By: ABP Desam | Updated at : 03 Aug 2022 02:56 PM (IST)
'బింబిసార' పాన్ ఇండియా రిలీజ్ లేనట్లేనా?
నందమూరి కల్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) హీరోగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ .కె నిర్మిస్తున్న సినిమా 'బింబిసార (Bimbisara Movie). ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్... అనేది ఉపశీర్షిక. ఈ సినిమాతో వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హీరోగా కల్యాణ్ రామ్ 18వ చిత్రమిది (NKR18). ఈ సినిమా ఆగస్టు 5న (Bimbisara On August 5th, 2022) ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదొక భారీ బడ్జెట్ సినిమా. ప్రచార చిత్రాలతోనే సినిమాపై బజ్ పెరిగింది. గ్రాఫిక్స్ కూడా ఓ రేంజ్ లో ఉంది. దీంతో ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేసే ఛాన్స్ ఉందనే మాటలు వినిపించాయి. దానికి తగ్గట్లే ప్రమోషన్స్ లో కళ్యాణ్ రామ్ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తే వెంటనే మిగతా భాషల్లో కూడా రిలీజ్ చేస్తారని అన్నారు. తెలుగులో ఎలాంటి రిజల్ట్ వస్తుందో.. దాన్ని బట్టి ఆలోచిస్తామని అన్నారు.
సినిమా హిట్ అయితే రెండు వారాల్లోనే మిగతా భాషల్లో రిలీజ్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అయితే దర్శకుడు వశిష్ట మాత్రం తమ దగ్గర అంత సమయం లేదని.. పాన్ ఇండియా రిలీజ్ అంటే చాలా ప్రమోషన్స్ చేస్తూ తిరగాల్సి ఉంటుందని అన్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేసే ఛాన్స్ లేదట. తెలుగు వెర్షన్ నే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో నార్త్ లో రిలీజ్ చేస్తారని టాక్. UFO మూవీస్ సంస్థ ఈ సినిమాను నార్త్ లో రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో కేథరిన్ ట్రెసా (Catherine Tresa), సంయుక్తా మీనన్ (Samyuktha Menon), వరీనా హుస్సేన్ (Warina Hussain) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి, వరికుప్పల యాదగిరి పాటలు రాస్తున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి నేపథ్య సంగీతం అందిస్తున్నారు. చిరంతన్ భట్ స్వరాలు అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్.
Also Read: తెలుగులో హీరోలు లేరా? మలయాళం నుంచి రావాలా? - దుల్కర్‌పై సంతోష్ శోభన్ షాకింగ్ కామెంట్స్
Also Read: మళ్ళీ నిఖిల్‌ను వెనక్కి పంపారు - ఆగస్టు 12న కాదు, తర్వాత రోజున 'కార్తికేయ 2'
‘హాయ్ నాన్న’ రివ్యూ, ‘యానిమల్’ ఓటీటీ రిలీజ్ అప్డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Balakrishna New Movie: బాలకృష్ణ కొత్త సినిమాలో తెలుగమ్మాయికి ఛాన్స్
Devil: థియేటర్లలోకి 'డెవిల్' వచ్చేది ఆ రోజే - కళ్యాణ్ రామ్ ఇయర్ ఎండ్ కిక్!
Abhiram Daggubati Marriage : ఓ ఇంటివాడైన దగ్గుబాటి వారసుడు - అభిరామ్ పెళ్లి ఫోటోలు చూశారా?
Bigg Boss 7 Telugu: ‘స్పై’ బ్యాచ్ చేసేవి డ్రామాలు అన్న అమర్, ఓటు అప్పీల్ విషయంలో అర్జున్‌కే దక్కిన సపోర్ట్!
Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?
Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!
New Officers in Tealngana: కొత్త ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి.శివధర్ రెడ్డి - సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి
revanth reddy take oath as telangana cm : మేం పాలకులం కాదు మీ సేవకులం - ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ తొలి సంతకం
/body>