By: ABP Desam | Updated at : 10 Jan 2023 05:57 PM (IST)
'వీర సింహా రెడ్డి'లో బాలకృష్ణ
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), సంగీత దర్శకుడు తమన్ (Thaman) ది హిట్ కాంబినేషన్. 'అఖండ' వంటి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ తర్వాత వాళ్ళిద్దరూ చేసిన సినిమా 'వీర సింహా రెడ్డి'. కరోనా తర్వాత మళ్ళీ థియేటర్లకు తండోప తండాలుగా ప్రేక్షకులను తీసుకు వచ్చిన క్రెడిట్ 'అఖండ'కు దక్కుతుంది. ఆ సినిమా తరహాలో 'వీర సింహా రెడ్డి' కూడా హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయమని తమన్ అంటున్నారు.
సౌండ్ మాట్లాడుతుంది
'అఖండ'కు తమన్ ఇచ్చిన రీ రికార్డింగ్ ప్లస్ అయ్యింది. సినిమా విడుదల తర్వాత ఎక్కువ మంది ఆర్ఆర్ గురించి మాట్లాడారు. ఈసారి 'వీర సింహా రెడ్డి' సినిమాకు కూడా ఆర్ఆర్ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా చెబుతారనే కాన్ఫిడెన్స్ తమన్ ట్వీట్‌లో కనిపించింది.
''రేయింబవళ్ళు ఒక్కటే స్లోగన్! అది మీకు తెలుసు... 'జై బాలయ్య'. 'అఖండ' తర్వాత మరోసారి బాలకృష్ణ గారు హిస్టరీ క్రియేట్ చేయబోతున్నారు. వీర సింహా రెడ్డి బ్లాక్ బస్టర్. కల్ట్ ఫిల్మ్ ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేనికి థాంక్స్. మా సౌండ్ పీక్స్ లో ఉంటుంది. మాట్లాడుతుంది కూడా'' అని తమన్ ట్వీట్ చేశారు.
Also Read : 'వారసుడు' వాయిదా వేసినా... పవర్ చూపించిన 'దిల్' రాజు
It Was Only One Slogan All Over Days & Nights U knw it ❤️🔥
IT IS #Jaibalayaa WHO IS GOONA CREATE HISTORY AGAIN AFTER THE MIGHTY #Akhanda THIS IS #BlockBusterVeeraSimhaReddy SOUND TEAM @knackstudios_
Thanks @megopichand for Giving us a CULT 🔥FILM
OUR SOUND WILL PEAK & SPEAK pic.twitter.com/cew6cUOnaj — thaman S (@MusicThaman) January 10, 2023
కంప్లైంట్స్ చేయొద్దు...
ప్రిపేర్ అయ్యి రండి!
'వీర సింహా రెడ్డి' గురించి తమన్ ట్వీట్ చేయడం ఇదేమీ తొలిసారి కాదు. ఆయన చేసే ఒక్కో ట్వీట్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. 'అఖండ' నేపథ్య సంగీతం థియేటర్లలో జనాలను ఒక ట్రాన్స్‌లోకి తీసుకు వెళ్ళింది. అయితే, అమెరికాలో కొంత మంది సౌండ్ ఎక్కువైందని కంప్లైంట్స్ చేశారు. బహుశా... ఆ విషయం తమన్ మనసులో బలంగా ఉందనుకుంట!
కొన్ని రోజుల క్రితం ''కలుద్దాం... దుమ్ము లేపుదాం! జై బాలయ్య. ఈసారి థియేటర్స్... దయచేసి కంప్లైంట్స్ చేయకండి. ప్రిపేర్ అవ్వండి'' అని తమన్ ట్వీట్ చేశారు.
'వీర సింహా రెడ్డి'కి కూడా తమన్ భీభత్సమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారని ఇండస్ట్రీ వర్గాల టాక్. దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni), తమన్ కాంబినేషన్ కూడా హిట్టే. మలినేని లాస్ట్ సినిమా 'క్రాక్'కు కూడా సూపర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.
Also Read : '3Cs' వెబ్ సిరీస్ రివ్యూ : అమ్మాయిలు డ్రగ్స్ కలిపిన వోడ్కా తాగి, ఆ 'హ్యాంగోవర్'లో రచ్చ చేస్తే?
ఆల్రెడీ 'వీర సింహా రెడ్డి' ప్రీ సేల్స్ అమెరికాలో 350కె డాలర్స్ దాటాయి. ఒక్కో షో ఫుల్ అవుతూ ఉండటంతో స్క్రీన్లు యాడ్ చేస్తూ వెళుతున్నారు. సినిమా విడుదల దగ్గర పడే సమయానికి మరిన్ని షోలు పడే అవకాశం ఉంది. ఫస్ట్ డే వన్ మిలియన్ డాలర్స్ క్రాస్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఒక్క అమెరికా నుంచి మొదటి రోజు, అంతకు ముందు ప్రీమియర్ షో కలుపుకొంటే ఎనిమిది కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందిన యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 'వీర సింహా రెడ్డి' ట్రైలర్ (Veera Simha Reddy Trailer) నందమూరి అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకుంది. పండక్కి మాంచి మాస్ సినిమా వస్తుందనే కామెంట్లు వినబడుతున్నాయి.
K Viswanath Songs: పాటంటే కేవలం పాట కాదు, అందులోనూ కథ చెప్పడం విశ్వనాథ్ స్టైల్ - అందుకే అవి క్లాసిక్స్
Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?
Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్
‘ఫరాజ్’ సినిమాకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ - స్టే నిరాకరణ, వివాదం ఏమిటీ?
K Viswanath Oscars : ఆస్కార్ బరిలో నిలిచిన తొలి తెలుగు దర్శకుడు విశ్వనాథ్
Kishan Reddy On Governer Speech : అన్నీ అబద్దాలే - తమిళిసై ప్రసంగంపై కిషన్ రెడ్డి విమర్శలు !
Lokesh Padayatra Tension : లోకేశ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత, బహిరంగ సభకు అనుమతి లేదని ప్రచార వాహనం సీజ్
Delhi YSRCP Mps : ప్రత్యేకహోదా కోసం ప్రైవేటు బిల్లు - ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ ఎంపీల కీలక ప్రకటన !
నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు