(Source: ECI/ABP News/ABP Majha)
Akhil Sarthak: బిగ్ బాస్ నాన్ స్టాప్ - అఖిల్ ముందే అభిజీత్ పేరెత్తిన శ్రీ రాపాక, అతడి రియాక్షన్ ఇది!
బిగ్ బాస్ నాన్ స్టాప్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన అఖిల్‌తో శ్రీరాపక మాట్లాడుతూ.. అభిజీత్ పేరు ఎత్తింది. మరి అఖిల్ రియాక్షన్ ఏమిటో తెలుసా?
Bigg Boss OTT Telugu | ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ (Bigg Boss Non Stop)లో ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ల రచ్చ ఇంకా కొనసాగుతోంది. బిగ్ బాస్ సోమవారం ఉదయం ఇచ్చిన టాస్క్‌లో ‘బిగ్ బాస్’ ఇంట్లో వారికి నచ్చిన, నచ్చని కంటెస్టెంట్లు ఎవరో చెప్పాలని సభ్యులను కోరాడు. నచ్చిన వ్యక్తులకు థమ్స్ అప్, నచ్చని వ్యక్తులకు థమ్స్ డౌన్ బ్యాడ్జీలు పెట్టాలని తెలిపాడు. దీనివల్ల బిగ్ బాస్ హౌస్‌లో పెద్ద రచ్చ జరిగింది. ముందుగా అరియానా(Ariyana) తనకు అజయ్(Ajay)కు థమ్స్ అప్ ఇచ్చింది. శ్రీ రాపాక(Shree Rapaka)కు థమ్స్ డౌన్ ఇచ్చింది. తనని ఓవర్ యాక్షన్ అనడం తట్టుకోలేకపోయానని, అందుకే థమ్స్ డౌన్ ఇచ్చానని అరియానా(Ariyana) పేర్కొంది. ఆ తర్వాత అఖిల్(Akhil) కూడా అజయ్‌కు థమ్స్ అప్, శ్రీ రాపాక(Shree Rapaka)కు థమ్స్ డౌన్ ఇచ్చాడు.
బిగ్ బాస్ టాస్క్ ప్రకారం.. మొత్తం కంటెస్టెంట్స్‌లో అధిక లైక్స్, డిస్‌లైక్స్ వచ్చింది వీరికే. అందరి కంటే అజయ్‌కు ఎక్కువ లైక్స్, శ్రీరాపాక, మిత్రకు అధిక ఎక్కువ అన్‌లైక్స్ వచ్చాయి.
అజయ్ (Ajay): (3 లైక్స్/0 డిస్ లైక్స్) అరియానా, అఖిల్, ముమైత్ ఖాన్ (థమ్స్ అప్)
శ్రీ రాపాక (Shree Rapaka): (0/3) అరియానా, అఖిల్, ముమైత్ ఖాన్ (థమ్స్ డౌన్)
శివ (Anchor Siva): (2/0) సరయు, నటరాజ్ మాస్టార్ (థమ్స్ అప్)
అనిల్ - (Anil): (1/1) సరయు (థమ్స్ డౌన్), అషు రెడ్డి (థమ్స్ అప్)
మిత్ర - (Mithraaw Sharma): (1/3) అషు, మహేష్, తేజస్వి(థమ్స్ డౌన్) మిత్ర (థమ్స్ అప్)
చైతూ - (RJ Chaitu): (1/0) మహేష్ (థమ్స్ అప్)
స్రవంతి - (Sravanthi): (1/2) తేజస్వి (థమ్స్ అప్) హమీద, నటరాజ్ మాస్టార్ (థమ్స్ డౌన్)
Also Read: తమిళ ‘బిగ్ బాస్’లో భళా అనిపించిన బిందు మాధవి - వామ్మో, గట్టి పోటీయే ఇచ్చింది!
మీ కోసమే ‘బిగ్ బాస్’ సీజన్-4 చూశాను: అఖిల్(Akhil Sarthak) తనకు థమ్స్ డౌన్ ఇవ్వడంతో శ్రీ రాపాక బాధపడింది. మీరంటే తనకు ఇష్టమని అఖిల్‌కు చెప్పింది. మిమ్మల్ని, అభిజిత్‌ను చూడటానికి మాత్రమే తాను ‘బిగ్ బాస్’ సీజన్-4 చూశానని తెలిపింది. అయితే, అఖిల్ ఆమె మాటలను విన్నాడేగానీ, దాని గురించి ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. ఇకపై స్పర్థలు లేకుండా ఉందామని కూల్‌గా చెప్పడంతో అక్కడితో గొడవ ఆగిపోయింది. మరో వైపు మిత్రను కూడా అంతా టార్గెట్ చేసుకున్నారు. ఆదివారం జరిగిన నామినేషన్లలో మిత్రా కూడా ఉంది. దీంతో ఆమె సోమవారం నిశబ్దంగా ఉండటంతో అంతా ఆమెను ధైర్యంగా ఉండాలంటూ ‘థమ్స్ డౌన్’ ఇచ్చారు. ఆదివారం జరిగిన నామినేషన్లలో వారియర్స్ టీమ్ నుంచి నటరాజ్ మాస్టర్(Natraj Master), సరయు(Sarayu), ముమైత్ ఖాన్(Mumaith Khan), హమీద(Hamida), అరియానా(Ariyana), ఛాలెంజర్స్ టీమ్ నుంచి మిత్ర శర్మ(Mithraaw Sharma), ఆర్జే చైతూ(RJ Chaitu) ఉన్నారు.