్మేస్తారు - పరిటాల సునీత ఫైర్

Batti Vs Revant : రేవంత్ వర్సెస్ భట్టి విక్రమార్క - తెలంగాణ కాంగ్రెస్‌లో పాదయాత్ర చిచ్చు ! కాంగ్రెస్‌ ఇక కోలుకోదా ?

Batti Vs Revant :  రేవంత్ వర్సెస్ భట్టి విక్రమార్క - తెలంగాణ కాంగ్రెస్‌లో పాదయాత్ర చిచ్చు  ! కాంగ్రెస్‌ ఇక కోలుకోదా ?

Aliens: డిసెంబర్‌ నెలలో భూమి మీదకు ఏలియన్స్‌ - గతంలో మహిళ రేప్ ఆరోపణలు!

Aliens: డిసెంబర్‌ నెలలో భూమి మీదకు ఏలియన్స్‌ - గతంలో మహిళ రేప్ ఆరోపణలు!

Sanju Samson Dropped: ఎక్కువ సిక్సర్లు కొట్టినందుకే సంజూపై వేటు! పంతే ముద్దు!

Sanju Samson Dropped: ఎక్కువ సిక్సర్లు కొట్టినందుకే సంజూపై వేటు! పంతే ముద్దు!