Allu Arjun: అపోలో హాస్పిటల్‌కు బన్నీ.. సాయి ధరమ్ తేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్

గురువారం కాకినాడ నుంచి హైదరాబాద్‌కు రాగానే అపోలో హాస్పిటల్‌కు వెళ్లిన అల్లు అర్జున్.

FOLLOW US: 

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎలాంటి ఆందోళన వద్దని వైద్యులు తెలిపారు. తేజ్ ప్రమాదం సమయంలో అల్లు అర్జున్ కాకినాడలో ఉన్నాడు. గురువారం హైదరాబాద్‌కు వచ్చిన బన్నీ.. వెంటనే అపోలో హాస్పిటల్‌కు వెళ్లి సాయి ధరమ్ తేజ్‌ను పరామర్శించాడు. తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నాడు.  

‘పుష్ప’ తదుపరి షెడ్యూల్ కోసం ఇటీవల బన్నీ కాకినాడ వెళ్లాడు. అదే సమయంలో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. అయితే, తేజ్ ప్రమాదానికి గురైన వెంటనే మొదటి కాల్ బన్నీకే వచ్చిందని తెలిసింది. అత్యవసర చికిత్స కోసం తేజ్‌ను ముందుగా మెడికవర్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఆ హాస్పిటల్‌లో పనిచేస్తున్న బన్నీ స్నేహితులు వెంటనే ఈ సమాచారం అందించారు. దీంతో బన్నీ చిరంజీవితోపాటు అల్లు అరవింద్‌, వైష్ణవ్ తేజ్‌లకు ఫోన్ చేసి ప్రమాద విషయాన్ని తెలియజేశారని తెలిసింది. వారు హాస్పిటల్‌కు వెళ్లి.. సాయి ధరమ్ తేజ్ ప్రమాదం నుంచి బయటపడ్డాడని తెలియజేయడంతో బన్నీ కాకినాడలోనే ఉండిపోయాడు. తన షెడ్యూల్ పూర్తికావడంతో సాయి ధరమ్ తేజ్‌ను చూసేందుకు అల్లు అర్జున్ గురువారం హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలిసింది. 

Also Read: ఇది, బన్నీ అంటే.. ఒక్క దోశకు రూ.1000 చెల్లించిన అల్లు అర్జున్, ఉద్యోగం ఇస్తానని హామీ!

హైదరాబాద్ కేబుల్ బ్రిడ్డి సమీపంలో శుక్రవారం రాత్రి (సెప్టెంబరు 10)న సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురయ్యాడు.108 సిబ్బంది ద్వారా ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి చేరుకుని తేజ్ ను ఆసుపత్రికి తరలించారు. సాయి ధరమ్ తేజ్ నడుపుతున్న బైక్ ఇసుకలో జారి అదుపు తప్పినట్లు అక్కడే ఉన్న సీసీటీవీ కెమేరాలో స్పష్టంగా రికార్డైంది. ప్రమాదం దాటికి తేజ్ ఒక్కసారే రోడ్డు మీద పడ్డాడు. అతడి తల రోడ్డును బలంగా ఢీకొట్టింది. లక్కీగా హెల్మెట్ ఉండటం వల్ల ప్రాణాపాయం తప్పింది. రోడ్డుపై జారపడం వల్ల శరీరంపై అక్కడక్కడ గాయాలయ్యాయి. ప్రస్తుతం తేజ్ హాస్పిటల్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. పూర్తిగా తేరుకోడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Also Read: అల్లు అర్జున్ సింప్లిసిటీ.. రోడ్డుపక్కన హోటల్‌లో టిఫిన్ తిన్న బన్నీ.. కాకినాడలో బిజీబిజీ

Also Read: పెళ్లి కూతురిలా ముస్తాబైన సమంత.. ట్రోల్ చేస్తున్న నెటిజనులు

Published at : 16 Sep 2021 04:55 PM (IST) Tags: Allu Arjun అల్లు అర్జున్ Sai Dharam Tej సాయి ధరమ్ తేజ్ Allu Arjun Sai Dharam Tej Allu Arjun in Apollo Hospital

సంబంధిత కథనాలు

Rocketry Movie Review - 'రాకెట్రీ' రివ్యూ: ఫస్టాఫ్‌లో సైన్స్ పాఠాలు, సెకండాఫ్‌లో భావోద్వేగాలు - నంబి నారాయణన్ బయోపిక్ ఎలా ఉందంటే?

Rocketry Movie Review - 'రాకెట్రీ' రివ్యూ: ఫస్టాఫ్‌లో సైన్స్ పాఠాలు, సెకండాఫ్‌లో భావోద్వేగాలు - నంబి నారాయణన్ బయోపిక్ ఎలా ఉందంటే?

అయ్యో సుమా, ఈ వయసులో ఇదంతా అవసరమా, ప్రగతిలా ట్రై చేస్తే? భర్తతో శ్రీయా లిప్‌లాక్!

అయ్యో సుమా, ఈ వయసులో ఇదంతా అవసరమా, ప్రగతిలా ట్రై చేస్తే? భర్తతో శ్రీయా లిప్‌లాక్!

Pakka Commercial: గోపీచంద్ హిట్ కొట్టాల్సిందే - లేదంటే!

Pakka Commercial: గోపీచంద్ హిట్ కొట్టాల్సిందే - లేదంటే!

Urfi Javed: ఉర్ఫీ జావెద్ విమానం ఎక్కదు, కానీ రోజూ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తుంది, ఎందుకో తెలుసా?

Urfi Javed: ఉర్ఫీ జావెద్ విమానం ఎక్కదు, కానీ రోజూ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తుంది, ఎందుకో తెలుసా?

Devi Sri Prasad: దేవిశ్రీప్రసాద్ ట్యూన్స్ సల్మాన్ కి నచ్చలేదా? ప్రాజెక్ట్ నుంచి అవుట్!

Devi Sri Prasad: దేవిశ్రీప్రసాద్ ట్యూన్స్ సల్మాన్ కి నచ్చలేదా? ప్రాజెక్ట్ నుంచి అవుట్!

టాప్ స్టోరీస్

Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!

Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!

Kuppam Vishal : చంద్రబాబుపై పోటీ చేసేది ఆయనే - తేల్చి చెప్పిన పెద్దిరెడ్డి !

Kuppam Vishal : చంద్రబాబుపై పోటీ చేసేది ఆయనే - తేల్చి చెప్పిన పెద్దిరెడ్డి !

IND Vs ENG Squads: ఇంగ్లండ్‌తో వన్డేలు, టీ20లకు జట్లను ప్రకటించిన బీసీసీఐ - మొత్తం మూడు జట్లు!

IND Vs ENG Squads: ఇంగ్లండ్‌తో వన్డేలు, టీ20లకు జట్లను ప్రకటించిన బీసీసీఐ - మొత్తం మూడు జట్లు!

Jagannath Rath Yatra 2022: పూరీ జగన్నాథ రథయాత్ర గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు!

Jagannath Rath Yatra 2022: పూరీ జగన్నాథ రథయాత్ర గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు!