News
News
X

Krishnam Raju Moivies: నిర్మాతగా కృష్ణంరాజు తీసిన ఆ తొమ్మిది చిత్రాలు నవరత్నాలే!

కృష్ణంరాజు కేవలం నటుడే కాదు, మంచి నిర్మాత కూడా ఆయన తన తమ్ముడితో కలిసి గోపీ కృష్ణ మూవీస్ బ్యానర్ పై ఆణిముత్యాల్లాంటి సినిమాలు తీశారు. అవి ఇవే.

FOLLOW US: 
Share:

రెబల్ స్టార్ కృష్ణం రాజు నిర్మించిన 10 సినిమాలు నిర్మాతగా ఆయన అభిరుచి ఏంటో చెబుతాయి. స్టార్ హీరోగా కొనసాగుతున్న తన ఇమేజ్ ను వాడుకొని డబ్బు సంపాదించే అవకాశం ఉన్నా.. మాస్ సినిమాల కంటే అభిరుచి ఉన్న సినిమాలే తీశారాయన. అందుకే ఆయన ప్రొడ్యూస్ చేసిన ఒకొక్క సినిమా ఒకొక్క ఆణిముత్యంలా మిగిలిపోయాయి. తన తమ్ముడు, హీరో ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజుతో కలిసి గోపీకృష్ణ బ్యానర్ పై నిర్మించిన ఆ సినిమాలు ఏంటో చూసేద్దామా!

1) కృష్ణవేణి (1974)

1971 లో కన్నడలో వచ్చిన శరపంజర సినిమా కృష్ణంరాజు గారికి ఎంతో నచ్చింది. అయితే, ట్రాజాడీ కథ తో సైకాలజికల్ అంశాలపై తీసిన ఆ సినిమాను తెలుగులో నిర్మించడానికి నిర్మాతలెవరూ ముందుకు రాకపోవడంతో కృష్ణంరాజు తానే తమ్ముడితో కలసి గోపీకృష్ణ బ్యానర్ స్థాపించి కృష్ణ వేణి పేరుతో 1974 లో వీ.మధుసూదన రావు దర్శకత్వంలో తెలుగులో తీశారు. హీరోయిన్ వాణిశ్రీ, సినిమా అంతా ఆమెదే డామినేషన్. ఆ రోజుల్లో హిస్టీరియా లాంటి మానసిక సమస్యలు ఉన్న వారిపై సమాజం ఎలాంటి వివక్ష చూపిస్తుంది అన్న కథతో తీసిన ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సూపర్ హిట్ అయింది. తెలుగు క్లాసిక్ లలో ఒకటిగా నిలిచిపోయింది. పాటలన్నీ సూపర్ హిట్. అయితే అందులోని ‘కృష్ణవేణి.. తెలుగింటి విరిబోణి’ అనే పాటకి ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు.

2) భక్త కన్నప్ప. ( 1976)

తెలుగులో వచ్చిన టాప్ 10 భక్తిరస సినిమాలు లెక్కిస్తే వాటిలో తప్పక ఉండే సినిమా భక్త కన్నప్ప.బాపు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా 1954 లో కన్నడలో వచ్చిన బేడర కన్నప్ప సినిమాకు రీమేక్. కానీ ఆ సినిమాను రచయిత ముళ్ళపూడి వెంకటరమణ, బాపులు తెలుగు నేటివిటీకి తగ్గట్టు పూర్తిగా మార్చి.. క్రొత్తగా తీశారు. ఈ సినిమా మొత్తాన్ని ఔట్ డోర్ లోనే తీశారు. చాలా ఖర్చు అయినా.. కృష్ణంరాజు వెనుకాడలేదు. హీరోయిన్ గా వాణిశ్రీ నటించారు. పాటలన్నీ క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఏకంగా సంవత్సరం పాటు ఆడింది భక్త కన్నప్ప.

3) అమర దీపం 1977

మలయాళంలో 1976 లో వచ్చిన తీక్కనాళ్ అనే సినిమాను కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నిర్మించారు కృష్ణంరాజు. అందులో తానొక ప్లే బాయ్ లా కాస్త నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయడం విశేషం. జయసుధ హీరోయిన్ కాగా, మురళీ మోహన్ మరో హీరో గా నటించారు. సినిమా చివర్లో ఆత్మహత్య చేసుకునే క్యారెక్టర్ లో కృష్ణంరాజు లాంటి మాస్ హీరో యాక్ట్ చెయ్యడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు కృష్ణంరాజుకు ఫిల్మ్ ఫేర్ అవార్డుతో పాటు.. నంది అవార్డ్ ను సైతం తెచ్చి పెట్టింది.

4) మనవూరి పాండవులు (1978)

తెలుగు సినిమా చరిత్రలో అత్యుత్తమ సినిమాల్లో ఒకటి మనవూరి పాండవులు. కన్నడలో వచ్చిన పదువారల్లి పాండవరు అనే సినిమాను తెలుగులో రీమేక్ చేశారు కృష్ణంరాజు. బాపు-రమణలు తెలుగుకు తగ్గట్టు కథను మార్చి తీశారు. కృష్ణంరాజు, మురళీమోహన్ లతో పాటు తరువాతి కాలంలో పెద్ద హీరోలు అయిన చిరంజీవి, భాను చందర్ లాంటి వాళ్ళు కూడా ఈ సినిమాలో నటించి పేరు తెచ్చుకున్నారు. మొత్తం యాక్టర్స్ అంతా మేకప్ లేకుండా న్యాచురల్ గా నటించిన సినిమా ఇది. మహాభారతం కథను నేటి పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్ధిన సినిమా ఇది. ఈ సినిమా కు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ తో పాటు కృష్ణంరాజు కు రాష్ట్రపతి అవార్డ్ కూడా రావడం విశేషం.

5) మధుర స్వప్నం (1982)

కృష్ణంరాజు హీరోగా జయసుధ, జయప్రద హీరోయిన్ లుగా కె.రాఘవేంద్రరావు దర్సకత్వంలో కృష్ణం నిర్మించిన సినిమా మధుర స్వప్నం.యద్దనపూడి సులోచన రాణి రాసిన నవల ఆధారంగా తీసిన ఈ సినిమా హిట్ అయింది. అయితే విమర్శకుల ప్రశంసలు పెద్ద ఎత్తున లభించాయి

6) బొబ్బిలి బ్రహ్మన్న (1984)

కృష్ణంరాజు కెరీర్ లో అతి పెద్ద సూపర్ హిట్ బొబ్బిలి బ్రహ్మన్న. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో, జయసుధ హీరోయిన్ గా కృష్ణంరాజు డబుల్ రోల్ లో వచ్చిన ఈ సినిమా వైజాగ్ లాంటి కేంద్రాల్లో 200 రోజులు ఆడింది. ఈ సినిమాలో కృష్ణంరాజు గెటప్‌కీ, డైలాగులకీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో దీనిని దిలీప్ కుమార్, జితేంద్ర, శ్రీదేవి లతో ధర్మాధికారి పేరుతో హిందీ లో రీమేక్ చేశారు కృష్ణంరాజు. అది కూడా పెద్ద హిట్ అయింది. తరువాత దీనిని కన్నడ లోనూ రీమేక్ చేశారు. ఈ సినిమా హిట్ కావడంతో ఇదే ఫార్ములాతో ఊరికి ఒక పెద్ద ఉండడం, తాను తీర్పులు చెబుతూ ఉండడం వంటి కథలతో చాలా సినిమాలు వచ్చాయి. పెదరాయుడు, చిన రాయుడు, బొబ్బిలి సింహం.. ఇవన్నీ ఆ కోవలో వచ్చిన సినిమాలే.

7) ధరమ్ అధికారి (హిందీ) (1986)

ఇది బొబ్బిలి బ్రహ్మన్న కు హిందీ రీమేక్. తెలుగు లో కృష్ణం రాజు డబుల్ రోల్ లో యాక్ట్ చేస్తే.. హిందీ లో మాత్రం ఆ రెండు పాత్రల్లో దిలీప్ కుమార్, జితేంద్ర నటించారు. శ్రీదేవి హీరోయిన్. ఈ సినిమా హిందీలో కూడా చాలా పెద్ద హిట్ అయింది. హిందీ లో కూడా ఈ సినిమాకు కె.రాఘవేంద్రరావే దర్శకుడు.

8) తాండ్ర పాపారాయుడు (1986)

బొబ్బిలి యుద్ధం కథను తాండ్ర పాపారాయుడు వెర్షన్ లో తీసిన సినిమా ఇది. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఆనాటి మేటి నటులంతా కలసి నటించారు. 11వ ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లో ప్రదర్శించబడిన ఈ సినిమా కు ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డ్ తో పాటు రెండు నంది అవార్డులు దక్కాయి. చాలా పెద్ద హిట్ అయిన ఈ సినిమాలో కృష్ణంరాజు, మోహన్ బాబుల డైలాగులు చాలా పాపులర్ అయ్యాయి.

9)  బిల్లా ( 2009)

తాండ్ర పాపారాయుడు తరువాత 23 ఏళ్ళు గ్యాప్ తీసుకుని ప్రభాస్ హీరోగా బిల్లా సినిమాను 2009 లో తీసారు కృష్ణంరాజు. ఇది అమితాబ్ బచ్చన్ డాన్ (1978)కి రీమేక్ గా వచ్చిన తమిళ సినిమా బిల్లా, తెలుగు యుగంధర్ లకు రీమేక్. ఈ సినిమా హిట్ అయింది. అంతకంటే ముఖ్యంగా ప్రభాస్ ను అంతకు ముందెన్నడూ చూడనంత స్టైలిష్ లుక్ లో చూపిన సినిమాగా బిల్లా నిలిచిపోయింది. మణిశర్మ రూపొందించిన పాటలన్నీ హిట్.

తీరని కోరిక.. విశాల నేత్రాలు

తీసిన సినిమాలన్నీ హిట్టే అనిపించుకున్న కృష్ణంరాజు కు తీరని కోరిక ఒకటుంది. అదే విశాల నేత్రాలు. సోషియో ఫాంటసీ తో పాటు నిధి అన్వేషణ బ్యాక్ గ్రౌండ్ లో సాగే ఈ కథను ప్రభాస్ హీరోగా సినిమాగా తియ్యాలని గత పాతికేళ్లుగా కృష్ణంరాజు ప్రయత్నిస్తూనే వచ్చారు. అయితే.. భారీ బడ్జెట్ అవసరం కావడంతో ఆగిపోయారు. బాహుబలి ఇచ్చిన ధైర్యంతో త్వరలోనే దీన్ని తెరకెక్కించాలని అనుకున్నా.. ఈలోపే ఆయన మరణించడం తో  ‘విశాల నేత్రాలు’ సినిమా.. కృష్ణం రాజుకు తీరని కోరిక గానే మిగిలి పోయింది.

Published at : 12 Sep 2022 09:13 PM (IST) Tags: Krishnam Raju Krishnam Raju Movies Krishanam Raju as Producer

సంబంధిత కథనాలు

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

Robert Downey Jr: ఆ హీరో నమిలేసిన చూయింగ్ గమ్ రూ. 45 లక్షలా? ఏం చేసుకుంటారు నాయనా?

Robert Downey Jr: ఆ హీరో నమిలేసిన చూయింగ్ గమ్ రూ. 45 లక్షలా? ఏం చేసుకుంటారు నాయనా?

Balagam Censored Dialogue: సెన్సార్‌కు ముందు, సెన్సార్ తర్వాత - ‘బలగం’లోని ఆ డైలాగ్ లీక్ చేసిన ప్రియదర్శి

Balagam Censored Dialogue: సెన్సార్‌కు ముందు, సెన్సార్ తర్వాత - ‘బలగం’లోని ఆ డైలాగ్ లీక్ చేసిన ప్రియదర్శి

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?

Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ రిలీజ్ - అందంతో కట్టిపడేస్తోన్న సమంత

Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ రిలీజ్ - అందంతో కట్టిపడేస్తోన్న సమంత

టాప్ స్టోరీస్

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్