Balu Gani Talkies Release Date: బూతు బొమ్మలు కాదు.. బాలయ్య సినిమా పడాల్సిందే - ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ‘బాలు గాని టాకీస్’ ట్రైలర్
Balu Gani Talkies Trailer: ఆహా వేదికగా క్రేజీ కామెడీ ఎంటర్ టైనర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘బాలు గాని టాకీస్’ పేరుతో నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతున్నది ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది.
Balu Gani Talkies Trailer Out: ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలకు థియేటర్లకు వెళ్లి సినిమా చూసే టైమ్ దొరకట్లేదు. తీరిక ఉన్నప్పుడు ఫ్యామిలీతో కలిసి ఓటీటీలో సినిమాలు చూస్తున్నారు. కరోనా తర్వాత చాలా మంది థియేటర్లకు వెళ్లడమే మానేశారు. ఓటీటీ విస్తృతి కూడా విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో పలు ఓటీటీ సంస్థలు సినిమాలు నిర్మించి నేరుగా తమ ఫ్లాట్ ఫామ్ లోనే రిలీజ్ చేస్తున్నారు. తెలుగు ఓటీటీ సంస్థ ఆహా కూడా అదే బాటలో నడుస్తోంది. తాజాగా ఈ సంస్థ నిర్మించిన సినిమా ‘బాలు గాని టాకీస్‘. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 13 నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
ఆకట్టుకుంటున్న ‘బాలు గాని టాకీస్’ ట్రైలర్
త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమా మొత్తం బాలు అనే యువకుడి సినిమా థియేటర్ చుట్టూనే తిరుగుతుంది. బాలు అనే యువకుడికి ఊర్లో థియేటర్ ఉంటుంది. ఈ సినిమా హాల్లో బూతు బొమ్మలు నడిపిస్తుంటారు. సినిమా థియేటర్ ను రన్ చేసేందుకు చాలా అప్పులు చేస్తాడు. బాలకృష్ణ ఫ్యాన్ అయిన బాలు, ఎలాగైనా తన సినిమా థియేటర్ లో నట సింహం సినిమా ఆడించాలనే కోరిక ఉంటుంది. ఇంతకీ అతడి కోరిక నెరవేరిందా? లేదా? ఈ థియేటర్ కారణంగా అతడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? అనేది ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ మూవీలో హీరో నడిపే లవ్ స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రఘు కుంచె ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించనున్నారు. తాజా ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచుతోంది. ఈ సినిమాకు బాలలయ్య అభిమానులు సైతం సపోర్టుగా నిలుస్తున్నారు. ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతుందని మేకర్స్ భావిస్తున్నారు.
హీరోగా శివ... హీరోయిన్ గా శ్రావ్య శర్మ
View this post on Instagram
‘బాలు గాని టాకీస్’ సినిమాలో శివ రామచంద్రవరపు హీరో పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే రామచంద్ర పలు సినిమాల్లో నటించాడు. వకీల్ సాబ్ లో చక్కటి పాత్రతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ‘బాలు గాని టాకీస్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రావ్య శర్మ ఫీమేల్ లీడ్ చేస్తోంది. ఈ మూవీ సెప్టెంబర్ 13 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సినిమాకు విశ్వనాథన్ ప్రతాప్ దర్శకత్వం వహించారు. శరణ్య శర్మ, రఘు కుంచె, సుధాకర్ రెడ్డి, వంశీ నెక్కంటి, సురేష్ పూజారి, శేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీనిధి సాగర్, పి రూపక్ ప్రణవ్ తేజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆదిత్య బీఎన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Read Also: వరలక్ష్మీ శరత్ కుమార్ విశ్వరూపం... 'మిస్టర్ సెలెబ్రిటీ'లో 'గజానన' పాట చూశారా?