అన్వేషించండి

Suhana Khan: షారుఖ్ కూతురు తెలివైన నిర్ణయం, రూ.12 కోట్లతో ఏం కొన్నాదో తెలుసా?

షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ఇటీవలే ఓ వ్యవసాయ భూమిని కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహారాష్ట్రలోని అలీబాగ్ ప్రాంతంలో..

Suhana Khan: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ కు బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. నిన్న మొన్నటి వరకూ సినిమాలకు దూరంగా ఉన్న సుహానా త్వరలోనే సినీ రంగ ప్రవేశానికి సిద్దమవుతోంది. సోషల్ మీడియాలో కూడా ఆమెకు మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె ఏం చేసినా ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటాయి. తాజాగా సుహానా ఖాన్ గురించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె ఇటీవల మహారాష్ట్ర అలీబాగ్ లో కోట్లు విలువ చేసే భూమిని కొనుగోలు చేసింది. అందుకు సంబంధించిన వార్తుల నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. 

రూ.12 కోట్లతో వ్యవసాయ భూమి కొనుగోలు చేసిన సుహానా ఖాన్..

షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ఇటీవలే ఓ వ్యవసాయ భూమిని కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహారాష్ట్రలోని అలీబాగ్ ప్రాంతంలో థాల్ అనే గ్రామంలో రూ.12 కోట్లతో 1.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసిందట సుహానా. ఇందుకు సంబంధించిన లావాదేవీలు జూన్ 1 న జరిగినట్టు రిజిష్ట్రేషన్ పేపర్లలో ఉందట. వ్యవసాయ భూమితో పాటు 2,218 చదరపు అడుగుల నిర్మాణాలు ఉన్నట్లు పేపర్లలో ఉందట. ఇందులో ఆమె వ్యవసాయవేత్తగా చూపించారని సమాచారం. ఇదే అలీబాగ్ లో షారుఖ్ కు 20 వేల చదరపు అడుగులలో అత్యంత విలాసవంతమైన బంగ్లా కూడా ఉంది. ఇందులో స్విమ్మింగ్ పూల్, హెలీప్యాడ్ ఉన్నాయి. షారూఖ్ తన 52వ పుట్టినరోజున గెస్ట్ లకు ఇక్కడే విందు ఇచ్చారు. ఇక ఈ ప్రాంతంలో దీపికా పదుకోణ్, రణవీర్ సింగ్, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల వంటి టాప్ సెలబ్రెటీలకు కూడా ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి షారుఖ్ ఖాన్ ముద్దుల కూతురు కూడా వచ్చి చేరింది. 

సుహానా ఖాన్ బాలీవుడ్ ఎంట్రీ..

సుహానా ఖాన్ కు చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండేది. అయితే ఆమె ఎక్కువగా స్పోర్ట్స్, ఆర్ట్స్ పైనే దృష్టి పెట్టింది. ఆమెకు రైటింగ్ అంటే కూడా ఇష్టమే. అయితే గతంలో ఓ షార్ట్ ఫిల్మ్ లో కూడా నటించిన సుహానా నటిగా తెరంగేట్రం చేయకుండానే సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ను పెంచుకుంది. త్వరలోనే ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. జోయా అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ది ఆర్చీస్’ అనే సినిమాలో సుహానా ఖాన్ నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ కూడా విడుదల అయింది. 1964 లో జరిగిన ఓ కథ ఆధారంగా జరిగిన కొంత మంది కాలేజీ ఫ్రెండ్స్ స్టోరీ అని తెలుస్తోంది. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాతోనే అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా, శ్రీదేవి-బోనీ కపూర్ కుమార్తె ఖుషీ కపూర్‌ లు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. మరి ఈ మూవీతో ప్రేక్షకులను ఎంతమేరకు ఆకట్టుకుంటారో చూడాలి. 

Also Read: 'ఆదిపురుష్’ వారం రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ఎంతో తెలుసా? ఇక కత్తిమీద సామే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Polavaram Project: 2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Polavaram Project: 2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
Telangana Assembly Sessions: ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
UPI Lite: యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
Visakha News: నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
Embed widget