By: ABP Desam | Updated at : 01 Mar 2022 06:42 PM (IST)
నటరాజ్ మాస్టర్ ని కావాలనే టార్గెట్ చేస్తున్నారా? (Image Credit: Hotstar)
'బిగ్ బాస్' నాన్-స్టాప్ షో మొదలైంది. హోస్ట్ నాగార్జున 17 మంది కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపించారు. గత బిగ్ బాస్ సీజన్లలోని బిగ్ బాస్ సభ్యులను వారియర్స్‌గా, కొత్త సభ్యులను ఛాలెంజర్స్‌గా హౌస్‌లోకి పంపించారు. ప్రస్తుతం హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ పోటీదారుల కోసం బిగ్ బాస్ వారియర్స్ అండ్ ఛాలెంజర్స్ కి కొన్ని టాస్క్ లు ఇచ్చారు. 'దమ్ముంటే చేసి చూపించు' అనే ఈ టాస్క్ లో రెండు టీమ్ లు పోటీపడ్డాయి.
మొత్తం మూడు టాస్క్ లు ఇవ్వగా.. అందులో రెండు టాస్క్ లలో వారియర్స్ టీమ్ గెలిచింది. గేమ్ ఆడడంతో ఛాలెంజర్స్ టీమ్ విఫలమైంది. మిత్రా శర్మ ఐదు నిముషాలు నీటిలో ఉంటానని చెప్పి కొన్ని సెకన్లు కూడా ఉండకుండా బయటకు వచ్చేసింది. మరో టాస్క్ లో అజయ్ కట్టెల మోపుతో 20 రౌండ్లు కొట్టేశాడు. కానీ అతడు రూల్స్ ఫాలో అవ్వలేదని సంచాలక్ నటరాజ్ మాస్టర్ ఆ టాస్క్ ను రద్దు చేశాడు.
దీంతో ఛాలెంజర్స్ టీమ్ రివెంజ్ మోడ్ లోకి వెళ్లిపోయింది. పదిహేను నిమిషాల్లో ఎన్ని కొబ్బరికాయల పీచు తీస్తారని టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. పీచు మొత్తం తీయాలని బిగ్ బాస్ చెప్పగా.. మహేష్ విట్టా టాస్క్ లో పాల్గొన్నాడు. ఆపోజిట్ టీమ్ లో శివకి ఛాలెంజ్ విసిరాడు. ఈ టాస్క్ లో మహేష్ విట్టా గెలిచినప్పటికీ.. ఆర్జే చైతు తన సిల్లీ లాజిక్స్ తో వాదన పెట్టుకొని.. సంచాలక్‌దే తుది నిర్ణయం అంటూ కావాలని వారియర్స్ టీమ్ కి పాయింట్ రాకుండా చేశాడు.
అప్పటికే వారియర్స్ టీమ్ లీడ్ లో ఉండడంతో ఆ గ్రూప్ నుంచి కెప్టెన్సీ పోటీదారుల పేర్లను అనౌన్స్ చేయమని బిగ్ బాస్ చెప్పగా.. అందరూ కలిసి మహేష్ విట్టా, తేజస్వి పేర్లు చెప్పారు. అయితే ఈ మొత్తం టాస్క్ లో ఛాలెంజర్స్ టీమ్.. నటరాజ్ మాస్టర్ ని టార్గెట్ చేసినట్లుగా అతడిపై విరుచుకుపడ్డారు. మరోపక్క వారియర్స్ టీమ్ కెప్టెన్సీ పోటీదారుడిగా నటరాజ్ మాస్టర్ పేరు చెప్పలేదు. నామినేషన్ ప్రాసెస్ జరిగిన దగ్గర నుంచి నటరాజ్ మాస్టర్ పై జోకులేసుకోవడం, ఆయన్ని కావాలనే మాటలనడం ఇలా జరుగుతుండడంతో నటరాజ్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. తన కూతురి ఫొటో చూసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఆయన ఎమోషనల్ అవుతుంటే ఛాలెంజర్స్ టీమ్ లో కొందరు (శివ, స్రవంతి, అజయ్, అనిల్, బిందు మాధవి)ఆయనపై కామెడీ చేసుకున్నారు. అలా వెంటనే ఏడుపు ఎలా వస్తుందో ఆయనకు.. ఆయన్ని చూస్తే జాలేస్తుందంటూ వెటకారంగా కామెంట్స్ చేసుకున్నారు.
Also Read: ఈ వారం ఆమె ఎలిమినేషన్ తప్పదా?
Also Read: బిగ్ బాస్ నాన్ స్టాప్ - అఖిల్ ముందే అభిజీత్ పేరెత్తిన శ్రీ రాపాక, అతడి రియాక్షన్ ఇది!
https://t.co/h1MV4irpT5
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) March 1, 2022
Challengers denikaina ready💪🏻 Mari Warriors yela react avutaaru?!🤔
Don’t miss the fun and drama-filled task only on #biggbossnonstop #BiggBoss #BiggBossTelugu @DisneyPlusHS @EndemolShineIND
Urfi Javed: ఉర్ఫీ జావెద్ విమానం ఎక్కదు, కానీ రోజూ ఎయిర్పోర్ట్కు వెళ్తుంది, ఎందుకో తెలుసా?
Samrat Reddy: తండ్రి కాబోతున్న ‘బిగ్ బాస్’ సామ్రాట్
Urfi Javed: వీడియో - అయ్యో, పువ్వు అనుకుని ఫోన్ పడేసిందే, పిచ్చి ముదిరితే ఇంతే!
Bigg Boss Telugu 6: బిగ్ బాస్ సీజన్ 6 - లాంచింగ్ డేట్ ఎప్పుడంటే?
Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్స్ వీళ్లేనా?
CM Jagan : తెలంగాణ నుంచి ఆ డబ్బులు ఇప్పించండి, ప్రధానిని కోరిన సీఎం జగన్
Smita Sabharwal Job Tips: నిరాశ చెందవద్దు, ప్రణాళికా ప్రకారం ప్రిపేర్ అవ్వాలి - ఉద్యోగార్థులకు స్మితా సబర్వాల్ సూచనలివే
Kalyan Ram: ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ - ఇదిగో క్లారిటీ!
Same Sex Marriage: అంగరంగ వైభవంగా లవ్ మ్యారేజ్ చేసుకున్న పురుషులు - తాజ్ మహల్ సీన్ వీరి ప్రేమకే హైలైట్