అన్వేషించండి

Vijay: పూజా హెగ్డేతో ‘బుట్టబొమ్మ’ పాటకు డ్యాన్స్ చేసిన హీరో విజయ్ - బన్నీ ఫ్యాన్స్ ఫిదా!

అల్లు అర్జున్ ‘బుట్టబొమ్మ’ పాటకు దళపతి విజయ్ స్టెప్పులేశారు. ఆ వీడియోను పూజా హెగ్డే షేర్ చేసింది. విజయ్ డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Vijay: తమిళ స్టార్ నటుడు విజయ్ కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఆయన సినిమాలు దాదాపు అన్నీ తెలుగులో కూడా విడుదల అవుతాయి. త్వరలో లోకోష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లియో’ సినిమా విడుదల కానుంది. ఇటీవలే దళపతి విజయ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నటి పూజా హెగ్డే ఓ ఇంట్రస్టింగ్ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఇందులో విజయ్ పూజాహెగ్డేతో కలసి ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ పాట సిగ్నేచర్ స్టెప్పులేశారు. విజయ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ పూజా ఈ వీడియోను షేర్ చేసింది. పూజా హెగ్డే విజయ్ తో కలసి ‘బీస్ట్’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడే ఈ వీడియోను తన ఫోన్ లో తీసినట్టు చెప్పుకొచ్చింది పూజా. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

ఆకట్టుకుంటోన్న ‘లియో’ ఫస్ట్ లుక్..

విజయ్ నుంచి రాబోతున్న తదుపరి సినిమా ‘లియో’. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సౌత్ ఇండియాలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ రివీల్ వీడియో, ‘నా రెడీ’ సాంగ్ లు విపరీతమైన క్రేజ్ అందుకున్నాయి. తాజాగా విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ‘లియో’ నుంచి మరో అప్డేట్ ను తీసుకొచ్చారు మేకర్స్. సినిమా ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ పోస్టర్ లో విజయ్ చేతిలో ఓ సుత్తి ప‌ట్టుకొని మాస్ లుక్‌లో  క‌నిపిస్తోన్నాడు. ఈ పోస్టర్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. గ్యాంగస్టర్ రివేంజ్ స్టోరీ నేపథ్యంలో సినిమా ఉంటుందని అంటున్నారు. దీంతో ఇప్పుడు మూవీ టీజర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. 

తెలుగు రైట్స్ కు విపరీతమైన పోటీ..

‘విక్రమ్’ సినిమాతో ఒక కొత్త యూనివర్స్ ను క్రియేట్ చేశారు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఇప్పుడు రాబోతున్న విజయ్ ‘లియో’ కూడా ఎల్సీయూలో భాగమేనని టాక్ నడుస్తోంది. దీంతో ఈ సినిమాకు తెలుగులో కూడా భారీ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తికాకముందే థియేట్రికల్, ఓటీటీ, శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడిపోయినట్లు సమాచారం. ఇక తెలుగు రైట్స్ కోసం కూడా భారీ పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్ కు ఉన్న తెలుగు మార్కెట్ కంటే డబుల్ ఎమౌంట్ ను డిమాండ్ చేస్తున్నారట నిర్మాతలు. అయితే దీనిపై త్వరలోనే ఓ క్లారిటి రానుంది. 

దసరా బాక్స్ ఆఫీస్ బరిలో ‘లియో’..

విజయ్ నటిస్తోన్న ‘లియో’ మూవీ ఈ ఏడాది అక్టోబర్ 19 న ప్రేక్షకుల ముదుకు రానుంది. ఈసారి దసరాకు బాలయ్య ‘భగవంత్ కేసరి’, రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలు కూడా బరిలో ఉన్నాయి. మరి ఈ రెండు సినిమాల పోటీను తట్టుకొని ‘లియో’ ఎంతమేరకు నిలబడుతుందో చూడాలి. ఈ మూవీలో హీరోయిన్ గా త్రిష కనిపించనుంది. దాదాపు రూ.250 కోట్లతో సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పై ఎస్, ఎస్ లలిత్ కుమార్, జగదీష్ సంయుక్తంగా నిర్మించారు. 

Also Read: షారుఖ్ కూతురు తెలివైన నిర్ణయం, రూ.12 కోట్లతో ఏం కొన్నాదో తెలుసా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pooja Hegde (@hegdepooja)

టాప్ హెడ్ లైన్స్

Dil Raju : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫ్లాప్‌ - రివ్యూస్‌తో సినిమాలకు లాస్... దిల్ రాజు రియాక్షన్
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫ్లాప్‌ - రివ్యూస్‌తో సినిమాలకు లాస్... దిల్ రాజు రియాక్షన్
Idupu Kayitham: ఆంధ్ర vs తెలంగాణ గొడవకు దారి తీసిన 'ఇడుపు కాయితం'... సబ్‌ టైటిల్స్‌ కావాలా? అసలేమిటీ చర్చ??
ఆంధ్ర vs తెలంగాణ గొడవకు దారి తీసిన 'ఇడుపు కాయితం'... సబ్‌ టైటిల్స్‌ కావాలా? అసలేమిటీ చర్చ??
K Bhagyaraj : భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
Godavari Serial Today June 27th: 'గోదావరి' సీరియల్: సింహాద్రి అసలు రంగు జానుకి తెలిసిపోయిందా! రామారావు ఇంట్లో ఏం జరిగింది?
'గోదావరి' సీరియల్: సింహాద్రి అసలు రంగు జానుకి తెలిసిపోయిందా! రామారావు ఇంట్లో ఏం జరిగింది?

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
K Bhagyaraj : భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
పల్సర్ N250 నుంచి KTM 250 డ్యూక్ వరకు - 200cc-250cc రేంజ్‌లో 5 బెస్ట్ బైక్‌లు, ధరలు ఎంతంటే?
ఈ ఏడాది యువతను ఊపేస్తున్న 200cc-250cc బైక్‌లు, వాటి రేట్లు
YSRCP Leaders: అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
Crime Thriller OTT : ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Save The Tigers 4: 'టైగర్స్ 4'లో స్టార్ హీరో? మళ్ళీ కొత్త ప్లాన్‌తో మహి వి రాఘవ్?
'టైగర్స్ 4'లో స్టార్ హీరో? మళ్ళీ కొత్త ప్లాన్‌తో మహి వి రాఘవ్?
Rangasthalam Mahesh : రంగస్థలం మహేశ్ డివోర్స్ - పబ్లిసిటీ జిమ్మిక్కులు వర్కౌట్ అవ్వలేదు
రంగస్థలం మహేశ్ డివోర్స్ - పబ్లిసిటీ జిమ్మిక్కులు వర్కౌట్ అవ్వలేదు
Donald Trump Avenue In Hyderabad: హైదరాబాద్‌లోని రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్‌ పేరు! ఉప్పొంగిపోయిన అమెరికా అధ్యక్షుడు!
హైదరాబాద్‌లోని రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్‌ పేరు! ఉప్పొంగిపోయిన అమెరికా అధ్యక్షుడు!
Embed widget