Tiger 3 Release Date: సల్మాన్ ఖాన్ 'టైగర్ 3' రిలీజ్ ఎప్పుడంటే?
సల్మాన్ ఖాన్ నటిస్తోన్న 'టైగర్ 3' ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'టైగర్ 3'. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సల్మాన్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై' వంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఈ సినిమాల సిరీస్ లో భాగంగా తెరకెక్కిన 'టైగర్ 3'పై అంచనాలు పెరిగిపోయాయి.
ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో కత్రినా కైఫ్ బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని యాక్షన్ సీన్స్ ను ప్రాక్టీస్ చేస్తూ కనిపించింది. తన ప్రాక్టీస్ తరువాత ఇప్పుడు నీ టర్న్ అంటూ పడుకొని ఉన్న సల్మాన్ ఖాన్ ను నిద్రలేపుతుంది. అప్పుడు సల్మాన్ 'టైగర్ ఎప్పుడూ సిద్ధమే' అంటూ డైలాగ్ కొడతాడు. ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటుంది.
యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాను వచ్చే ఏడాది 2023లో ఈద్ పండగ సందర్భంగా ఏప్రిల్ 21న విడుదల చేయనున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. మనీష్ శర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ఇండియన్ స్పై క్యారెక్టర్ లో కనిపించనున్నారు.
Also Read: 'తోలుతీస్తా' యాంకర్ శివకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నటరాజ్ మాస్టర్
Also Read:నటరాజ్ మాస్టర్ ని కావాలనే టార్గెట్ చేస్తున్నారా? కూతుర్ని తలచుకుంటూ ఏడ్చేశాడు
View this post on Instagram
Before You Go
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















