అన్వేషించండి

వరలక్ష్మీ శరత్ కుమార్ విశ్వరూపం... 'మిస్టర్ సెలెబ్రిటీ'లో 'గజానన' పాట చూశారా?

'మిస్టర్ సెలబ్రిటీ'లో 'గజానన' పాటకు వినోద్ సంగీతం అందించగా... మంగ్లీ హుషారుగా పాడారు. భక్తి భావంతో సాగుతూ హుషారుగా వినిపించే ఈ పాటకు వరలక్ష్మీ శరత్ కుమార్ అదిరిపోయే స్టెప్పులు వేశారు.

తెలుగు సినిమాల్లో పండగల సందర్భంగా వచ్చే పాటలు గతంలో ఎక్కువగా వినపడేవి. ఇప్పుడు వాటి ప్రస్తావన బాగా తక్కువ. అందులోనూ వినాయక చవితి పాటలంటే 'దండాలయ్యా ఉండ్రాళ్లయ్యా' అంటూ అప్పట్లో విక్టరీ వెంకటేష్ పాటనే ఇంకా పాడుకుంటుంటాం. అయితే ఈ సీజన్ లో కొత్తగా ఓ పాట విడుదలైంది. 'మిస్టర్ సెలెబ్రిటీ' సినిమా నుంచి రిలీజ్ చేసిన 'గజానన' సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చింది. వినాయక చవితి సందర్భంగా ఈ పాటను విడుదల చేశారు. గజానన గజానన గజ్జెల చప్పుడు గజానన.. అంటూ సాగే ఈ పాటకు గణేష్ సాహిత్యం అందించారు. ఈ పాటలో వరలక్ష్మీ శరత్ కుమార్ సూపర్ పర్ఫామెన్స్ ఇచ్చారు. 

ఎన్నో హిట్ సినిమాలకు రైటర్స్ గా పనిచేసిన పరుచూరి బ్రదర్స్ మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా పరిచయమవుతున్న సినిమా  'మిస్టర్ సెలెబ్రిటీ' ఇటీవలే పరుచూరి వెంకటేశ్వరరావు సినిమా టీజర్ లాంచ్ చేశారు. ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాలోని వినాయక చవితి స్పెషల్ సాంగ్ ని విడుదల చేశారు. ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె మీద వినాయక చవితి పాటను చిత్రీకరించడం విశేషం.

Also Read: నందమూరి వారసుడు వచ్చాడు... బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా అనౌన్స్ చేశారోచ్

'గజానన' సాంగ్ కు గణేష్ లిరిక్స్ అందించగా వినోద్ స్వరకల్పన చేశారు. మంగ్లీ ఈ పాటను హుషారుగా పాడారు. భక్తి భావంతో సాగుతూ హుషారుగా వినిపించే ఈ పాటకు వరలక్ష్మీ శరత్ కుమార్ అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఈసారి వినాయక చవితి పందిళ్ల వద్ద ఈ పాట మారుమోగిపోతుందని అంటున్నారు. సాధారణంగా వరలక్ష్మి సినిమాల్లో పెద్దగా డ్యాన్స్ నెంబర్లు ఉండవు. స్పెషల్ క్యారెక్టర్లతో డిఫరెంట్ జర్నీ చేస్తున్న ఆమె ఈ 'గజానన' సాంగ్ లో మాత్రం స్టెప్పులతో పర్ఫామెన్స్ అదరగొట్టారని అంటున్నారు. ఈ పాట కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. దేవుళ్ల పాటల విషయంలో సింగర్ మంగ్లీ గొంతు స్పెషల్ గా ఉంటుంది. ఇప్పటికే శివుడిపై ఆమె పాడిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు శివ పుత్రుడు వినాయకుడిపై మంగ్లీ పాడిన ఈ పాట హుషారుగా ఉంది. ఈ పాట ఇప్పటికే యూట్యూబ్ లో మంచి వ్యూస్ సాధించింది. మిగతా ఆడియో ప్లాట్ ఫామ్ లలో కూడా ట్రెండింగ్ లో కి వచ్చింది. సరిగ్గా వినాయక చవితి సీజన్ లో విడుదలైన ఈ పాటను ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని తెలుస్తోంది. 

ఎన్. పాండురంగారావు, చిన్నరెడ్డయ్య ఈ సినిమాకు నిర్మాతలు. చందిన రవి కిషోర్ డైరక్షన్ లో వస్తున్న ఈ మూవీ ఇప్పటికే టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది. కొత్త పాట విడుదల కావడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. వినాయక చవితి మండపంలోనే పూర్తిగా ఈ పాట చిత్రీకరించారు. అయితే ఈ పాటతోపాటు బ్యాక్ గ్రౌండ్ లో స్టోరీ కూడా ముందుకు వెళ్తుంది. సినిమాల్లో వినాయకుడిపై పాటలు తగ్గిపోతున్న ఈ టైమ్ లో 'మిస్టర్ సెలెబ్రిటీ' మూవీ కాస్త స్పెషల్ గా కనపడుతోంది. 

Also Readవిజయ్ 'ది గోట్'కి సీక్వెల్... పవన్ కల్యాణ్ టైటిల్ మీద కన్నేసిన దళపతి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Free Gas Scheme: మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
CM Revanth Reddy: 'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
Telangana High Court: 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
Embed widget