అన్వేషించండి

Thanan on Game Changer Trolls: దిగజారి ప్రవర్తించకండి- గేమ్ ఛేంజర్ ట్రోలర్స్ పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆగ్రహం

Game Changer Trolls: మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ట్రోలర్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీ కోసం పని చేస్తున్న వారిపై దిగజారుడు కామెంట్స్ చేయకూడదంటూ మండిపడ్డారు.

Thaman Responds To Trolls: తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగున్న ఎస్ థమన్, నెటిజన్ల నుంచి చాలాసార్లు ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. ఆయన సినిమాలకు సంబంధించి ఏ పాట విడుదలైనా... తరచుగా నెగెటివ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. ఫలానా సినిమా నుంచి ట్యూన్స్ ఎత్తుకొచ్చారంటూ ఒరిజినల్ ట్యూన్స్ పట్టుకొచ్చి మరీ రచ్చ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తమన్ సోషల్ మీడియా ట్రోలింగ్స్ గురించి స్పందించారు. సినీ అభిమానులతో పాటు, నెటిజన్లను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.    

దయచేసి అలాంటి కామెంట్స్ చేయకండి- తమన్

సినిమా పరిశ్రమ కోసం కష్టపడి పని చేస్తున్న వారి పట్ల అసభ్య పదజాలంతో దూషించడం సరికాదని నెటిజన్లకు తమన్ రిక్వెస్ట్ చేశారు. “డియర్ బ్రదర్స్... అంతా బాగానే ఉంది. సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం మీరు ఎంతగా ఎదురు చూస్తున్నారో ఓ టెక్నీషియన్ గా నేను అర్థం చేసుకున్నాను. మీ ప్రోత్సాహం, ప్రేమ మాకు ఎప్పుడూ ఉండాలి. మేం ఏ సినిమా చేసినా మీ కోసమే. మా సినిమాకు మీరు బ్లడ్ లాంటి వాళ్లు. కానీ కొంత మంది దిగజారుడు కామెంట్స్ చేస్తున్నారు. ఫిల్మ్ మేకర్స్ ను కించపరిచేలా హ్యాష్ ట్యాగ్స్ కొనసాగిస్తున్నారు. దయ చేసి అసభ్యకర కామెంట్స్ చేయకండి. సినిమా పరిశ్రమ కోసం ఫిల్మ్ మేకర్స్ ఎంతో కృషి చేస్తున్నారు. వారికి సపోర్టుగా ఉండి.. పాజిటివ్ ఎనర్జీతో ముందుకు సాగుదాం” అని పిలుపునిచ్చారు.    

 తమన్ రియాక్షన్ కు కారణం ఇదే!

చాలా మంది సినీ అభిమానులు తమ హీరో మూవీ అప్ డేట్స్ కోసం ఎదురు చూస్తుంటారు. రకరకాల కారణాలతో దర్శకులు, చిత్ర నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వలేకపోతాయి. దీంతో సినీ అభిమానులు ఆగ్రహం, అసహనం వ్యక్తం చేస్తుంటారు. సోషల్ మీడియా వేదికగా తమ కోపాన్ని వెల్లగక్కుతారు. కొంతమంది నెటిజన్లు హద్దు మీరి కామెంట్స్ పెడుతున్నారు. అసభ్యకరంగా, మేకర్స్ ను కించపరిచేలా హ్యాష్ ట్యాగ్స్ కొనసాగిస్తుంటారు. వెంటనే మూవీ అప్ డేట్స్ ఇవ్వాలంటూ ట్రోల్స్ చేస్తుంటారు. తాజాగా రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ విషయంలోనూ ఇదే తరహా ట్రోలింగ్ కొనసాగుతోంది. దర్శకుడు శంకర్ ఈ సినిమాను చాలా నెలలుగా తెరకెక్కిస్తున్నారు. ఎప్పుడో విడుదల అవుతుందని చెప్పినా, పలు మార్లు వాయిదా పడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో  అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేకర్స్ ను ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమాను నిర్మిస్తున్న సంస్థతో పాటు దర్శకుడిపైనా అసభ్యంగా కామెంట్స్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తమన్ స్పందించారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది చివరలో ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

Read Also: బూతు బొమ్మలు కాదు.. బాలయ్య సినిమా పడాల్సిందే - ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ‘బాలు గాని టాకీస్’ ట్రైలర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
Embed widget