Tollywood Updates: 'మరో ప్రస్థానం' ట్రైలర్.. 'లవ్ స్టోరీ'కి మెగాస్టార్ సపోర్ట్.. షణ్ముఖ్ జెన్యూన్ అంటున్న యాంకర్..
తనీష్, ముస్కాన్ సేథీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మరో ప్రస్థానం'. జానీ దర్శకత్వం వహించారు.
'మరో ప్రస్థానం' ట్రైలర్..
తనీష్, ముస్కాన్ సేథీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మరో ప్రస్థానం'. జానీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రాంరుండం. స్ట్రింగ్ ఆపరేషన్ నేపథ్యంలో సాగే కథ ఇది. వరుస హత్యలు చేసే ఒక ముఠాకు సంబంధించిన దృశ్యాలను చిత్రీకరిస్తుంటాడు హీరో. హత్యలను షూట్ చేసిన కెమెరా విలన్లకు దొరుకుతుంది. దాంతో అసలు కథ మొదలవుతుంది. 'ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు అసలైన మనుషులు. ఒకరు చనిపోయినవాడు. మరొకడు ఇంకా పుట్టనివాడు' అంటూ విలన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది.
'లవ్ స్టోరీ'కి మెగాస్టార్ సపోర్ట్..
అక్కినేని ఫ్యామిలీకి, మెగాఫ్యామిలీ ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. చాలా సందర్భాల్లో ఈ విషయం రుజువైంది. మొన్నామధ్య నాగార్జున 'వైల్డ్ డాగ్' రిలీజ్ సమయంలో కూడా చిరంజీవి ఆ సినిమాను బాగా ప్రమోట్ చేశారు. నాగచైతన్య, అఖిల్ సినిమాల సమయంలో కూడా సపోర్ట్ చేస్తుంటారు చిరు. ఇప్పుడు చైతు నటిస్తోన్న 'లవ్ స్టోరీ' సినిమాకి కూడా చిరు తనవంతు సపోర్ట్ అందించనున్నారు. ఈ నెల 24న విడుదల కానున్న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఆదివారం నాడు నిర్వహించనున్నారు. దీనికి చిరంజీవి గెస్ట్ గా రానున్నారు. సెకండ్ వేవ్ తరువాత ఇలాంటి ప్రీరిలీజ్ ఈవెంట్స్ హడావిడి బాగా నడుస్తోంది. ఇప్పుడు 'లవ్ స్టోరీ'తో ఆ హవా మరింత పెరుగుతుందనే అనుకోవాలి.
షణ్ముఖ్ జెన్యూన్ అంటున్న యాంకర్..
యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అదే క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యాడు. ఇప్పుడిప్పుడే తన గేమ్ ఆడుతున్నాడు. ఇటీవల షణ్ముఖ్ గురించి మాట్లాడింది యాంకర్ విష్ణుప్రియ. ఇద్దరి జర్నీ ఒకేసారి మొదలైందని.. షణ్ముఖ్ చాలా మంచివాడని.. జెన్యూన్ పర్సన్ అని చెప్పుకొచ్చింది. ఎవరూ సపోర్ట్ చేయకున్నా.. సొంతంగా ఫ్లాట్ ఫామ్ క్రియేట్ చేసి ఎదిగాడని మేకేసుకుంది. అతడికి అంతా మంచి జరగాలని ఆశించింది. అయితే తాను బిగ్ బాస్ షో కాబట్టి ఎవరినీ సపోర్ట్ చేయనని కుండబద్దలుకొట్టింది.
Also Read : ''నేను చాలా బిజీ.. రాజ్‌కుంద్రా ఏం చేస్తుండేవాడో పెద్దగా పట్టించుకోలేదు''
Also Read : అపోలో హాస్పిటల్‌కు బన్నీ.. సాయి ధరమ్ తేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్
Also Read: పెళ్లి కూతురిలా ముస్తాబైన సమంత.. ట్రోల్ చేస్తున్న నెటిజనులు