Kamal Haasan: 'బాధ్యత ఉండక్కర్లా..?' స్టార్ హీరోపై సర్కార్ ఫైర్..
కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన వెంటనే కమల్ హాసన్ బిగ్ బాస్ షూటింగ్ లో పాల్గొనడం ఏంటని..? ప్రభుత్వం ప్రశ్నించింది
పాండమిక్ తో పోరాడి ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయనుకున్న సమయంలో ఒమిక్రాన్ రూపంలో కొత్త సమస్య మొదలైంది. దీంతో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందనే టెన్షన్ జనాల్లో మరింత ఎక్కువైంది. ప్రజలు మాస్క్ ధరించడం లాంటి నిబంధనలను తప్పకుండా పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగా వేడుకుంటున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు.
ముఖ్యంగా సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన ప్రముఖులు కూడా ఈ నియమాలను ఉల్లంఘించడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవల కరోనా బారిన పడి రెండురోజుల క్రితం డిశ్చార్జ్ అయిన స్టార్ హీరో కమల్ హాసన్ రూల్స్ పాటించకపోవడంపై తమిళనాడు ప్రభుత్వం మండిపడుతోంది. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న కమల్ తమిళ బిగ్ బాస్ షోకి సంబంధించిన షూటింగ్ లో పాల్గొనడంతో తమిళనాడు గవర్నమెంట్ సీరియస్ అయింది.
కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన వెంటనే బిగ్ బాస్ షూటింగ్ లో పాల్గొనడం ఏంటని..? ప్రభుత్వం ప్రశ్నించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు చెప్పాలి కానీ దానికి విరుద్ధంగా షూటింగ్ లో పాల్గొనడం కరెక్ట్ కాదని కమల్ పై ప్రభుత్వం ఫైర్ అవుతోంది. కరోనా నిబంధనలకు వ్యతిరేకంగా షూటింగ్ లో పాల్గొని.. తన యాక్షన్స్ తో ఇతరులు ప్రమాదంలో పడేలా చేశారంటూ మండిపడుతోంది తమిళనాడు సర్కార్. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న ప్రముఖులే ఇలా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే ఎలా..? అని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ కమల్ కి నోటీసులు జారీ చేసింది.
Also Read: వెన్నుపోటు అంటేనే కళ్లల్లో నీళ్లొస్తున్నాయి... బాలకృష్ణ 'అన్ స్టాపబుల్' టాక్
Also Read: విలన్‌గా నటించడానికి బాలకృష్ణ రెడీ! అయితే... ఓ కండీషన్!
Also Read: భీమ్... భీమ్... కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ కొత్త పోస్టర్ చూశారా?
Also Read: రామారావుగా థియేటర్లలోకి రవితేజ వచ్చేది ఎప్పుడంటే?
Also Read: నేను పెడుతున్న స్టోరీస్ చూసి 'ఎన్నారైలు అందర్నీ జనరలైజ్ చేయకే ల....' అని వాగక్కర్లేదు - చిన్మయి
Also Read: అమ్మాయిలను ఎప్పుడూ అలా చూడలేదా? ఇతర మహిళలకు లేనిది ఏమైనా నాకుందా? - పాయల్ బోల్డ్ రియాక్షన్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి