అన్వేషించండి
Advertisement
Tollywood Updates: 'పెళ్లి సందD టీజర్'.. 'సీత'గా ఫైర్ బ్రాండ్.. ఐష్ తో స్పెషల్ సాంగ్..
ఈరోజు టాలీవుడ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం..
'పెళ్లి సందD' టీజర్ :
ప్రముఖ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తోన్న సినిమా 'పెళ్లి సందD'. శ్రీలల హీరోయిన్ గా నటిస్తోంది. గౌరీ రోనంకి డైరెక్ట్ చేస్తున్నారు. రాఘవేంద్ర దర్శకత్వం పర్యవేక్షణ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ని హీరో నాగార్జున విడుదల చేశారు. బాస్కెట్ బాల్ ఆట నేపథ్యంలో సాగే సన్నివేశంతో మొదలైన ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. సహస్రకి పెళ్లి నాతోనా..? లేదా నువ్ తెచ్చిన తొట్టిగ్యాంగ్ లీడర్ తోనా..? అని ప్రకాష్ రాజ్ ని రోషన్ ప్రశ్నించిన తీరు మెప్పిస్తోంది. ఈ సినిమా యాక్షన్, రొమాన్స్, కామెడీ ప్రధానంగా సాగనుందని టీజర్ ని చూస్తూనే తెలుస్తోంది. ఈ సినిమాతో రాఘవేంద్రరావు నటుడిగా మారారు. ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
'సీత'గా ఫైర్ బ్రాండ్.. :
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'తలైవి' తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో కంగనా నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇదిలా ఉండగా.. తాజాగా కంగనా తన తదుపరి చిత్రాన్ని సోషల్ మీడియా వేదికగా మంగళవారం నాడు ప్రకటించింది. రామాయణ కథ ఆధారంగా సీత పాత్ర ప్రధానంగా సాగే 'సీత: ది ఇన్‌కార్నేషన్' సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్నట్లు ఆమె తెలిపింది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి విజయేంద్రప్రసాద్ కథ అందించగా.. అలౌకిక్ దేశాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఏ హ్యూమన్ బీయింగ్ స్టూడియో నిర్మించనుంది.
View this post on Instagram
ఐష్ తో స్పెషల్ సాంగ్..
మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతోన్న 'పొన్నియన్ సెల్వన్' సినిమాలో యువరాణి నందిని పాత్ర పోషిస్తోంది ఐశ్వర్యారాయ్. ఇటీవలే మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ సినిమా సెట్ లో ఐశ్వర్యపై ఓ భారీ పాటను చిత్రీకరించారని సమాచారం. ఈ పాత కోసం స్పెషల్ గా రిహార్సల్స్ కూడా చేశారట ఐశ్వర్య. కాస్ట్యూమ్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నారట. మరో విశేషం ఏంటంటే.. ఈ పాటలో ఐశ్వర్యతో పాటు నాలుగు వందల మందికి పైగా డాన్సర్లు కనిపిస్తారని టాక్. ఈ సినిమాలో ఐష్ తో పాటు విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ కనిపించనున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
విజయవాడ
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion