News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ఎట్టకేలకు విక్రమ్ ‘ధృవ నక్షత్రం’ మూవీ సిద్ధం - ట్రైలర్ డేట్ ఫిక్స్

గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న విక్రమ్ నెక్ట్స్ మూవూ 'ధృవ నచ్చతిరమ్' సినిమా ట్రైలర్ రిలీజ్ పై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. జులై 17 శనివారం రిలీజ్ కానున్నట్టు అధికారిక ప్రకటన రిలీజైంది

FOLLOW US: 
Share:

Dhruva Natchathiram : డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ (Chiyan Vikram) నటించిన 'ధృవ నచ్చతిరమ్ (Dhruva Natchathiram - (తెలుగులో ‘ధృవ నక్షత్రం’) సినిమా ఎట్టకేలకు గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. జాతీయ అవార్డు అందుకున్న హీరో చియాన్ విక్రమ్ .. తన కెరీర్ లో భాగంగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే పలు సినిమాల్లో భిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. 2016లో సెట్స్ పైకి వెళ్ళిన స్పై థ్రిల్లర్ 'ధృవ నచ్చతిరమ్' కోసం ప్రఖ్యాత చిత్రనిర్మాత గౌతమ్ వాసుదేవ్ మీనన్‌తో చేతులు కలిపాడు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ ప్రాజెక్ట్ పలు కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. విడుదల వాయిదాకు పలు కారణాలంటూ సోషల్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఆగష్టు 2022లో, చియాన్ విక్రమ్, దర్శకుడు గౌతమ్ ప్రాజెక్ట్ తిరిగి ట్రాక్‌లోకి వచ్చినట్లు అధికారికంగా ధృవీకరించారు.

'ధృవ న‌చ్చ‌తిరమ్' ట్రైల‌ర్ ఈ తేదీన విడుద‌ల కానుంది

తాజా అప్‌డేట్‌ల ప్రకారం, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 'ధృవ నచ్చతిరమ్' ట్రైలర్ విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. హే తమిళ్ సినిమా తాజా నివేదికల ప్రకారం, చియాన్ విక్రమ్ నటించిన చియాన్ విక్రమ్ అధికారిక ట్రైలర్ జూన్ 17 శనివారం, మలేషియాలో జరగనున్న సంగీత స్వరకర్త హారిస్ జయరాజ్ గ్రాండ్ కాన్సర్ట్‌లో విడుదల కానుంది. ఈ సంగీత కచేరీకి దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ హాజరవుతారని వార్తలు  వినిపిస్తున్నాయి. స్పై థ్రిల్లర్ 'ధృవ నచ్చతిరమ్' నుంచి వెల్లడైన ఈ తాజా అప్డేట్ తో అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

త్వరలో థియేటర్లలోకి 'ధృవ నచ్చతిరమ్'

అనుకున్నది అనుకున్నట్లు జరిగితే, చియాన్ విక్రమ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్‌ల ఈ ఆలస్యమైన ప్రాజెక్ట్ ఎట్టకేలకు జూలై నెలాఖరులో లేదా ఆగస్ట్ 2023 ప్రారంభంలో థియేటర్లలోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే, ట్రైలర్‌లోనే విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు కూడా లేకపోలేదని అభిమానులు భావిస్తున్నారు. ఇంతకు ముందు నివేదించినట్లుగా 'ధృవ నచ్చతిరమ్' సినిమాలో చియాన్ విక్రమ్ జాన్ అనే అత్యంత శిక్షణ పొందిన భారతీయ గూఢచారి పాత్రను పోషిస్తున్నాడు. అతను మారువేషంలో భారతదేశ జాతీయ భద్రతా సంస్థ కోసం పనిచేసే 10 మంది రహస్య ఏజెంట్ల బృందానికి నాయకత్వం వహిస్తాడు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో రాధిక శరత్‌కుమార్, సిమ్రాన్, ఆర్ పార్తిబన్, దివ్యదర్శిని, మున్నా, వంశీకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ కథానాయికలుగా నటిస్తున్నారు. హరీష్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, ఆంథోని ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు.

Read Also : Pan India Movies in 2023 Second half: 2023 సెకండ్ ఆఫ్‌లో వస్తున్న పాన్ ఇండియా చిత్రాలివే, ఈ సారి లక్ ఎలా ఉండబోతుందో!

Also Read : శేష వస్త్రంతో తిరుమలలో ముద్దులు, కౌగిలింతలా? - ‘ఆదిపురుష్’ దర్శకుడు ఔంరౌత్‌పై చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుల ఆగ్రహం

Published at : 08 Jun 2023 12:31 PM (IST) Tags: Aishwarya Rajesh Gautham Vasudev Menon Rithu Varma Dhruva Natchathiram Chiyan Vikram

ఇవి కూడా చూడండి

Bigg Boss 7 Telugu: ప్రియాంక చేస్తే కరెక్ట్, శివాజీ చేస్తే తప్పు - గౌతమ్ ఆరోపణలకు నాగార్జున కౌంటర్

Bigg Boss 7 Telugu: ప్రియాంక చేస్తే కరెక్ట్, శివాజీ చేస్తే తప్పు - గౌతమ్ ఆరోపణలకు నాగార్జున కౌంటర్

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Bigg Boss 7 Telugu: అమర్‌కు నాగార్జున ఊహించని సర్‌ప్రైజ్ - దాంతో పాటు ఒక కండీషన్ కూడా!

Bigg Boss 7 Telugu: అమర్‌కు నాగార్జున ఊహించని సర్‌ప్రైజ్ - దాంతో పాటు ఒక కండీషన్ కూడా!

Nagarjuna Shirt Rate: బిగ్ బాస్‌లో నాగార్జున ధరించిన ప్యాచ్ షర్ట్ రేటు ఎంతో తెలుసా? మరీ అంత తక్కువ?

Nagarjuna Shirt Rate: బిగ్ బాస్‌లో నాగార్జున ధరించిన ప్యాచ్ షర్ట్ రేటు ఎంతో తెలుసా? మరీ అంత తక్కువ?

Bigg Boss 7 Telugu: చిక్కుల్లో పడిన ప్రియాంక - గ్రూప్ గేమ్ వద్దంటూ నాగ్ సీరియస్

Bigg Boss 7 Telugu: చిక్కుల్లో పడిన ప్రియాంక - గ్రూప్ గేమ్ వద్దంటూ నాగ్ సీరియస్

టాప్ స్టోరీస్

Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత

Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత

Congress Complaint: బీఆర్ఎస్ పై సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు - రాజీనామాలు సమర్పించేందుకే కేబినెట్ భేటీ ఉండొచ్చన్న ఉత్తమ్

Congress Complaint: బీఆర్ఎస్ పై సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు - రాజీనామాలు సమర్పించేందుకే కేబినెట్ భేటీ ఉండొచ్చన్న ఉత్తమ్