అన్వేషించండి

Pan India Movies in 2023 Second half: 2023 సెకండ్ ఆఫ్‌లో వస్తున్న పాన్ ఇండియా చిత్రాలివే, ఈ సారి లక్ ఎలా ఉండబోతుందో!

2023 ప్రథమార్ధంలో 'పఠాన్', 'పొన్నియన్ సెల్వన్ 2' సినిమాలు మినహా హై బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలేవీ రిలీజ్ కాలేదు. ఈ ఏడాది ద్వితీయార్థంలో మాత్రం పలు క్రేజీ చిత్రాలు విడుదల కాబోతున్నాయి.

మ్మర్ సీజన్ లో ఈసారి పెద్ద సినిమాలేవీ రిలీజ్ కాలేదు. భారీ అంచనాలు పెట్టుకున్న ఓ మోస్తరు క్రేజీ చిత్రాలు కూడా ప్రేక్షకులని తీవ్రంగా నిరాశ పరిచాయి. ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద కొన్ని చిన్న చిత్రాలు, మరికొన్ని డబ్బింగ్ సినిమాలు సందడి చేశాయి. అయితే వచ్చే వారం నుంచే అసలైన సినిమా పండుగ ప్రారంభం కాబోతోంది. జూన్ సెకండ్ వీక్ మొదలుకొని, యేడాది చివరి వరకూ అనేక పాన్ ఇండియా చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. 2023 ద్వితీయార్థంలో షెడ్యూల్ చేయబడిన హై బడ్జెట్ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

1. ఆదిపురుష్:

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం 'ఆదిపురుష్'. రామాయణం ఇతిహాసం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాని తెరకెక్కించారు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో టీ-సిరీస్ నిర్మించిన ఈ చిత్రం, జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఇందులో కృతి సనన్, సైఫ్ అలీఖాన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

2. జైలర్:

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జైలర్'. డాక్టర్, బీస్ట్ చిత్రాల దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శివరాజ్ కుమార్, మోహన్ లాల్, రమ్యకృష్ణ, తమన్నా భాటియా తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ రూ.200 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ కామెడీ మూవీ ఆగష్టు 10న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.

3. యానిమల్:

'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న యాక్షన్ మూవీ 'యానిమల్'. ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో రష్మిక మందన్న, తృప్తి దిమ్రి హీరోయిన్లుగా నటిస్తుండగా.. అనిల్ కుమార్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీ సిరీస్ బ్యానర్ పై రూ.200+ కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతోంది. ఇది ఆగస్ట్ 11న అన్ని ప్రధాన భారతీయ భాషల్లో విడుదల కాబోతోంది.

4. జవాన్:

ఈ ఏడాది 'పఠాన్' సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిన బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్, ఇప్పుడు తమిళ్ డైరెక్టర్ అట్లీతో కలిసి రాబోతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'జవాన్' చిత్రాన్ని సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో దాదాపు 250+ కోట్ల బడ్జెట్ తో ఈ యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతోంది. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి, సన్యా మల్హోత్రా, ప్రియమణి ఇతర పాత్రలు పోషించారు.

5. సలార్:

ప్రభాస్ హీరోగా KFG డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ మూవీ 'సలార్'. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రియా రెడ్డి కీలక పాత్రలలో కనిపించనున్నారు. హాంబలే ఫిలిమ్స్ పతాకంపై రూ. 200 - 250 కోట్ల బడ్జెట్ తో విజయ కిరాగందుర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది 2023 సెప్టెంబర్ 23 వరల్డ్ వైడ్ గా విడుదల అవుతుంది.

6. లియో:

కోలీవుడ్ హీరో తలపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'లియో'. ఖైదీ, విక్రమ్ సినిమాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ చిత్రాన్ని తెరెక్కిస్తున్నారు. లోకి సినిమాటిక్ యూనివర్స్ ఫ్రాంచైజీలో భాగంగా రూ. 250 - 300 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఎస్ ఎస్ లలిత్ కుమార్ దీనికి నిర్మాత. ఇందులో త్రిష, సంజయ్ దత్, అర్జున్ సర్జా, ప్రియా ఆనంద్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. దసరా స్పెషల్ గా అక్టోబర్ 19న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.  

7. టైగర్-3:

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'టైగర్-3'. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై చిత్రాలకు ఇది సీక్వెల్. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. మనీష్ శర్మ దర్శకత్వంలో దాదాపు 300+ కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర పోషస్తున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 10న ఈ మూవీని విడుదల చేయనున్నారు. 

8. పుష్ప-2:

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'పుష్ప: ది రూల్'. ఇది 'పుష్ప: ది రైజ్' మూవీకి సీక్వెల్. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు. మైత్రీ మూవీస్ బ్యానర్ లో రూ. 200 - 250 కోట్ల బడ్జెట్ తో ఈ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2023 డిసెంబర్ లోనే ఈ సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

Read Also: రూ.1000 కోట్ల క్లబ్ లో 5 ఇండియన్ సినిమాలు - 'ఆదిపురుష్'కి ఆ జాబితాలో చేరే ఛాన్స్ ఉందా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Crime News: నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Crime News: నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Pushpa 2 First Weekend Collection: నార్త్‌లో ఆదివారం దుమ్ము దులిపిన పుష్ప 2 - అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
నార్త్‌లో ఆదివారం దుమ్ము దులిపిన పుష్ప 2 - అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Embed widget